టాలీవుడ్ లో కుండ బద్దలు కొట్టినట్లుగా సూటిగా మాట్లాడే వ్యక్తుల్లో కోట శ్రీనివాసరావు అందరికన్నా ముందుంటారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన చాలాసార్లు చాలా ఇంటర్వ్యూలల్లో ఈ విషయాన్ని ప్రూవ్ చేశారు కూడా. ఇండస్ట్రీలో ముక్కుసూటిగా మాట్లాడతాడు అనే పేరు కూడా కోట శ్రీనివాసరావు గారికి ఉంది. ఆయన తాజాగా ఎంతో ఫేమస్ అయిన జబర్దస్త్ మరియు బిగ్ బాస్ వంటి షో ల గిరించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. చాలా మంది ప్రజలు కోట శ్రీనివాసరావు వాస్తవం మాట్లాడారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.కమెడియన్స్ ఫ్యాక్టరీ అనే బ్రాండ్ మెయింటైన్ చేస్తున్న జబర్దస్త్ షో యొక్క ఆర్టిస్టులపై షాకింగ్ కామెంట్స్ చేసాడు కోట శ్రీనివాసరావు గారు.
యాంకర్ ఒక ఇంటర్వ్యూలో కోట శ్రీనివాసరావును జబర్దస్త్ కామెడీ షో గురించి కొన్ని విషయాలు పంచుకొమ్మని అడిగినప్పుడు.ఆయన జబర్దస్త్ షో గురించి ఏం చెప్పమంటారు. ఆ షోలో ఆర్టిస్టులు ఏవేవో పిచ్చి పనులు చేస్తుంటారు ఇంతకన్నా ఇంకేం చెప్పాలి.? నేను ఒక షూటింగ్లో ఉన్నప్పుడు.ఇద్దరు వ్యక్తులకు ఒకే కారవన్ ఎలా ఇస్తారు అంటూ మ్యానేజెర్ తో గొడవ పడడం నేను గమనించి వారు ఎవరని నేను అడిగాను. అప్పుడు వారు జబర్దస్త్ ఆర్టిస్టులు అని చెప్పారు, జబర్దస్త్ ఆర్టిస్టులు అంటే జబర్దస్త్ గా నటించేవారు అనుకున్న కానీ వాళ్ళు జబర్దస్త్ అనే షో లో పని చేసే ఆర్టిస్టులు అని అప్పుడు తెలిసింది. అది వాళ్ల క్వాలిఫికేషన్, వాళ్ల గుర్తించి ఏం మాట్లాడాలి అంటూ జబర్దస్త్ ఆర్టిస్టులపై షాకింగ్ కామెంట్స్ చేశారు కోట శ్రీనివాసరావు.
పనిలో పనిగా బిగ్ బాస్ షో లో పాల్గొనే కంటెస్టెంట్లను కూడా ఒక వరుస ఆడుకున్నాడు. ‘బిగ్ బాస్ లో పని లేని వారు మాత్రమే పాల్గొంటారని, ఆ షోను పని కట్టుకొని పని లేని వారే చూస్తారని’ సంచలన వ్యాఖ్యలు చేసాడు.అసలు నేను బిగ్ బాస్ చూడను అసలు అందులో ఏముంటుంది.? వాళ్ళను ఏదో అడుగుతారు వారు చెప్తుంటారు అంతేగా. అదేమన్న ప్రపంచానికి ఉపయోగపడే కార్యక్రమమా అంటూ తనదైన శైలిలో ఈ రెండు మోస్ట్ పాపులర్ షోల పైన విరుచుకుపడ్డారు ఈ సీనియర్ నటుడు.