pawan kalyan sampoornesh babu

పవన్ కళ్యాణ్ నువ్వు సంపూర్ణేష్ బాబు తో సమానం అంటున్న మంత్రి.

News

తాజాగా జరిగిన రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ గారు ప్రసంగించిన ప్రసంగం ఆంధ్రప్రదేశ్ వైసీపీ మంత్రులలో సమస్యగా మారింది ఈ అంశం పైన వైసీపీ మంత్రులు చాలామంది మాట్లాడారు కానీ తాజాగా జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ గారు మాట్లాడిన మాటలు తెరపైకి వచ్చాయి. ఈ సమస్యను గురించి వైసిపి మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ ప్రతి పరిశ్రమ లో పారదర్శకత్వం జరగాలని ప్రభుత్వం చొరవ చూపించడం అసలు తప్పెలా అవుతుంది అని ప్రశ్నించాడు. మీరు ఒక పార్టీ అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలో సరిగా తెలియని అటువంటి వాడు ఈవెంట్ లోకి వెళ్లి అధికారంలో ఉన్న పార్టీ పైన విరుచుకు పడడం సరి అయింది కాదు అలాంటి విమర్శలు చేయడానికి వేరే ప్లాట్ ఫామ్ అంటూ ఉంటుంది మరియు ప్రభుత్వానికి అందే రీతిగా చెప్పే పద్ధతి వేరేగా ఉంటుంది కానీ మీరు ఆ రీతిగా మాట్లాడలేదు.

కళమ్మ దృష్టిలో అందరూ సమానం అయినప్పుడు నటులందరూ కూడా సమానమే
సిక్స్ ప్యాక్ చేసేందుకు సుధీర్ బాబు ఎంత కష్టపడ్డాడో ప్రభాస్ కూడా అంతే కష్టపడతాడు. నువ్వైనా సంపూర్ణేష్ బాబు అయినా మాకు ఒక్కటే.ప్రభుత్వానికి చిన్న హీరో పెద్ద హీరో అని తేడా ఉండదని ప్రతి ఒక్కరు మాకు సమానమే అని అన్నారు.

అయితే పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన మాటలను బట్టి అనిల్ కుమార్ గారు ఈ రకంగా విమర్శించారు నువ్వు ఏదో మాకు ప్రత్యర్థి అని అనుకోవద్దు ఇప్పుడు నీకు ఎన్ని సీట్లు ఉన్నాయో ఆలోచించు నువ్వు అసలు మాకు ప్రతిపక్ష హోదాలు లేవు అలాంటప్పుడు నీ మీద నాకు కోపం ఉండదు. నువ్వు అనుకున్నట్టు సినీ విసిగిస్తూ ఏదైనా థియేటర్ ని ముసేశామ.

pawan kalyan sampoornesh babu
నిన్ను బట్టి సినీ పరిశ్రమ కు వ్యతిరేకంగా ప్రభుత్వం ఏదో చేస్తుందని నువ్వు అనుకోవద్దు సినీ పరిశ్రమను ఇబ్బంది పెట్టాలనే ఆలోచన మాకు అసలు లేనే లేదు కానీ మీరు అర్థం చేసుకున్న విధానం తప్పు అలాగే ప్రజలకు వాస్తవానికి బదులు మీ అభిప్రాయం తెలియజేయడం తప్పు అని వ్యాఖ్యానించారు

మీరన్నట్టు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేనట్లయితే టిక్కెట్ల రేట్లు పెంచి వాటి ద్వారా వచ్చే టాక్స్ ప్రభుత్వ ఖాతాల్లో వేసేవారమని
ప్రతి విషయాన్ని పారదర్శకం చేయాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు పోర్టల్ ద్వారా దనికుడి నుండి పేదవాడి వరకు సమాన ధరలో టిక్కెట్లను అమ్మడానికి ఆన్ లైన్ టికెటింగ్ నిర్ణయం తీసుకున్నారు అని అన్నారు.

అలాగే ఆన్లైన్ లో ట్రోల్ అవుతున్న కొన్ని వీడియోలను బట్టి అనిల్ కుమార్ గారు ఓపెన్ గా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ బట్టి సినీ ఇండస్ట్రీని భయపెట్టే అవసరం మాకు లేదు మండల పరిషత్ ఎన్నికల లో పవన్ కళ్యాణ్ పార్టీ నీ ఒక్క సీటు కే పరిమితం అయింది. మీ ట్రోలింగ్ వీడియోస్ వల్ల ప్రభుత్వానికి ఒరిగేదేమీ లేదు మా గురించి ఎన్ని ట్రోల్స్ చేస్తారో చేసుకోండి ఎలాగైనా మమ్మల్ని తలుచుకుంటున్న అందుకు ధన్యవాదాలు అని అన్నారు. కానీ వాస్తవాలు పరిశీలించడం నేర్చుకోండి అని మీడియాతో మాట్లాడారు.

ఆ తర్వాత మంత్రి అనిల్ కుమార్ మాటల పైన నటుడు సంపూర్ణేష్ బాబు స్పందిస్తూ మంచి మనసున్న పవన్ కళ్యాణ్ ని నాతో సమానం అని పోల్చినందుకు చాలా ఆనంద పడుతున్నాను అంటూ అనిల్ కుమార్ కి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రస్తుతం సినీ పరిశ్రమ కష్టాల్లో ఉంది అని సినీ పరిశ్రమ చుట్టూ ఎగ్జిబిటర్ల ఉచ్చు బిగుసుకుంటోంది అని . పెద్ద మనసు చేసుకొని పరిశ్రమ బాధలను పరిష్కారమయ్యేలా చూడాలని అని ట్వీట్ చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *