చనిపోతున్న తన తల్లి కోసం పాట పాడిన వ్యక్తి యొక్క వీడియో ప్రజలను భావోద్వేగానికి గురిచేస్తుంది..!

News

COVID-19 తో యొద్ధం చేస్తున్న తన తల్లి కోసం చివరి సారి ఫోన్ కాల్‌లో ఆమె కుమారుడు ‘తేరా ముజ్సే హై పెహ్లే కా నాతా కోయి’ అనే హిందీ పాట పాడుతున్న ఒక వీడియో ఆన్‌లైన్‌లో వేలాది మందిని భావోద్వేగాలకు గురిచేసింది.

కోల్‌కతా: సోహం చటర్జీ అనే 24 ఏళ్ల యువకుడు హాస్పిటల్ లో చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తన తల్లిని చూడాలని అనుకున్నాడు.ఆ హాస్పిటల్ లో డాక్టర్ గా పనిచేస్తున్న డాక్టర్ జోష్ కు వీడియో కాల్ చేసి తన తల్లి తో మాట్లాడించమని కోరుకున్నాడు. ఆమె అంగీకరించి అతని అమ్మగారి బెడ్ ద్గగరకు వెళ్లి తన కుమారుడు వీడియో కాల్ మాట్లాడుతాను అని చెప్పాడని ఆమెకు ఫోన్ ఇచ్చింది. ఎన్నో రోజుల తర్వాత అమ్మను చూడగానే భావోద్వేగానికి గురి అయ్యి ఏడ్చేసాడు.తన తల్లిని ఆ పరిస్థితి లో చూస్తాను అని అనుకోలేదు అని చెప్తూ ఆమె కోసం ‘తేరా ముజ్సే హై పెహ్లే కా నాతా కోయి’ అనే హిందీ పాటను దుఃఖం తో నిండిన గొంతుతోనే అతను పాడాడు. అది చూసిన ఇతర పేషెంట్స్ ,డాక్టర్ తో సహా అందరు భావోద్వేగానికి గురి అయ్యారు.ఈ విషయాన్నీ వీడియో తీసి డాక్టర్ తన ట్వీటర్ అకౌంట్ లో పోస్ట్ చేసారు.
ఆమె అలా పోస్ట్ చేసిన కొద్ది సమయంలోనే సోషల్ మీడియా లో వైరల్ గా మారింది ఆ వీడియో.చాలా మంది నెటీజన్లను కదిలించిన ఆ వీడియో క్లిప్పింగ్ సెలెబ్రిటీలను కూడా స్పందించేలా చేసింది.ఈ వీడియో కు అనేకమంది బాలీవుడ్ సెలెబ్రెటీలు స్పందించారు వారిలో అనిల్ కపూర్ గారు కూడా ఉన్నారు.

తర్వాత జరిగిన ఒక ఇంటర్వ్యూ లో సోహం చటర్జీ మాట్లాడుతూ “సంగీతం నన్ను మా అమ్మను కలపడంలో చాలా ప్రభావం చూపించింది.పాటల ద్వారానే మేము ఒక్కరినొక్కరం బాగా అర్థం చేసుకున్నాం, ఈ పాటలు ఒక్కరి పై ఒక్కరికి గౌరవాన్ని ,ప్రేమను పెంచడంలో చాలా సహాయ పడ్డాయి” అని అతను చెప్పాడు.
తన తల్లి పై అతనికి ఉన్న ప్రేమను చూసి సోషల్ మీడియా లో చాలామంది ప్రశంసించారు.ఇంకా చాలా మంది సెలబ్రిటీలు వారి అమ్మలను కూడా గుర్తు చేసుకున్నారు. వారి అమ్మలతో వారికున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.అమ్మ విలువ తను వదిలి వెళ్లినప్పుడే తెలుస్తుంది అని కొందరు అంటే అమ్మ ఉన్నప్పుడే తనకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి ఆమెను బాగా చూసుకోవాలని కామెంట్స్ పెట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *