karthika-deepam-doctor-babu

మెగాస్టార్ త‌ల్లి కూడా డాక్ట‌ర్ బాబుకు వీరాభిమాని..’నన్ను సొంత కొడుకులా చూస్తారు ..’ : నిరుప‌మ్‌

News

నిరుపమ్ పరిటాల అలియాస్ డాక్టర్ బాబుగా బుల్లితెర తెల‌గు పేక్ష‌కుల అభిమానన్ని సంపాదించి పెట్టిన సీరియ‌ల్ కార్తీక దీపం . అందులో కార్తీక్‌ గా నటించిన నిరుప‌మ్ ప‌రిటాల అంటే చాలా తక్కువమంది గుర్తుప‌డుతారు ఏమో కానీ, డాక్ట‌ర్ బాబు అంటే మాత్రం తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కులు మాత్రం ట‌క్కున గుర్తుపట్టేస్తారు. నిరుప‌మ్ ఒక సినిమాలో విల‌న్‌గా కూడా యాక్ట్ చేసాడు అయిన కూడా అతనికి వెండితెరపై స‌రైన గుర్తింపు రాలేదు.

దాంతో అతను బుల్లితెర‌పై త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకున్నాడు. అతను ఫేమస్ సీరియల్స్ అయిన చంద్ర‌ముఖి మరియు కార్తీక‌దీపం వంటి సీరియ‌ల్స్‌లో న‌టించి తనకంటూ చక్కటి గుర్తింపు తెచ్చుకున్నాడు.

mega star mother

నిరుప‌మ్ ప‌రిటాల యొక్క తండ్రి కూడా బుల్లితెర ర‌చ‌యిత గా పని చేశారు, అయితే నిరుప‌మ్ తండ్రి ఓం కార్ కు త‌న కొడుకు న‌టుడు అవ్వొద్దు అనే ఉండేదటా. త‌న కొడుకు బాగా చదివి ఏదో ఇక చిన్న జాబ్‌లో స్థిర ప‌డాల‌నుకున్నాడాట‌. కానీ నిరుపమ్ కి న‌ట‌న‌పై ఇంట్రెస్ట్ ఉండ‌డంతో ఈ రంగంలో అడుగుపెట్టాడు. నిరుప‌మ్ కేవలం నటుడిగా మాత్రమే కాదు మంచి రైటర్ గాను తండ్రి వార‌స‌త్వంను పునికిపుచ్చుకున్నాడు. నిరుపమ్ అలియాస్ డాక్టర్ బాబు రెండు సినిమాల‌కు రైటర్ గా కూడా ప‌ని చేశాడు. ఇదంతా ఒకెత్తాయిట్జ్ ఇప్పుడు నిరుప‌మ్ హిట్ల‌ర్ పెళ్లాం సీరియ‌ల్ కి ప్రొడ్యూసర్ గా ఉంటున్నాడు. అయితే నిరుపమ్ కి మంచి ఛాన్సులు వ‌స్తే తప్పకుండా మూవీస్ లో కూడా న‌టిస్తాడ‌ట‌.

nirupam paritala

ఇదిలా ఉండగా నిరుప‌మ్‌ దాదాపుగా 10 సీరియ‌ల్స్‌కు పైగా న‌టించినప్పటికి కార్తీక‌దీపం సీరియ‌ల్ లో డాక్టర్ బాబు పాత్ర అతనికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఈ డాక్ట‌ర్ బాబు న‌ట‌న‌కు మూవీ సెల‌బ్రెటీస్ దగ్గర్నుండీ మొదలు పెడితే రాజ‌కీయ నాయ‌కుల వరకు నవిపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు నిరూపమ్. అంతే కాదు ఈ సీరియల్ లో అతని నటనకు ఏకంగా స్టార్ కమెడియన్ బ్ర‌హ్మ‌నందం గారు ఫోన్ చేసి మ‌రి అతన్ని అభినందించాడట.

అయితే టాలీవుడ్‌లో ఏకంగా డ‌జ‌నుకు పైగా హీరోలు కలిగిన మెగా మ‌ద‌ర్ అయిన అంజ‌నాదేవి గారు కూడా డాక్ట‌ర్ బాబు కు చాలా పెద్ద అభిమానియట.నిరుపమ్ కు చిరంజీవి తల్లి గారు ప్ర‌తి సంవత్సరం స్పెషల్ గా ఒక గిఫ్ట్ పంపుతారట. ప్ర‌తి వేస‌వి కాలంలో మామిడి ప‌ళ్లు కూడా పంపిస్తారట. త‌న‌ను చిరంజీవి గారి తల్లి అయిన అంజ‌నాదేవి గారు తన సొంత కొడుకులా చుస్తార‌ని నిరుప‌మ్ చాలా సార్లు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *