miss world manushi chhillar

మిస్ వరల్డ్ కి ఇన్ని కష్టాలా..? కంట తడి పెట్టిస్తున్న మానుషి చిలర్ దీన స్థితి..!

News Trending

ఒకప్పుడు మానుషీ చిల్లర అనే పేరు పరిచయం అక్కర్లేని పేరు.ఆమె 2017 లో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకుంది.అప్పట్లో మానుషీకి బీ టౌన్ మీడియాలో పిచ్చ క్రేజ్,ఫుల్ పబ్లిసిటీ, భారీ ఫాలోయింగ్, సినిమా ఆఫర్స్. ఏకంగా సల్మాన్,షారుఖ్, అమీర్ ఆఫీసుల నుండి ఆడిషన్స్. అదే స్పీడులో బాలీవుడ్ టాప్ హీరోయిన్ అయిపోనుంది అన్నంతగా హావా. అంతే కాకుండా యాష్ రాజ్ ఫిలిమ్స్ నుండి ఒక చిత్రంలో భారీ ఆఫర్.కానీ ఇవేవి ఇంకా నిజం కాలేదు. ఆమె కనీసం ఒక్క సినిమాకి కూడా మేకప్ వేసుకోకుండానే 5 సంవత్సరాలు గడిపేసింది. బాలీవుడ్ ఎంట్రీ పక్కన పెట్టండి కనీసం ఆమెకు వెబ్ సిరీస్ ఎంట్రీకి కూడా ప్రొడ్యూసర్స్ మొగ్గుచూపకపోవటం మానుషి చిల్లర్ రియల్ బ్యాడ్ లక్.

రారాజు పృథ్వీరాజ్ చౌహన్ బయోపిక్ లో అనుకోకుండా అప్పట్లో మానుషికి ఛాన్స్ దక్కింది.బాలీవుడ్ మోస్ట్ ట్యాలెంటెడ్ యాక్టర్ అక్షయ్ కుమార్ ఈ చిత్రం లో ఓ పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాతో ఆమె ఎక్కడికో వెళ్ళిపోతుంది అనుకున్నారు. కానీ ఈ కరోనా కారణంతో ఈ సినిమా ఇంకా ప్రీ ప్రొడక్షన్ పనులని కూడా పూర్తి చేసుకోలేదు. ప్రస్తుతం కొత్త మూవీస్ ల షూటింగ్స్ తో బాలీవుడ్ ఊపందుకున్న కూడా మానుషి చిల్లర్ ని పట్టించుకునే ప్రొడ్యూసర్లే కరువయ్యారు.ఆల్మోస్ట్ మానుషీ ఫెడ్ అవుట్ కావటంతో ఎవరు తనతో మూవీస్ తీయడానికి ఇంట్రెస్ట్ చూపించటం లేదట.

 

అయితే సినిమా కలలు పక్కనపెట్టి వెబ్ సిరీస్ అవకాశమైనా ఇవ్వండి అంటూ ఓటిటి ప్రొడ్యూసర్లను అడిగినప్పటికీ
ఎవరు పట్టించుకోవటం లేదట. సెంటిమెంట్స్ తో నడిచే ఈ మూవీ ఇండస్ట్రీలో మానుషికి అవకాశం ఇవ్వడానికే బయపడిపోతున్నారట ప్రొడ్యూసర్లు. క్యాలెండర్లకు మోడల్గా ఉంటూ వాటికి ఫోటోషూట్స్ ఇస్తున్నారు ఆమె ప్రస్తుతం. ముంబై లోని ఒక లోకల్ మోడలింగ్ షోస్ లో మానుషి పవర్క్ చేస్తుందని సోషల్ మీడియాలో ఒకటే చర్చ. ఇక ఇంస్టాగ్రామ్ లో కూడా తన ఫోటోషూట్లను షేర్ చేస్తోంది మానుషి.

మిస్ వరల్డ్ 2017 గా, చిల్లర్ నవంబర్ 26 న భారతదేశానికి తిరిగి వచ్చారు, అక్కడ ఆమెకు పెద్ద సంఖ్యలో ప్రజలు స్వాగతం పలికారు. 2017 లో హైదరాబాద్‌లో జరిగిన గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్‌లో ఆమె ప్రముఖ వక్తలలో ఒకరు. అనేమియా ఫ్రీ హర్యానాకు చిల్లర్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించబడింది.మిస్ వరల్డ్ విజేతగా నిలిచినందుకు 2017 CNN-IBN ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్‌లో ఆమె స్పెషల్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించబడ్డారు.

2017 లో గూగుల్ సెర్చ్‌లో ఆమె భారతదేశపు టాప్ ట్రెండింగ్ పర్సనాలిటీ. న్యూఢిల్లీలో జరిగిన సిక్స్ సిగ్మా హెల్త్‌కేర్ లీడర్‌షిప్ సమ్మిట్ 2017 లో ఆమె ప్రౌడ్ మేకర్ ఆఫ్ ఇండియా అవార్డును అందుకుంది. పుష్కర్‌లో హ్యూలెట్-ప్యాకర్డ్ ఎంటర్‌ప్రైజ్ ద్వారా ఆమె 10 వ C4IO లో అతిథి వక్తగా కూడా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *