వివాహ బంధం అనేది జన్మజన్మల సంబంధం అంటారు కొందరైతే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని అంటారు. ఇంత విలువగా చూసే ఈ బంధాన్ని నిలబెట్టుకోవాలి అంటే భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాకుండా ఇద్దరికీ సమానమైన బాధ్యత కలిగి ఉండాలి. అప్పుడే వివాహ బంధం అనేది బలంగా ఉంటుంది అలా అర్థం చేసుకున వారి జీవితం పదిలంగా ఉంటుంది. కానీ అపార్థం అనుమానం వంటివి భార్యాభర్తల మధ్య లోకి వస్తే ఇంకా ఆ బంధం నిలబడనట్టే.
అయితే కొంతమంది భార్యాభర్తలు వాళ్ళ జీవితాన్ని బయటపెట్టి నవ్వులపాలు కావడం కంటే నోరుమూసుకొని బాధ లతోనే వివాహ బంధాన్ని కొనసాగిస్తూ ఉంటారు మరికొందరైతే సీక్రెట్ గా విడి పోతూ ఉంటారు. సినీ ఇండస్ట్రీలో కూడా ఇది సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది అయితే నటీనటులు పరువు గురించి ఆలోచించుకుని కారణాలు ఏవైనప్పటికీ బయటకు చెప్పకుండా సీక్రెట్ గా విడిపోతూ ఉంటారు వారిలో కొంతమంది మాత్రమే విడిపోవడానికి కారణాలు బయట పెడుతుంటారు. ఇలాంటి కథే తాజాగా విడిపోయినా నాగ చైతన్య సమంతలది కూడ.
సమంత నాగ చైతన్యలు విడిపోయాక వారి విడాకులకు గల కరనమెంటో తెల్సుకోవాలని సర్వత్ర ఉత్కంట నెలకొంది . అయితే ఇదే సమయం లో కొంత మంది ప్రైవేటు మీడియా వాల్లు నాగచైతన్య సమంతా లు విడిపోటానికి కారణాలు రక రకాలుగా ప్రసారం చేస్తూ ఉన్నారు వాలలో మెయిన్ స్ట్రీమ్ న్యూస్ ఛానల్ కూడా ఉండటం విశేషం .నాల్గు గోడల మద్య భార్య భర్తల మద్య జరిగిన పర్సనల్ మ్యాటర్ ఇదే నని రక రకాల కథనాలు అల్లెస్తున్నారు. ముఖ్యంగా సమంతాకు అక్రమ సంబంధం ఉందని ఆ కారణం వల్లనే వారి విడిపోవాల్సి వచ్చింది అని వార్తలు సృష్టిస్తున్నారు.
సమంత నాగచైతన్య లు ఏ కారణంతో విడిపోతున్నారు అనే విషయాన్ని బయట పెట్టక పోయే సరికి ఎవరికి నచ్చినట్టు వారు కారణాలు అల్లేస్తున్నరు . నాగ చైతన్యకు పబ్లిక్ లో కూల్ అండ్ క్లీన్ ఇమేజ్ ఉండటంతో తప్పంతా సమంతా దే అన్ని సోషల్ మీడియా లో పోస్టులలో సమంతా ది దారుణమైన ప్రవర్తనని ట్రోల్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా సమంతాకు అక్రమ సంబంధం అంటగడుతూ తన మాజీ ప్రియుని గురించి కొందరు ప్రస్తావిస్తుంటే మరి కొందరు తన కాస్ట్యూమ్ డిజైనర్ జుక్లార్ తో ఎఫైర్ ఉందంటూ వార్తలు రాస్తు గతంలో వారితో చనువుగా ఉన్న ఫోటోలు విడుదల చేస్తూ వున్నారు. ఈ వార్త విన్న అనేక మంది ఆమెను దారుణంగా తిడుతువున్నారు.
అయితే ఈ పరిస్థితి చేయి దాటి పోకుండా నటి మాధవి లత స్పందిస్తూ ఫేస్ ఫేస్ బుక్ లో నాగచైతన్య సమంత విడిపోవడానికి కారణాల గురించి పోస్ట్ పెట్టింది. వాటిలో ముఖ్యంగా సమంత ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొందో తెలియజేసింది.
ఆ పోస్ట్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తూ వైరల్ గా మారండి.
ఆ పోస్టు లో మాట్లాడుతూ వందలో 99 మంది సమంత గురించి చెడ్డ గానే మాట్లాడుతున్నారు ఒక్కరు కూడా ఆమె ఫీలింగ్ గురించి మాట్లాడట్లేదు, మరికొందరైతే ఆమె వేసే కాస్ట్యూమ్స్ గురించి మాట్లాడుతున్నారు, మరికొందరైతే ఆమె సినిమాల్లో వేసే పాత్రల గురించి మాట్లాడుతున్నారు ఇలా సమంత ను ప్రతి విషయంలో చెడ్డది అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. సినీ పరిశ్రమలో విడాకులు అనేది చాలామంది జీవితాల్లో జరిగిన అంశమే. ముఖ్యంగా నటీనటులు వివాహమనేది అదొక ఎమోషనల్ బాండ్. అలాంటిదే చైనా నాగచైతన్య సమంత ల బంధం కూడా.
సమంతా చాలా మంచి అమ్మాయి కానీ మీరు ఆమెను చెడ్డ దానిగా చూపిస్తున్నారు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అంటూ. తను TANA ఎన్జీవోలతో కలిసి కష్టపడి ఎంతోమంది పసిబిడ్డల ప్రాణాలు కాపాడింది ఆ మంచి మనసుకు మీరు ఇచ్చే విలువ ఎంటి? కేవలం పెద్ద కుటుంబం నుంచి వస్తేనే పెద్ద మనసు ఉంటుంది అని మీరు వాడే ట్యాగ్లైన్ మానేయండి. సమంత లాంటి అమ్మాయిలు వారి కంటే గొప్ప పనులు చేసి చూపెడుతున్నారు , సమంత డబ్బు మనిషి కాదు సినిమాలో తాను తీసుకునే రెమ్యూనరేషన్ కూడా ఏం చేసుకోవాలో తెలియనంత అమాయకురాలు ఆమె అమాయకత్వం వల్లనే ఎంతోమంది ఆమె డబ్బు ను వాడేసుకునె వారు,
పెళ్లయిన తర్వాత సమంత తనకు వచ్చే రెమ్యూనరేషన్ ఏం చేసిందో కూడా తెలియలేదు పెళ్లి తర్వాత ఆమెలో మార్పు చాలా వచ్చింది. ఆమె సంపాదించిన కోట్ల డబ్బు ఏమైంది? ఆ డబ్బుతో ఏం చేసింది? కోట్లలో డబ్బు ఉన్నప్పటికీ కేవలం వేళలో కార్చు చేయడం ఏంటి ? రూపాయి లెక్కలు ఎవరికి చెప్పేది? ఎన్జీవో ను ఎందుకు నడపలేక పోతుంది? అసలు తను సంపాదించిన మనీ అంత ఏం చేసింది? పెళ్లైన తనకు సంతానం లేకుండా ఉండడానికి కారణాలు ఏంటి? పిల్లలు కనాలి అనే కోరిక కు తనను దూరం చేసింది ఎవరు? ప్రజలు ఈ విషయాలను కచ్చితంగా తెలుసుకోవాలి అంటూ సమంత ఎలాంటిదో సినిమా ఇండస్ట్రీకి తెలుసు మీరు ఇలా నెగిటివ్ కామెంట్స్ రాయడం ఖచ్చితంగా తప్పే అన్నారు
ఎంతోమంది నాగార్జున బాధను దిగమింగుకుని బిగ్ బాస్ షో హోస్టింగ్ చేసాడు అంటున్నారు, అసలు సమంత నాగచైతన్య ఎప్పుడో విడిపోతే ఆ వార్త ఇప్పుడు బయటపడింది అలాంటప్పుడు నాగార్జున బాద దిగ మింగు కోవడం ఏంటి , ఆయన బాధ దిగమింగుకొనే సందర్భం ఇప్పుడు కాదు ఎప్పుడో జరిగిపోయింది.
కానీ వీళ్ళందర్నీ కాపాడుతూ సమంత ఒక్కదాన్నే టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. నాగార్జున కూడా తన మొదటి భార్యతో విడిపోయినప్పుడు ఎవరు ఈ రకంగా ఆమె గురించి ప్రచారం చేయలేదు ఎందుకంటే ఆమె రామానాయుడు కూతురు కాబట్టి.
కానీ ఇప్పుడు అందరూ సమంతాను అనే వాళ్లే ఉన్నారు. ఎందుకంటే సమంత ఒక పేదింటి నుండి వచ్చింది కాబట్టే అందరు నోళ్లు లేస్తున్నాయి కానీ సమంతకు ఉన్న మంచితనం లో ఒక్క పర్సెంట్ మీకున్న గొప్పవాళ్ళు అయిపోతారు. సమంతాను అర్థం చేసుకోవాలంటే ఒక ప్రేమికుడిగా ఒక ప్రేమికురాలిగా ఉంటూ తన మనసుకు ఇష్టమైన వాడితోనే విదిపోతుంటే బాధ ఎలా ఉంటదో అనుభవిస్తే సమంత బాధ కూడా అర్థమవుతుంది.
దయచేసి ఎవడితోనో సంబంధం అంట కట్టండి ఆమె తన దాంపత్య జీవితం లోనూ మంచి నమ్మకం గా ఉంది , ఎంతోమంది తన డిజైనర్ తో అక్రమ సంబంధం అంటగడుతున్నారు కానీ అతడు సమంతా ని అక్క అని పిలుస్తాడు అని మీకు తెలియదు. దయచేసి ఆమె పట్ల చెడ్డ మాటలు మాట్లాడకండి ఆమె ఎంతో మంచి వ్యక్తి ఈ రకంగా అయినా ఆమెను స్వేచ్ఛగా ఉండనీయండి మీ మాటలతో ఆమెను పొడుచుకు తినకండి. దేవుడు ఆమెను మళ్లీ మంచి స్థాయిలో నిలబెడతాడు మళ్లీ డబ్బు సంపాదించి ఎంతో మంది పిల్లలకు సహాయపడే ఎన్జీవో నడిపిస్తుందని నాకు తెలుసు అంటూ షాకింగ్ పోస్ట్ ఒకటి ఫేస్బుక్లో పెట్టింది మాధవిలత. అయితే ఈ విషయాలన్నీ మాధవి లత స్వయాన సమంతాను కలిసి తెలుసుకున్నావా లేదా తను ఊహించి చెప్పినవా అని తెలియాల్సి ఉంది