megastar-chiranjeevi

సమంత, నాగచైతన్య విడాకుల విషయంలో మెగాస్టార్ చిరంజీవి జోక్యం ఎందుకు ?

News

ఎన్నడూ లేని రీతిగా భారతదేశం అంతా ఒకే జంట గురించి మాట్లాడుకుంటూ ఉంది అంటే. అది సమంతా నాగచైతన్య అని ఖచ్చితంగా చెప్పవచ్చు , ఈ మధ్యకాలంలో వాళ్ళిద్దరు విడిపోతున్నారు అనే వార్త దేశమంతా పాకిపోయాయి. ఆ వార్తలను కొట్టి పడేయకుండా నాగచైతన్య గాని, సమంతా గాని స్పందించకపోతే సరికి ఆ వార్తలు నిజమేనని నమ్మాల్సి వస్తోంది.

ఈ విషయంపైన ఎన్నో రకాల రూమర్స్ ప్రస్తుతం ప్రజల మధ్యలో చక్కర్లు కొడుతున్నాయి, అయితే సమంత,నాగచైతన్యల పైన వస్తున్నా. ఈ రూమర్స్ వల్ల తమ పరువు నష్టం జరుగుతుంది. అని తెలిసి కూడా ఈ విషయం పైన సమంత గాని, అక్కినేని కుటుంబం గాని ఎలాంటి క్లారిటీ ఇవ్వట్లేదు.

సమంత ఎక్కడికి వెళ్ళినా తనను నాగచైతన్య ఎక్కడ అని మీడియా మిత్రులు ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ సరైన సమాధానం ఇవ్వకుండా సమంత తప్పించుకుంటునట్టు కనిపిస్తున్నారు.

megastar-chiranjeevi
megastar chiranjeevi

సమంత నిప్పులో ఆజ్యం పోసినట్టు తన ట్విట్టర్ ఐడిలో నుంచి అక్కినేని ఇంటిపేరును తీసివేయడం, మరియు కొన్ని ముఖ్య కార్యక్రమాలకు తాను ఒంటరిగా వెళ్ళటం చేయడం వల్ల ప్రజలకు ఈ విషయం పట్ల ఖచ్చితమైన అనుమానాలు కలుగుతున్నాయి.

ఇదే రీతిగా నాగచైతన్య కూడా ప్రవర్తిస్తూ ముఖ్యమైన ఈవెంట్లలో సమంతను తీసుకొని రాకుండా ఒంటరిగా పాల్గొనడం వల్ల ప్రజలు అనుమానిస్తున్నదే నిజం అన్నట్టుగా ప్రూవ్ చేసుకుంటున్నారు. ప్రజలు మాత్రం ఈ విషయం పైన వీరు ఎప్పుడు క్లారిటీ ఇస్తారు వినాలని ఎదురుచూస్తూ ఉన్నారు. ప్రజలకు ఈ విషయం పై నాగచైతన్య, సమంతాల స్పందన అందని ద్రాక్షలాగా అనిపిస్తుంది.

సమంతాను ఒక సందర్భంలో ఈ విషయం పైన ప్రశ్నించినప్పుడు నేను సమయం వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి విషయాల గురించి మాట్లాడతాను. అని చెప్పడం వల్ల రోజు రోజుకి ప్రజల మధ్యలో ఈ విషయంపై చర్చలు,పుకార్లు బాగా పెరిగిపోతున్నాయి.

అయితే తాజాగా ఫిల్మి లాగ్ వారు ఒక కథనాన్ని వెల్లడించారు. దాని ప్రకారం సమంత, నాగచైతన్య మధ్యలో జరుగుతున్న అంతుతేలని విడాకుల విషయం పైన నాగార్జున గారు చాలా కోపంగా ఉన్నారని దాంతో లవ్ స్టోరీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సమంత హాజరు కానట్లయితే తమ కుటుంబ పరువు పోతుందని నాగార్జున గారు ఆ ఈవెంట్ కి రావడానికి ఇష్టపడటం లేదని తెలుస్తోంది.

అయితే ఈ విషయం పైన అక్కినేని కుటుంబానికి మంచి మిత్రుడు అయినటువంటి చిరంజీవి గారు స్పందిస్తూ ప్రస్తుతం అక్కినేని కుటుంబంలో ఉన్న ఈ సమస్యను పరిష్కరించడానికి లవ్ స్టోరీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి గారు రాబోతున్నారు. అన్న విషయం బయటపడింది. ఒకవేళ చిరంజీవి గారు ఈవేంట్లో కనిపించినట్లైతే ప్రజలెవ్వరూ సమంత గురించి మాట్లాడకుండా చిరంజీవి పైనే అభిమానులు దృష్టి ఉంచుతారని ఆలోచించి. ఈ నిర్ణయం తీసుకున్నారని వార్త ఒకటి బయటకు వచ్చింది.

అయితే తెలుగు ప్రేక్షకులలో నాగచైతన్య సమంతల జోడీకి బాగా కనెక్ట్ అయినటువంటి అభిమానులు ప్రతిరోజూ నాగచైతన్య సమంతల సోషల్ మీడియా అకౌంట్ లో దయచేసి మీరు విడిపో కండని చాలా రిక్వెస్ట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.

అయితే తాజాగా ఈ విషయం పైన ప్రజలు ఆశ్చర్యపోయే ట్విస్ట్ ఒకటి బయటపడింది. నాగచైతన్య, సమంత తన విడాకుల విషయమై స్పందించకపోవడం ఒక డ్రామా అని దర్శకుడు కె. విక్రమ్ కుమార్ చే నిర్మించబడుతున్న ఒక వెబ్ సిరీస్ కోసం ప్రజలను ఆకర్షించేందుకు ఇదోక పబ్లిసిటీ అని తెలుస్తుంది. అయితే వాళ్లు ఆ రకంగా డ్రామా ఆడటానికి కారణం ఏంటంటే ఆ వెబ్ సిరీస్ యొక్క స్టోరీ విడాకుల పైన ఆధారపడి ఉంటుందని. కథకు సంబంధించిన సమాచారం ఒకటి వెలువడింది. ఏది ఏమైనప్పటికీ ఈ అందమైన జోడి విడిపోకూడదని కోరుకుందాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *