madhavi-latha-comments-bigg-boss-shanmukh-jaswanth

Biggboss: పక్కోడి పెళ్ళానికి ఈ హగ్గులు ఏంటి?షణ్ముఖ్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన మాజీ హీరోయిన్

Trending

రాను రాను బిగ్ బాస్ సీజన్ 5 ప్రోగ్రామ్ దారుణంగా తయారు అవుతోంది అని మాజీ హీరోయిన్ మాధవీలత సోషల్ మీడియా సాక్షిగా ఘాటైన కామెంట్స్ చేస్తోంది. బిగ్ బాస్ లో అందరూ చాలా అతి చేస్తున్నారని, ముఖ్యంగా షణ్ముఖ్ ప్రవర్తన రోజురోజుకీ ఒక సైకోలా మారుతోంది అని అంటోంది ఈ ముదురు భామ. షణ్ముఖ్ ప్రతీసారి సిరి హనుమంత్ కి హగ్గులు ఇస్తున్నాడని, ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినా షణ్ముఖ్ పట్టించుకోవడం లేదని వాపోయింది.

షణ్ముఖ్, హౌస్ లో తనకి తాను ఒక బ్రహ్మలా ఫీల్ అవుతున్నాడని అంటూనే, సిరి మదర్, హౌస్ లోకి వచ్చినప్పుడు హగ్గులు,ముద్దు పెట్టుకోవడాలు లాంటి చేయవద్దని వార్నింగ్ ఇచ్చినా,షణ్ముఖ్ ప్రవర్తనలో ఎటువంటి మార్పు రావడం లేదంటోంది మాధవీలత. ప్రతీసారి ఏదో ఒక వంకతో సిరిని హగ్ చేసుకోవడమే కాకుండా ముద్దులు సైతం పెడుతున్నాడని చెబుతూనే, ఇందుకు సిరి కూడా సిగ్గు లేకుండా షణ్ముఖ్ తో అలా చేయడం ఏంటని సోషల్ మీడియాలో వీడియోస్ పెడుతోంది. బిగ్ బాస్ హౌస్ లో షణ్ముక్ ఒక పర్వెర్టెడ్ మనిషి అని వాపోయింది. మిగతా కంటెస్టెంట్స్ అందరూ ఎవరి హద్దుల్లో వారు ఉంటున్నా, షణ్ముఖ్ మాత్రం ఒక మానసిక రోగి వలే ప్రవర్తిస్తూ,శ్రీహస్ ఫియాన్సీ అయిన సిరిని తన కంట్రోల్ లో పెట్టుకుంటూ, హగ్గులు మీద హగ్గులు ఇవ్వడమే కాకుండా,ప్రక్కోడి పెళ్ళానికి ముద్దులు సైతం పెడుతున్నాడని అంటోంది ఈ భామ.

madhavi-latha-comments-bigg-boss-shanmukh-jaswanth

అయితే నిజానికి షణ్ముఖ్ ఇలా సిరితో ప్రవర్తించడంలో షణ్ముఖ్ పాత్ర కంటే, సిరి ప్రోత్సాహమే ఎక్కువగా ఉంటోంది అని మరికొందరు నేటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రతీసారి ఇలా ఇద్దరూ హగ్స్ చేసుకోవడం, మళ్ళీ కెమెరాతో కేవలం “ఇది ఫ్రెండ్షిప్ హగ్” అని చెప్పుకోవడం చాలా ఎబ్బెట్టుగా ఉంటోంది. బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్ జస్వంత్ ఒక దిష్టిబొమ్మలా తయారయ్యాడు అని మరికొందరి నేటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ షణ్ముఖ్ ను హౌస్ నుండి బయటకి పంపించే సమయం వచ్చిందని అంటున్నారు కొందరు నేటిజెన్స్. ప్రతీ విషయములో కలుగ జేసుకుంటూ, హౌస్ మేట్స్ తో గొడవ పెట్టుకోవడం షణ్ముఖ్ కి బాగా అలవాటు అయ్యిందనీ,సిరి ఏం చేసినా వంద వంకలు పెడుతూ, సిరి కాన్ఫిడెన్స్ ను దెబ్బతీస్తూ,షణ్ముఖ్ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడుతూ ఉన్నాడని మెజారిటీ నేటిజెన్స్ అభిప్రాయ పడుతున్నారు.

అయితే మిగతా హౌస్ మేట్స్ అందరూ షణ్ముఖ్ ప్రవర్తనపై ఓపిక పడుతున్నా, షణ్ముఖ్ అందరితో గిల్లికజ్జాలు పెట్టుకుంటూ, వీడి చేష్టలు రోజు రోజుకీ ఎక్కువ అవుతున్నాయి అని సోషల్ మీడియాలో పలువురు తీవ్రంగా కామెంట్స్ చేస్తునాడు అనీ, అలాగే హోస్ట్ నాగార్జున కూడా షణ్ముఖ్ ను వెనకేసుకొస్తున్నాడు అనేది రెగ్యులర్ గా బిగ్ బాస్ ఫాలో అయ్యే వీక్షకుల అభిప్రాయంగా కనపడుతోంది. అంతేకాకుండా హోస్ట్ నాగార్జున, సన్నీ చిన్న తప్పు చేసినా, పెద్దవి చేస్తూ మాట్లాడుతున్నారని పలువురు  ఆవేదనగా చెందుతున్నారు.

Leave a Reply

Your email address will not be published.