మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఎలక్షన్స్ ఎప్పుడు లేనంతగా ఈ సారి పూర్తిగా ఆసక్తిగా కనిపిస్తున్నాయి. ఎందుకోసం అంటే ఈసారి పాతిపెడుతున్న క్యాండిడేట్లు ఎక్కడ కూడా తగ్గినట్లుగా కనిపించట్లేదు .అయితే ఇటీవలే ప్రకాష్ రాజ్ ఎన్నికలు ఇంకెప్పుడు పెడతారంటూ ఇన్ డైరెక్ట్ గా హీరో నరేష్ ను అడిగారు.మరొకవైపు మంచు విష్ణు ఏమో అస్సలు తగ్గేదేలే అంటూ కచ్చితంగా పోటీలో ఉంటానని క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఓ వైపు ఏమో మెగాస్టార్ చిరంజీవి, మరో వైపు నందమూరి నట సింహం బాలకృష్ణ ఒక్కో వర్గానికి వారి సపోర్ట్ ఇస్తున్నారు. ఇటీవలే బాలకృష్ణ చేసిన సంచలన వ్యాఖ్యలకు మెగా బ్రదర్ నాగబాబు కౌంటర్ కూడా ఇచ్చాడు.
ఈ విషయం దాదాపుగా అందరికి తెలుసు. దీంతో ఈసారి ఎన్నికలు ఫుల్ హీట్ ఉండడం ఖాయమని అర్ధమౌతుంది.అయితే తాజాగా ఆ హీట్ ను మరింతగా పెంచుతూ నటుడు మరియు నిర్మాత మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్ చేసాడు.ఒక న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన అతను కచ్చితంగా MAA ఎన్నికలలో నిలబడతానని ఖరాకండిగా తేల్చి చెప్పాడు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న పెద్దవారందరు ఏకగ్రీవంగా ఎవరినైనా ఒక సభ్యున్ని ఎన్నుకుంటే తప్ప అతను ఎన్నికలలో నుంచి తప్పుకునే ఛాన్స్ లేదన్నారు.
చిత్ర పరిశ్రమకు చేందిన పెద్దలంతా పోటీ ఉండకుండా చేసే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపించటంలేదు అంటూ మంచు విష్ణు ఆ ఇంటర్వ్యూ లో అన్నాడు. అయితే మంచు విష్ణు మాత్రం తన అజెండాను చాల స్పష్టంగా చెప్పేసాడు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ బిల్డింగ్ మాత్రమే కాదు సినీ పరిశ్రమలోని అందరూ కార్మికులను తప్పకుండ ఆదుకోవాల్సిన బాధ్యత ఇండస్ట్రీ లో ఉంటున్న వారందరిపైనా ఉందన్నారు.
మీరలా చేయలేదు కాబట్టే నేను మంచు విష్ణుకు మద్దత్తు ఇస్తున్నాను
MAA భవనం కోసం ఒక ఎకరా భూమి ఇవ్వలేరా
అయితే విష్ణు అజెండా అంతా చాలా బాగానే ఉన్నప్పటికీ అతను చేసిన కొన్ని వ్యాఖ్యలు మాత్రం సంచలనంగా మారుతున్నాయి. జైల్లో బట్టలు లేకుండా కేవలం అండర్ వేర్ లో కూర్చుని ఉన్న వారిని స్వయంగా తానే పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఉదయం 4.30 గంటలకు తాను విడిపించానని చెప్పారు. “చిత్ర పరిశ్రమలో ఉండే చాలా మందికి నేను సహాయం చేసాను. ఒకవేళ నేను వారికి హెల్ప్ చేయపోయి ఉంటే వాళ్లు ఆ జైల్లో ఇప్పుడు ఊచలు లెక్కపెట్టేవాళ్లు.
అండర్ వేర్లతో బట్టలు కూడా లేకుండా వారు పోలీస్ స్టేషన్ లో ఉంటే నేనే బయటకు తీసుకొచ్చాను.ఎవరిపైన అనవసరంగా ఎక్కువ వాగితే వాళ్ల పేర్లు బయట పెట్టాల్సి వస్తుంది” అని అన్నారు. దీంతో చిత్ర పరిశ్రమలో అసలు మంచు విష్ణు ఎవరినీ ఉద్దేశించి ఆలా అన్నరన్నది ఇప్పుడు టీ టౌన్ లో హాట్ టాఫిక్ గా మారింది. దీనిపై రకరకాల పేర్ల పై
ఊహాగానాలు ప్రారంభమయ్యాయి.