Manas priyanka

Manas priyanka : బిగ్ బాస్ వీరిదరికే ఆ టాస్క్ ఎందుకు ఇచ్చాడు

News

బిగ్ బాస్ సీజన్ 5 66 వ రోజుకు చేరుకోగా ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ అందించాడు బిగ్ బాస్. తెల్లవారగానే బిగ్ బాస్ గార్డెన్ ఏరియా లో ఒక కేకనుంచి దాని వద్ద . కేక్ ని తినే అర్హత ఎవరికి ఉంది అని బోర్డు పెట్టాడు. ఇక ఈ విషయంలో ఆ రోజంతా కూడా చర్చ జరిగింది. అందరి మనసులో కేక తింటే దాని తర్వాత వచ్చే పర్యవసానాలు ఏంటి అని తికమకలో పడినప్పటికీ పైకి మాత్రం అర్హతగల వాడిని నెన్ అంటే నేను అని గొడవ పడ్డారు. ఇంటి సభ్యులు అందరిలో అని మాస్టర్ ముందుకొచ్చి నేను క్యాప్టెన్ గనక తినే అర్హత నాకే ఉంది అని అన్నారు. అలాగే ఇతరులకు కూడా తాము తినడానికి అర్హత ఏంటో కూడా చెప్పమన్నారు. ఆ సమయంలో ప్రియాంక మానస్ తింటే బాగుంటుంది అని అన్నది. ఇక సీక్రెట్ రూమ్ లో ఉన్న జశ్వంత్ ను బిగ్ బాస్ కేక్ ఎవరు తింటే బావుంటుంది అని అడిగినప్పుడు రవి అని సమాధానం ఇచ్చాడు.

ఇక ఆ చర్చ కొనసాగుతుండగా రోజు గడిచి తెల్లవారింది ఇంకా ఉదయాన్నే గార్డెన్ ఏరియా లో కుర్చున్నా సన్నీ కేక్ తినేసాడు. ఇక సన్నీ కేకు తిన్నాడు అనే విషయం అందరు తెలుసుకొని నవ్వుకున్నారు. ఎందుకు తిన్నావ్ సన్నీ అంటే ఆకలేసి తిన్నాను అని సమాధానమిచ్చాడు. ఇక ఇదే విషయం పై అని మాస్టర్ గొడవ చేసింది కేక్ తినే అర్హత నాకు మాత్రమే ఉందని ఆమె చెప్పుకొచ్చింది. దానికి సన్నీ స్పందిస్తూ మీరు తినాలనుకుంటే నిన్నే తినొచ్చు కదా ఆని ఏదైతే అదే అవుతుంది అని సమాధానం ఇచ్చాడు.

Manas priyanka

ఇక ఇదే రోజు బిగ్ బాస్ గత సీజన్లో లాగా బి బి హోటల్ టాస్క్ ఇచ్చాడు శ్రీరామ్ షణ్ముక్ హోటల్ స్టాప్ గా అని మాస్టర్ హోటల్ మేనేజర్ గా మరియు రవి హౌస్ కీపింగ్ బాయ్ గా మారారు. మరియు మిగతా సభ్యులలో మానస్ ప్రియాంక అదే హోటల్లో దిగిన హనీమూన్ కపుల్ గా, సన్నీ మొదటిసారి ఫైవ్ స్టార్ హోటల్ కి వెళ్ళిన వ్యక్తిగా మరియు సిరి ఒక డాన్ కూతురిగా పాత్రలు పోషించారు.

అయితే వీరందరిలో మానస్ మరియు ప్రియాంక ముందు నుండే ఏదో అఫైర్ ఉన్నట్టు కనిపిస్తూ ఉండగా ఇలాంటి టాస్క్ ఇవ్వడం వల్ల టీవీలో చూపెట్ట లేని సంగతులెన్నో వీరి మధ్య జరిగి ఉంటాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు….

ఇక టాస్క్ మధ్యలో రవిని సీక్రెట్ రూమ్ కి పిలిచి ఒక సీక్రెట్ టాస్క్ ను బిగ్ బాస్ ఇచ్చాడు. ఆ టాస్క్ లో భాగంగా హౌస్ కీపింగ్ బాయ్ అయ్యుండి ఇతర స్టాఫ్ చేస్తున్న పనులను చెడ గొట్టాలి, అదే సమయంలో వచ్చిన అతిథుల మెప్పు కూడా పొందాలి, ఇక టాస్క్ లో సీరియస్ నెస్ కాక అందరూ సరదాగానే పాటిస్పేట్ చేశారు దీంతో ఎవరు విజయం సాధిస్తారా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఇక ఈ టాస్క్ లో ఎవరు విజయం సాధిస్తారో తెలియాలంటే 67 వ రోజున ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే. అయితే ఈ టాస్ అంతటిలో రవి సిన్సియర్ గా ఉండడం వల్ల రవి గెలుస్తాడని ఊహాగానాలు వెలువడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *