ఇటీవలే నాగార్జున 62 సంవత్సరాలు పూర్తి చేసుకుని 63 సంవత్సరములోకి అడుగు పెట్టారు. ఆ సంధర్భంగా తాను ప్రస్తుతం నటిస్తున్న సినిమా “ది ఘోస్ట్” ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఫస్ట్ లుక్ ను చూసిన అభిమానులకి విపరీతంగా నచ్చేసింది. అయితే ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేస్తున్న ఈ ఘోస్ట్ సినిమాలో మొదట కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. కానీ విశ్వసనీయ సమాచారం ఏమిటంటే, ప్రస్తుతం ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ చేయడం లేదు. ఇలా జరగడానికి కారణం ఏమిటని ఆరా తీస్తే, అసలు విషయం బయటకి వచ్చింది.

కాజల్ ఇటీవల వివాహం చేసుకుని, ప్రస్తుతం మేరేజ్ లైఫ్ ను అనుభవిస్తోంది. ఆ సంతోషములో ఉన్న కాజల్ అగర్వాల్ తాను ప్రెగ్నెంట్ అయిన విషయం ఇటీవలే బయట పడింది. దాంతో నాగార్జునతో చేస్తోన్న సినిమాపై కాజల్ ప్రెగ్నెన్సీ ప్రభావం తీవ్రంగా పడింది. కాజల్ ఇక ప్రెగ్నెంట్ కాబట్టి, షూటింగ్స్ హాజరు కావడానికి కుదరదు అని తన ఫ్యామిలీ డాక్టర్స్ చెప్పారట.అందువల్ల ఈ ముద్దుగుమ్మ “ది ఘోస్ట్” సినిమా నుండి తప్పుకున్నట్టు సమాచారం. దాంతో ది ఘోస్ట్ సినిమా యూనిట్ మరో హీరోయిన్ కోసం వేట మొదలుపెట్టారు. ఈ వేటలో వాళ్ళకి దొరికిన మరో హీరోయిన్ అమలా పాల్. ఈమె ది ఘోస్ట్ సినిమా కోసం ఇటీవలే సైన్ చేసింది. అతి త్వరలో అమలా పాల్ సెట్స్ లో ఆ సినిమా యూనిట్ తో జాయిన్ కానుంది.
అయితే అమలా పాల్ తో పాటుగా నాగార్జునతో హీరోయిన్స్ గా మరో ఇద్దరు భామలను ఇప్పటికే ఆ చిత్ర యూనిట్ సెలెక్ట్ చేసింది. ఒకరు బాలీవుడ్ హీరోయిన్ గుల్ పనాగ్ కాగా, మరొకరు అనీఖా సురేంద్రన్. శరత్ మరార్,నారాయణ దాస్ నారంగ్,పుష్కర్ రామ్మోహన రావు కలిసి కంబైన్డ్ గా నిర్మిస్తోన్న ఈ సినిమాకి కెమెరా ముఖేష్ జీ. శరవేగంగా షూట్ జరుపుకుంటోన్న ఈ సినిమా త్వరగా ముస్తాబు అయ్యి, ప్రేక్షకులను అతి త్వరలో అలరించబోతోంది.