సీనియర్ నటుడు కోట శ్రీనివాస రావు గారు తెలుగు వాడే అయినప్పటికీ, తెలుగులో మాత్రమే కాక తమిళ, కన్నడ, హిందీ భాషలలో కూడా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నారు. కోట గారు ఎవరి విషయంలోనైనా ఒకేలా స్పందిస్తారు. ఇటీవల ఓ మీడియా ఛానల్ లో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ నాటి రోజుల్లో జరిగిన సంఘటనల గురించి సంచలన విషయాలను తెలియ జేశారు.
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లో నటుడిగా కోట శ్రీనివాస రావు గారిది సుధీర్ఘ ప్రయాణం అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో అద్భుతమైన పాత్రలు చేసి ప్రేక్షకులను తన వైపు ఆకట్టుకున్న గొప్ప నటుడు. గత నాలుగు దశాబ్దాలుగా ఆయన సినీ రంగం లో రనిస్తూ కొన్ని వందల సినిమాల్లో కమెడియన్‌గా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు.కోట గారు తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో మధుర జ్ఞాపకాలను, సంఘటనలను మీడియా ముందు పంచుకున్నారు.

అదే క్రమంలో ఆయన ‘జంబలకిడిపంబ’ సినిమా గురించి కూడా పలు ఆసక్తికరమైన విశేషాలు పంచుకున్నారు.ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించి రూపొందిన ఈ సినిమాకి 50 లక్షల రుపాయల బడ్జెట్ కార్చయిందట. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిందాని కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బ్రహ్మానందం, ఆలీ, బాబు మోహన్, ఐరన్ లెగ్ శాస్త్రి కోట శ్రీనివాస రావు మొదలగు కమెడియన్స్‌తో ఈవీవీ చేసిన ప్రయోగం ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకుంది.
కానీ ఈ చిత్రం షూటింగ్ చేసేటప్పుడు చాలామంది విమర్శించారట, ఇంకొందరు నవ్వుకున్నారట. చిత్రికరణ సమయం లో దర్శకుడు ఈవీవీ గారు అందరినీ కూర్చోబెట్టి కథ చెప్పినప్పుడు ఎంతో ఆసక్తిగా అనిపించిందని కోట శ్రీనివాస రావు గారు చెప్పుకొచ్చారు.
ఈ సినిమా చిత్రీకరణ జరిగిన సమయం లో మగవాళ్ళు ఆడవాళ్లు గా నటించాలి కాబట్టి, మగవాళ్ళం అందరం కలిసి పదిహేను రోజులు విశాఖపట్నంలో మంగళసూత్రాలు మెడలో వేసుకొని తిరిగారట.

ఆ సినిమా షూటింగ్ సమయంలో ‘ఇలాంటి పాత్రలు వేసే కంటే వ్యభిచారం చేసి బతకొచ్చు కదా’ అని ఓ డైరెక్టర్ ఎవరితోనో అన్నారట అది ఆ నోటా ఈ నోటా తిరిగి దర్శకులు ఈవీవీ వరకూ వెళ్ళిందట అప్పుడు ఆయన ఆ విషయాన్ని నాతో చెప్పి చాలా బాధపడ్డారు అని తెలియపరిచారు. అలాగే ఈ సినిమాపై ప్రముఖ దర్శకుడు జంధ్యాల గారు కూడా పరిహసించినట్టుగా మాట్లాడాడు. కానీ సినిమా రిలీజైయక, బ్లాక్ బస్టర్ అవ్వటం తో అందరూ షాకయ్యారట, ఇలా కోట గారు ఆనాటి పరిస్థితులను పంచుకున్నారు…