‘మెగాస్టార్ చిరంజీవి సినిమాకి డైలాగ్స్ రాయడమే నాకు శాపంగా మారింది..’ షాకింగ్ కామెంట్స్ చేసిన ఎల్.బి. శ్రీరామ్

Movie News

LB Sriram : మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి ఆయన మూవీస్ లో పనిచేయాలని దక్షిణ భారత సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాదు నార్త్ ఇండియాలోనూ ఎంతో మంది స్టార్స్ మరియు టెక్నీషియన్స్ ఉవ్విళ్లూరుతుంటారు. టాలీవుడ్ లో ఒక మెగా ఫ్యామిలీ కి చెందిన హీరోలు మాత్రమే కాదు పరిశ్రమ లో చిన్న నుంచి పెద్ద హీరోలు ఆయనతో కొన్ని సెకండ్స్ స్క్రీన్ ను పంచుకోవాలని ఎంతగా కోరుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తమ కెరీర్ లో ఒక్కసారైనా మెగాస్టార్ చిరంజీవి మూవీకి వర్క్ చేయాలని డైరెక్టర్స్,రైటర్స్, అంతేకాకుండా అతనితో ఒక్క మూవీనైనా ప్రొడ్యూస్ చేయాలని బడా నిర్మాతలు, ఇంకా మెగాస్టార్ తో కలిసి ఒక్క స్టెప్పైనా వేయాలని హీరయిన్స్ ఎంతగానో తహతహలాడుతుంటారు అని ఇప్పటికే ఎన్నో సందర్భాలలో ఎంతో మంది సెలబ్రిటీలు వెల్లడించారు.

కానీ అందరిని ఆశ్చర్యపరిచే ఉషయం ఏంటంటే ఓ ప్రముఖ నటుడు మరియు రచయిత మాత్రం మెగాస్టార్ చిరంజీవి గారి మూవీకి వర్క్ చేయడం నాకో పెద్ద శాపం అని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ఎవరని ఆలోచిస్తున్నారా.? అతను ఇంకెవరో కాదు మనందరిని తనదైన హాస్య శైలిలో కడుపుబ్బా నవ్వుంచిన ఎల్.బి.శ్రీరామ్ .

ఈవీవీ సత్యనారాయణ లాంటి బడా డైరెక్టర్ల సినిమాలకి పనిచేయడంతో పాటుగా డైలాగ్స్ కూడా రాశారు ఎల్.బి.శ్రీరామ్ .అందుకోసమే అతని కి నటుడిగానూ మంచి క్రేజ్ తీసుకు వచ్చారు దర్శకులు ఈవీవీ సత్యనారాయణ. అంతే కాదు ఆయన రచయితగా సెన్షేషనల్ హిట్ గా ఘనవిజయం సాధించిన నాగార్జున, సౌందర్యల చిత్రం హలో బ్రదర్,హీరో రాజేంద్ర ప్రసాద్ కి హిట్స్ ఇచ్చిన అప్పుల అప్పారావు, ఏప్రిల్ 1 విడుదల లాంటి మూవీస్ కి తనదైన శైలిలో డైలాగ్స్ రాసి బాగా ఫేమస్ అయ్యారు ఎల్.బి. శ్రీరామ్ గారు.

అయితే ఆ టైంలో మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ మూవీ హిట్లర్‌కి డైలాగ్స్ రాసే ఛాన్స్ అందుకున్నారు. ప్రముఖ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య ఈ చిత్రానికి డైరెక్షన్ చేసాడు.ఈ చిత్రం లో అప్పటి టాప్ హీరోయిన్స్ లో ఒకరైన రంభ మెగాస్టార్ సరసన నటించింది.

ఇందులో రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషించారు.అంతేకాదు ఈ మూవీ ద్వారా నేటి మోస్ట్ పాపులర్ కొరియోగ్రాఫర్ మరియు డైరెక్టర్ రాఘవ లారెన్స్ డాన్స్ మాస్టర్‌గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

అయితే ఆ హిట్లర్ మూవీ కి డైలాగ్స్ రాయడంతో అతను బాగా పేరు సంపాదించి చాలా ఫేమస్ అయ్యాడు. ఈ సినిమా కి ఆయన రాసిన సింపుల్ డైలాగ్స్ మెగాస్టార్ చురంజీవి లో కొత్త మేనరిజాన్ని చూపించాయి. అయితే అతను హిట్లర్ చిత్రానికి పనిచేశాక స్టార్ రైటర్ గా అయ్యాడని ఇండస్ట్రీలో చాలామంది ఆయనకి ఛాన్సులు ఇవ్వడానికి సందేహించారు.

ఇంకా చిన్న చిన్న మూవీస్ తీసేవారు అయితే అసలు అతని దగ్గరికి రాడానికే బయపడేవారు. అలా హిట్లర్ సినిమా ద్వారా రచయితగా ఆయన కెరీర్ దెబ్బతినిందని ఆయనే ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారు.

చిరంజీవి వర్గానికి కష్టాలే

చిరంజీవితో హీరోయిన్లు గా నటించి తర్వాత

చిరంజీవి తో పాటే ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు కానీ 

డిప్రెషన్ తో అంతా ముగించాలి అనుకున్నప్పుడు మెగాస్టార్ నాకు ధైర్యం చెప్పారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *