కత్తి మహేష్ చనిపోతే ఏంటి .? నేను నిజాన్ని సమాధి చేయను..అసలు జరిగిందేంటంటే.. : శ్రీధర్ నల్లమోతు

News

సినీ విమర్శకుడు మరియు నటుడు కత్తి మహేష్ చనిపోయిన రోజు నుండి ఒక్కొక్కరు ఒక్కో రకంగా అతని మరణం పై స్పందిస్తున్నారు. అతను బ్రతికున్నప్పుడు శ్రీ రాముల వారి గురించి మరియు పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యల గురించి సోషల్ మీడియా లో విపరీతంగా చర్చలు జరుగుతున్నాయి. కొంతమంది అతను చనిపోయినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తుంటే ఇంకొంతమంది చనిపోయిన వ్యక్తి గురించి సంతోషించడం ఏంటి అంటూ కత్తి మహేష్ ఆత్మ శాంతిని కోరుకుంటూ పోస్టులు పెడుతున్నారు.

ఇప్పటికే కత్తి మహేష్ మరణం పై స్పందిస్తూ శ్రీ రెడ్డి , పూనమ్ కౌర్ లు వారి వారి రియాక్షన్స్ తెలియజేసిన సంగతి తెలిసిందే.అయితే టెక్నాలజీ ప్రభావం, ఆన్లైన్ సెక్యురిటి మరియు వ్యక్తిత్వ వికాసం లాంటి విషయాల పై ప్రజలకు అవగాహన కలిపిస్తూ అప్పుడప్పుడు సామాజిక అంశాలపై స్పందించే శ్రీధర్ నల్లమోతు తాజాగా కత్తి మహేష్ మరణం పై స్పందించారు, సోషల్ మీడియా లో ఇపుడు అతని పోస్టు విపరీతంగా వైరల్ అవుతుంది.అంతే కాకుండా ఒక వ్యక్తి మరణించాక ఇలాంటి కామెంట్స్ ఏంటి అని ప్రశ్నించే వారికి సమాధానంగా అతను ఇలా వ్రాశారు.

“ఒక వ్యక్తి గా మరియు మంచి స్నేహితుడిగా కత్తి మహేష్ పైన నాకు అపారమైన గౌరవం మరియు ప్రేమ ఉన్నాయి.అయినప్పటికి కూడా కొన్ని విషయాల గురించి ఇప్పటికైనా నేను ప్రస్తావించకపోతే అవి కనుమరుగైపోతాయి ఏమో అనే భయంతో ఈ విషయాలు రాస్తున్నా.చాలా మంది కత్తి మహేష్ ను మహా మేధావి మరియు చక్కటి ఆలోచనా పరుడు అంటూ అభిప్రాయపడుతున్నారు. నిజమైన మేధావితనం ఈ సమాజాన్ని ప్రశాంతంగా ఉంచుతుందే తప్పా ప్రజలలో అశాంతి ని రెక్కేత్తించదు అని మనలో చాలా కొద్దిమందికే తెలుసు.

కత్తి మహేష్ అణగారిన జనాలకు ఒక బలమైన స్వరం అని అంటారు, చాలా సంతోషం ప్రతీ వర్గం లో అలాంటి వాడు ఒకడు కచ్చితంగా ఉండాలి అని నేను కూడా కోరుకుంటాను.కానీ అణగారిన ప్రజలకు శ్రీ రాముడు ఏమైనా అన్యాయం చేసాడా? లేదా పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా వారిపట్ల అన్యాయంగా ప్రవర్తించాడా? లేదు కదా? మరి అలాంటప్పుడు ఎందుకు వారిపై విషం కక్కుతూ ప్రజల్లో విష బీజాలు నాటడానికి ప్రయత్నించారు? శ్రీ రాముడు ఉన్నాడో లేడో ప్రక్కన పెట్టండి. ఈ ప్రపంచం లో కొన్ని కోట్ల మంది అతన్ని దేవుడిగా ఆరాధిస్తున్నారు. ప్రజల అభిప్రాయాన్ని నిజమైన మేధావి కచ్చితంగా గౌరవిస్తాడు. నేను ఎందుకో కత్తి మహేష్ లో ఈ లక్షణాలు కనుగొనలేదు. ఇతరుల విశ్వాసాలను గౌరవించలేనప్పుడు అతనిని మేధావి అని ఎలా అనగలం.? ఫేమస్ అవ్వడానికి ఏదో ఒక సంచలనం సృష్టించే అంశాలపై మాట్లాడాలి అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారు కొంతమంది ప్రముఖులు.

నేను కత్తి మహేష్ కలిసి NTV లో ఒక డిబేట్ లో పాల్గొనడానికి వెళ్ళాం అప్పుడు నేను కత్తి మహేష్ ఏకాంతంగా ఉన్నప్పుడు , ఎందుకు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు మహేష్ గారు అని అడిగినప్పుడు అంతను ‘ రాజకీయాల్లో కి రావాలంటే తప్పదుగా ‘ అని సమాధానం ఇచ్చారు. అప్పుడు అతని ఎజెండా తెలుసుకొని ఆశ్చర్యపోయాను. తన రాజకీయా ప్రవేశం కోసం ప్రజలను తప్పుద్రోవ పట్టించడం ఎంతవరకు మేధావి లక్షణమో మీ విజ్ఞతకే వదిలేస్తున్నా..” అని అతను అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *