లావణ్య త్రిపాఠి: టాలీవుడ్ లోని ఓ బడా ఫ్యామిలికి కోడలు కాబోతున్న మరో స్టార్ హీరోయిన్..!

Movie News Trending

హీరోయిన్ లావణ్య త్రిపాఠి గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. తన నవ్వుతో తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను ఎంతగానో అట్రాక్ట్ చేసుకుంది. అయితే ఈ భామ అందాల రాక్షసి సినిమా తో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి మంచి సక్సె అందుకున్నప్పటికి ఆమె ఈ చిత్రం తర్వాత నటించిన ఏ సినిమా కూడా ఆశించినంత ఫలితం చూపించలేకపోయాయి. అయితే నాని హీరోగా తెరకెక్కిన భలే భలే మగాడివోయ్ చిత్రంతో ఆమె మళ్ళీ ఫార్మ్ లోకి వచ్చారు. తరువాత నాగార్జున గారితో సోగ్గాడే చిన్ని నాయనా మూవీ లో నటించేందుకు అవకాశం దక్కించుకుంది. మరియు ఈ చిత్రంతో తెలుగు ప్రయక్షకులకు మరింత దగ్గరయ్యింది లావణ్య.

lavanya-tripathi-pic

సినిమాలలో లావణ్య త్రిపాఠి ఎంత సంప్రదాయంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్సపోసింగ్ కు ఆమడ దూరంలో ఉంటూనే మంచి గుర్తింపు కూడా సొంతం చేసుకున్నారు లావణ్య.అయితే ఈ మధ్య కాలంలో ఆమెకి ఇలా ఉంటే సినిమా అవకాశాలు రావనుకుందో ఏంటో మరీ సోషల్ మీడియా లో ఎక్సపోసింగ్ చేస్తూ ఫోటోలు అప్లోడ్ చేస్తున్నారు. పొట్టి దుస్తులతో ఆమె తెగ అందాలను ఆరబోస్తున్నారు.

lavanya-tripathi-photos

ఆమె అభిమానులు మాత్రం షాక్ అవుతున్నారు.ఉన్నట్టుండి లావణ్యలో ఇలాంటి మార్పు ఎలా వచ్చిందబ్బా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే ఈ నటి అక్కడికే ఆగకుండా ఆమె తాజా చిత్రం ఏ1 ఎక్స్ప్రెస్ లో మొట్టమొదటి సారిగా లిప్ కిస్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి.ఏదేమైనా ఇలాంటి సడన్ చేంజ్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

అయితే తాజాగా వస్తున్న వార్తలను అనుసరించి..లావణ్య త్రిపాఠి టాలీవుడ్ లో ఒక బడా ఫ్యామిలీ హీరోతో పీకల్లోతు ప్రేమలో ఆడిపోయిందట.వారి ఈ ప్రేమ విషయాన్ని ఇరువురి ఇళ్లల్లో కూడా చెప్పేసారట,త్వరలోనే వారు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని టాలీవుడ్ లో ఈ వార్త చర్చనీయాంశంగా మారింది.అయితే ఎవరా హీరో.? టాలీవుడ్ లో ఆ బడా ఫ్యామిలీ ఎవరిదై ఉంటుంది అంటూ ఆలోచనాలో పడ్డారట ఈ అందాల రాక్షసి అభిమానులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *