megastar-chiranjeevi

‘అందుకు ఎలాగైనా సీఎం జగన్ ని ఒప్పించాలంటూ..’ మెగాస్టార్ ను ప్రాధేయపడినా సినీ పెద్దలు..!

News

ఈ కరోనా కరణంగా సినీ పరిశ్రమ చాలా ఇబ్బందిలో పడింది. ఈ కరోన మహమ్మారి కి టాలీవుడ్ మొదలుకొని హాలీవుడ్ వరకు అన్ని సినీ థియేటర్లు మూసుకోవాల్సి వచ్చింది. అయితే ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తిరిగి తెరుచుకునేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాని డిస్ట్రిబ్యూటర్లు మాత్రం దాని మీద ఎక్కువ ఆసక్తి చూపలేదు. ఎందుకంటే కరోనా కారణంగా ఎంతో ఆర్థికంగా ఇబ్బంది పడిన వాళ్లు మరో ఛాన్స్ తీసుకోవాలని అనుకోలేదు.

వారి ఈ ఆర్థిక పరిస్థితిని కొద్దిగా మెరుగుపరచాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేశారు. వారి కరెంటు బిల్లులు మాఫీ చేయమని డిమాండ్ చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో 50% ఆక్యుపెన్సీ తో థియేటర్లు తెరుచుకునేల ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. మరియు అక్కడ టికెట్ల ధర కూడా తక్కువే.దీంతో ప్రొడ్యూసర్లు ఎవరు తమ సినిమాల్ని రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. అందుకే లవ్ స్టోరీ, టక్ జగదీష్, మరియు విరాట పర్వం ఇలాంటి మీడియం రెండు సినిమాలు రిలీజ్కి సిద్ధంగా ఉన్నా ప్రొడ్యూసర్లు మాత్రం ఆసక్తి చూపడం లేదు. ఈ నిర్మాతల తీరును చూసిన ఏపీ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అయిన మెగాస్టార్ చిరంజీవి ని కలిసి ఈ విషయం గురించి చర్చిద్దాం అని నిర్ణయించింది.

సినిమా పరిశ్రమలో ఈ నిర్మాతల సమస్యలకు ఒక పరిష్కారం కావాలని చిరంజీవి గారి తో స్వయంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు. ఈ సమస్య కోసం సినీ పెద్దల తో సహా సమావేశం జరపాలని ఏపీ సమాచార శాఖ మంత్రి పేర్ని నాని రెడ్డి గారు రెండు రోజులు ముందే చిరంజీవి గారికి తెలియజేశారు.

అయితే వారి కోరిక మేరకు చిరంజీవి గారు మరియు ఇండస్ట్రీలో కొంత మంది పెద్దల తో సోమవారం రోజున ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారితో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యంగా బి,సి సెంటర్ లో టికెట్లు రేట్లు మరియు కరెంట్ బిల్లు ల సమస్యలు, సినీ కార్మికులకు మరియు థియేటర్ల కార్మికుల సమస్యపై చర్చించేందుకు మన ఇండస్ట్రీ నుంచి చిరంజీవి, నాగార్జున గారు ప్రముఖ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు , డీ సురేష్ బాబు గారు ,ఎస్ వి ప్రసాద్ గారు మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్ అయినా ప్రసాద్ గారు సినీ దర్శకులూ కొరటాల శివ గారు, వివి వినాయక్ గారు అలాగే విప్లవ సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఆర్ నారాయణ మూర్తి గారు హాజరయ్యారు. కరోనా కారణంగా సినీ ఇండస్ట్రీలో చాలా ఇబ్బందులు పడ్డారు.

అయితే థియేటర్ల టికెట్ల రేట్లను పెంచుకుంటామని సినిమా రిలీజ్ అయిన 20 లేదా పది రోజుల లోపు ఎలాంటి షరతులు పెట్టొద్దని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేశారు.

megastar-chiranjeevi

అయితే ఈ విషయం పై పలువురు తలసాని శ్రీనివాస యాదవ్ రావు గారితో చర్చించారు.

నిలిచిపోయిన సినిమా షూటింగ్ లను మళ్ళీ ప్రారంభించుకుంటామని చెప్పరు.అయితే దానికి ఆయన సమస్యలనూ సి ఎం కే సీఎర్ దృష్టికి తీసుకెళ్తానని తలసాని హామిచ్చరు. ఏ పి లో జరిగే సినీ సమావేశం లో జరిపిన కీలక విషయాలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పరు.అలాగే సినీ ఆర్టిస్ట్స్ లను ప్రోచాహించేల వారి అవార్డ్స్ పంపిణి చేస్తాము అని తలనాని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *