Meera Jasmine

మోసపోవడం వల్లే సినిమాలకు దూరం అయ్యానంటున్న మీరా జాస్మిన్

News

హీరోయిన్ అంటేనే స్క్రీన్ పైన గ్లామర్ చూపించాల్సిందే కానీ మీరా జాస్మిన్ మాత్రం రొటీన్ కు భిన్నంగా ఎక్స్పోజింగ్ చేయకుండా టాలీవుడ్ లో రవితేజ పవన్ కళ్యాణ్ బాలకృష్ణ వంటి టాప్ హీరోలతో నటించి ఎన్నో సూపర్ హిట్లు సంపాదించుకున్నారు.

అయితే ఈ అమ్మడు గత కొన్నాళ్ళుగా సినిమాలు మానేసిన సంగతి తెలిసిందే దానికి కారణం తన వ్యక్తిగత జీవితం లో జరిగిన సంగతులే అని చెప్పక తప్పదు.

తమిళ సినిమా రన్ తెలుగు డబ్బింగ్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మీరా జాస్మిన్ మలయాళ సిరియన్ కాథలిక్ క్రిస్టియన్ కుటుంబంలో 1982 ఫిబ్రవరి 15న జన్మించింది. ఆమె అసలు పేరు జాస్మిన్ మేరీ జోసెఫ్.

2001లో కేరళ కుట్టి అనే మలయాళ సినిమా ద్వారా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. తెలుగులో అయితే 2004 లో హీరో శివాజీ తో కలిసి ఇ అమ్మాయి బాగుంది అనే సినిమాలో నటించి తెలుగు సినిమా ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత గుడుంబా శంకర్, గోరింటాకు ,పందెంకోడి, భద్ర వంటి సినిమాలలో తెలుగు అగ్ర హీరోలతో నటించింది వీటిలో దాదాపు అన్ని సూపర్ హిట్ అయ్యాయి.

Meera Jasmine
Meera Jasmine

తెలుగులో మంచి ఆఫర్లతో దూసుకెళ్తున్న సమయంలో తమిళ సినీ ఇండస్ట్రీ నుంచి కూడా ఆఫర్లు రావడం మొదలుపెట్టాయి. దక్షిణ భారత దేశంలో సుమారు అన్ని భాష సినిమాల్లో మీరాజాస్మిన్ నటించారు. ఆమె నటనను గుర్తించి ఆమెను ఉత్తమ నటి గుర్తింపుతో సత్కరించారు.

ఇలా చిత్ర పరిశ్రమలో దూసుకెళ్తున్న సమయంలో 2014 సంవత్సరంలో దుబాయి కి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనిల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇంకా అప్పటినుండి ఆమె సినిమా తెరపైన కనిపించలేదు. అయితే కొంతకాలానికి తనకు తన భర్తకు మధ్య లో విభేదాలు వచ్చి వారిద్దరు విడిపోయారని తెలిసిందే.

అయితే తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ వేదికగా తనకు సంబంధించిన తాజా ఫోటోలను విడుదల చేసింది. సాధారణంగా బొద్దుగా కనిపించే మీరాజాస్మిన్ ఆ ఫోటోలో సన్నబడినటు కనిపించింది. ఇందు కొరకు వర్క్ ఔట్లు చేస్తూ భారీగా తన బరువు తగ్గించుకున్నట్టు తెలుస్తుంది.

వర్క్ అవుట్ లు బాగా చేస్తూ బరువు తగ్గించుకుని సన్నబడిన తన ఫోటోలను చూసిన నేటిజనులు తను త్వరలో సినిమాల్లోకి తిరిగి రాబోతుందని అభిప్రాయ పడుతున్నారు. అయితే ఈ విషయం పై మీరా జాస్మిన్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఆమె ఎప్పుడూ ఈ విషయం పై స్పందిస్తారో ఎప్పుడు తిరిగి సినిమాలో కనిపిస్తారో అని తన తాజా ఫోటోల వల్ల ప్రేక్షకులు ఎదురు చూసేలా చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *