manchu vishnu

manchu vishnu jeevitha rajasekhar

News

సిని పరిశ్రమలో ప్రస్తుతం మా అసోసియేషన్ ఎలక్షన్స్ టాపిక్ గా రోజు రోజుకు ఉత్కంటగా అవుతున్నవి. పోటి దారులు ఎత్తుకు పై ఎత్తు వేసుకుంటూ ఒకరి పైన ఒకరు వేసే వ్యాక్యలతో మాటల యుద్ధం జరుగుతుంది .

అయితే తాజాగా జీవిత రాజశేకర్ గారు ప్రెస్ మీట్ లో ప్రకాష్ గారిని సమర్ధిస్తూ మాట్లాడారు. మేమే గెలుస్తాం అని ధీమాగా మంచు విష్ణు ఉన్నాడని పరిశ్రమలో ఎంతో మందిని కాకా పడుతున్నాడని అన్నారు అలాగే ఒకవేళ మంచు విష్ణు గాని మోహన్ బాబు గాని ఫోన్ చేస్తే వాల్ల మాట వినకండి. ఒక వేళ వినాలనుకుంటే ఓటు వేయకండి అన్నారు. బాగా ఉన్నవాళ్లు ఎవరు గెలిస్తే ఏంటి అన్నట్టుగా ఓటు వేస్తారు కానీ నిజంగా అవసరాలు ఉన్న వాడు తమకు మంచి చేసే వాణ్ణి గెలిపిస్తారని అన్నారు.

మంచు విష్ణు గారు వెంటనే జీవిత అన్న మాటలకు స్పందిస్తూ ప్రెస్ మీట్ నిర్వహించి నాకు ఓటు వేయవద్దని చెప్పడానికి మీరెవరు అంటూ జీవిత నిప్పులు చెరిగారు. మేము గెలుస్తామని ధీమా వ్యక్తం చేశాము అంటే ఎవర్నో మభ్యపెట్టారు అన్నట్టు మాట్లాడారంటూ, జీవితా రాజశేఖర్ గారిని ఈ రకంగా ప్రశ్నిస్తూ మీరు సినిమా తీస్తే సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అనే ధీమాతో, సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది అని ప్రచారం చేస్తారు కానీ ఫ్లాప్ అవుతుంది అని మాత్రం చేయరు అలాగే ఇది కూడా పాజిటివ్ గా ఆలోచించండి అని సలహా ఇచ్చాడు.
manchu vishnu
ప్రకాష్ రాజు గారిని ప్రస్తావిస్తూ ఆయన కూడా ఇదే దీమాతో ఉండి గెలిచిన వెంటనే నాకు ఫోన్ చేస్తా అన్నాడు ఫోన్ చేసి మూవీ ఆర్టిస్ట్ ల కోసం స్థలం ఎక్కడ అని అడుగుతానన్నాడు. ప్రకాష్ రాజు ఎలాగో గెలవడు అయినప్పటికీ ఎలక్షన్లో గెలుస్తానని కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు నాకెందుకు ఉండదు.

నేను మిమ్మల్ని చాలా గౌరవిస్తాను కానీ మీరు ఏదో ఒకటి మాట్లాడాలి మాట్లాడకపోతే బాగోదు అన్నట్టు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. మోహన్ బాబు గానీ మంచు విష్ణు గానీ ఫోన్ చేస్తే ఓటు వేయకండి అని చెప్పడం చట్టపరమైన తప్పు అవుతుంది అని విష్ణు అన్నాడు. మీరు నిజంగా గెలవాలంటే ధైర్యంగా ముందుకు రండి వచ్చి ప్రజలను ఆకట్టుకోండి మీకే ఓటు వేసేలా మాట్లాడండి కానీ ఆయన ఫోన్ చేస్తే ఓటు వేయకండి అని చెప్పడం తప్పు అన్నారు.

మేము ఫోన్ చేస్తే మాకు ఓట్లు పడుతున్నాయి అనుకోవద్దు ప్రజలు ఎవరు మంచి వారు ఎవరికి వేస్తే వాళ్ళ భవిష్యత్ బాగుంటుందో నిర్ణయించుకొని ఓట్లు వేస్తున్నారు అన్నారు. మా అసోసియేషన్ అనేది ఒక కుటుంబం అని వాళ్లకు మంచి చేసే వ్యక్తిని ఎన్నుకుంటారని అన్నారు.

అదే సమయంలో ఓటు వేయవద్దని బహిరంగంగా ఎలా అంటారని చెలరేగి పోయాడు విష్ణు, అలాంటప్పుడు రాజశేఖర్ గారు వచ్చి మోహన్ బాబు గారిని ఎలా కలుసాడు అంటూ ప్రశ్నించాడు ఇంతలో పక్కనే ఉన్న నరేష్ గారు ఆయనను ఆ విషయం చెప్పకుండా ఆపేస్తూ ఇప్పటికే వాళ్ళలో వాళ్ళు చస్తున్నారు ఈ విషయం ప్రస్తావించకు అంటూ విష్ణుని అడ్డుకున్నాడు. కాస్త శాంతించి రాజశేఖర్ గారు మోహన్ బాబుతో ఏం మాట్లాడాడు రాజశేఖర్ గారిని అడగండి అన్నాడు.

మా అసోసియేషన్ అనేది ఒక కుటుంబంగా ఉంది దాంట్లో మీరు ఈ రకంగా పెద్ద వాళ్ల పేర్లు ఎత్తి రెచ్చగొట్టే మాటలు చేయడం ఒక కుటుంబాన్ని చీలికలు చేసినట్లు అవుతుందని ఆ రీతిగా మాట్లాడతం తప్పే అంటూ , నేను ఇప్పటికి కూడా ఈ రీతిగా మీపైన స్పందించకుంటే నాదే తప్పు అనుకుంటారని ఈ రీతిగామీ ముందుకు వచ్చానని అన్నాడు విష్ణు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *