టాలీవుడ్ లో ముప్పైఏళ్లు మీదపడినా పెళ్లి చేసుకొని హీరోయిన్స్

Movie News

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అందరూ ఒక్కొక్కరుగా పెళ్లి బాటపడుతున్నారు. లాక్డౌన్ సమయం నుండి వరుసగా పెళ్లిళ్లు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇండస్ట్రీ దృష్టి – ప్రేక్షకుల దృష్టి పెళ్లి వయసు దాటిపోయిన హీరోయిన్స్ పై పడింది. సాధారణంగా అమ్మాయిలకు పాతికేళ్లు రాగానే ముందుగా అందరూ అడిగే ప్రశ్న ‘పెళ్లెప్పుడు..?’ అని. హీరోయిన్స్ అంటే అందం చందం బాగానే కాపాడుకుంటారు కాబట్టి 30 ఏళ్ల వరకు కూడా పెళ్లికి అవకాశం ఉంటుంది. కానీ టాలీవుడ్ లో చాలామంది హీరోయిన్స్ మూడు పదుల వయసు దాటినా కూడా పెళ్లికి దూరంగా ఉంటున్నారు.

చూస్తుంటే జాబితా పెద్దగానే ఉన్నట్టుంది. మరి టాలీవుడ్(సౌత్)లో ముప్పైఏళ్లు మీదపడినా పెళ్లి చేసుకొని హీరోయిన్స్ లిస్ట్ చూద్దాం!

1. అనుష్క శెట్టి: ‘సూపర్’ మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అనుష్క ప్రస్తుత వయస్సు 39ఏళ్ళు. సౌత్ ఇండస్ట్రీలో స్టార్ గా ఎదిగిన అనుష్క.. ఇప్పటివరకు పెళ్లి ఊసు ఎత్తలేదు. ‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ దేవసేనకి పెళ్లి ఆలోచన రావడం లేదా అని ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు. అయితే ఈ భామ సౌత్ స్టార్స్ అందరితో సినిమాలు చేసింది. ఆ మధ్యలో ఓ ప్రముఖ క్రికెటర్ ని పెళ్లి చేసుకోబోతోందని.. ఓ డైరెక్టర్ తో ఎంగేజ్మెంట్ అయిపోయిందని ఇలా అనుష్క మ్యారేజ్ పై రకరకాల వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ పుకార్లని తేల్చేసింది స్వీటీ. మరి పెళ్లి కబురు ఎప్పుడు చెబుతుందో..!

2. త్రిష: ఇండస్ట్రీలో 20 పూర్తి చేసుకున్నా ఇప్పటికీ అవకాశాలు అందిపుచ్చుకుంటూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ప్రొఫెషన్ పరంగా సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకున్న 38 ఏళ్ళ త్రిష పర్సనల్ లైఫ్ సంగతేంటని ఆమె అభిమానులు ప్రశ్నిస్తున్నారు. నిజానికి అప్పట్లో వరుణ్ అనే బిజినెస్ మ్యాన్ తో కొంతకాలం పాటు డేటింగ్ చేసిన త్రిష అతడితో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. కొన్నిరోజుల్లో పెళ్లి అనగా ఏం జరిగిందో ఏమో ఇద్దరూ పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. ఇప్పటి వరకు దీనికి కారణం మాత్రం వెల్లడించలేదు. ఆ తరువాత త్రిషని ఎప్పుడు పెళ్లి గురించి అడిగినా కూడా సమాధానం దాటవేస్తూ వచ్చింది.

3. నయనతార: లేడీ సూపర్ స్టార్ కు మూడుపదులు వయసు దాటి 5 ఏళ్లవుతోంది. ఈ వయసులో కూడా ఇప్పటికీ చెరిగిపోని అందంతో చేతినిండా సినిమాలతో బిజీ అయిపోయింది. సినిమా లైఫ్ కాకుండా వ్యక్తగత జీవితంతో కూడా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది నయన్. ఇదివరకు హీరో శింబు – కొరియోగ్రాఫర్ ప్రభుదేవాలతో రిలేషన్ షిప్ మెయింటైన్ చేసి బ్రేకప్ చేసుకుంది. ప్రస్తుతం తమిళ డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో రిలేషన్ షిప్ లో ఉంది. ఇటీవలే ఎంగేజ్మెంట్ జరిగినట్లు సమాచారం. మరి ఈ పెయిర్ త్వరలోనే పెళ్లి పీటలెక్కుతుందేమో చూడాలి.

4. శృతిహాసన్: ఈ భామకు ప్రస్తుతం 35 ఏళ్ళు. ఆ మధ్యలో మైకేల్ కార్ సేల్ అనే బ్రిటిషర్ తో అమ్మడు డేటింగ్ చేస్తోందని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వచ్చాయి. దీనికి తగ్గట్టే శృతి తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి హల్చల్ చేస్తూ చాలాసార్లు కనిపించింది. ఈ క్రమంలో సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన శృతి హాసన్.. ఈ మధ్య అతనితో బ్రేకప్ చెప్పి కెరీర్ మీద ఫోకస్ చేసింది. ప్రస్తుతం క్రాక్ సినిమా కంబ్యాక్ హిట్ తో ఫామ్ కొనసాగిస్తుంది.

5. తమన్నా భాటియా: ఈ భామకు ప్రస్తుతం 32ఏళ్లు. పదహారేళ్ళకే ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన మిల్కీ బ్యూటీ.. పెళ్లి ఎప్పుడని ఆమె అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే 15 ఏళ్ళ సినీ కెరీర్ కంప్లీట్ చేసుకున్న తమన్నా.. ఇప్పటికి వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటూ ఫామ్ కంటిన్యూ చేస్తోంది. మరి త్వరలోనే పర్సనల్ లైఫ్ గురించి కూడా ఆలోచిస్తుందేమో చూడాలి. ప్రస్తుతం అయితే చేతినిండా తెలుగు తమిళ హిందీ సినిమాలతో బిజీ అయిపోయింది.

6. నిత్యమేనన్: ఈ భామకు ప్రస్తుతం 33ఏళ్లు. కానీ ఇప్పటివరకు పెళ్లి గురించి అడిగితే జరిగే టైంలోనే జరుగుతుంది అంటూ సమాధానం చెబుతోంది. నిత్య సినీ కెరీర్ కూడా 15ఏళ్ల పైనే అవుతోంది. కానీ తెలుగులో అలా మొదలైంది సినిమాతో కెరీర్ ప్రారంభించింది. మరి ప్రస్తుతం సినిమాలు అయితే పెద్దగా లేవు. పెళ్లి కబురు అయినా వినిపిస్తుందేమో చూడాలి.

7. ఇలియానా: ఈ గోవా బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అమ్మడి వయసు 34ఏళ్లు. కానీ ఇప్పటివరకు పెళ్లి జీవితం పై క్లారిటీ లేదు. ఆ మధ్య బాయ్ ఫ్రెండ్ అంటూ ఓ ఫారెన్ ఫోటోగ్రాఫర్ తో రిలేషన్ షిప్ మెయింటైన్ చేసింది. ఆఖరికి బ్రేకప్ తో మళ్లీ సింగల్ అంటూ స్టేటస్ పెడుతోంది. మరి చూడాలి ఇకనైనా మ్యారేజ్ పై క్లారిటీ ఇస్తుందేమో!

8. తాప్సీ: హీరోయిన్ తాప్సీకి ప్రస్తుతం 33ఏళ్లు. ఎప్పుడో ‘ఝమ్మందినాదం’ అనే మూవీతో కెరీర్ ప్రారంభించిన తాప్సీ ఇప్పటికే 12ఏళ్లకు పైగా కెరీర్ పూర్తి చేసుకుంది. కానీ మూడుపదులు మీదపడినా పెళ్లి పై క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం అమ్మడు ఓ ఫారెనర్ తో రిలేషన్ షిప్ లో ఉందని సమాచారం.

9. రకుల్ ప్రీత్ సింగ్: సౌత్ టు నార్త్ వరకు బిజీగా గడుపుతోంది ఈ 31ఏళ్ల సుందరి. ఇంతవరకు పెళ్లి లైఫ్ గురించి స్పందించలేదు. కానీ త్వరలోనే పెళ్లి కబురు చెప్పబోతుందని టాక్ నడుస్తుంది. ప్రస్తుతం అమ్మడికి బాయ్ ఫ్రెండ్ కూడా లేడని సమాచారం.

10. హంసానందిని: ఈ భామ కెరీర్ ప్రారంభించి పదిహేనేళ్ల పైనే అవుతోంది. ప్రస్తుతం అమ్మడి వయసు 37 సంవత్సరాలు. మరి చేతిలో సినిమాలు లేవట. అప్పుడప్పుడు ఐటమ్ సాంగ్స్ తో పలకరిస్తోంది. చూడాలి మరి త్వరలో తీపి కబురు చెబుతుందేమో!

ఇలా టాలీవుడ్ తో పాటు సౌత్ ఇండస్ట్రీలో కూడా చాలామంది 30 పైబడిన హీరోయిన్స్ ఉన్నారు. అందులో ఈషారెబ్బా(31) – రాశిఖన్నా(31)- లక్ష్మీరాయ్ (32) – కృతికర్బందా (33) – రెజినా(31) ఇలా వరుసగా లైన్ లో ఉన్నారు. మరి వీరంతా ఎప్పుడు గుడ్ న్యూస్ చెబుతారో చూడాలి.

వీరితో పాటు ఇండస్ట్రీలో 30 ప్లస్ దాటినా పెళ్లి చేసుకొని హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. మరి ఈ బ్యూటీస్ అందరూ ఎప్పుడు పెళ్లి న్యూస్ చెప్తారా అని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *