మా ఎలక్షన్ తదనంతరం మోహన్ బాబు గారు విష్ణు ప్యానల్ కు సపోర్ట్ చేసి గెలిపించిన సినీ ప్రముఖులను ప్రత్యేకంగా కలిసి ధన్యవాదాలు తెలియజేసుకున్నారు. అదే రీతిగా బాలకృష్ణ గారిని కూడా కలవడానికి వెళ్లినప్పుడు ప్రజలలో ఉత్కంఠ నెలకొంది. కారణమేంటంటే బాలకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మరియు మోహన్ బాబు గారి బంధువు వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్ కావడమే వీరిద్దరి బేటీకి సర్వత్ర ఆశ్చర్యము మరియు ఉత్కంఠ కలిగించింది.
ఇక ఆ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన మోహన్ బాబు గారు తామిద్దరూ ఏకం అవ్వడానికి గల కొన్ని ఆసక్తి కలిగించే కారణాలను పంచుకున్నారు. మీరందరూ అనుకున్నట్టు ఆయన ఓటు వేశారు అని ఆయనను కలిశాను అని అనుకోవద్దు. ఆయనకు మాట ఇచ్చాను గనుక ఆయనను కలిశానని అని చెప్పుకొచ్చాడు మోహన్ బాబు గారు
గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీకి అపోజిషన్ గా పోటీ చేస్తున్న వైఎస్ఆర్సీపీకి నేను ప్రచారం చేశాను, బాలయ్య గారి అల్లుడుకి వ్యతిరేకంగా ప్రచారం చేసి ఓడించాను , మంగళగిరిలో ప్రచారం చేశాను అక్కడ కూడా వైసీపీ గెలిచింది.
అయితే మా ఎలక్షన్ సందర్భంలో నేను బాలకృష్ణ కి ఫోన్ చేయగా బాలయ్య బాబు స్పందించి నేను విష్ణు బాబు కి తోడుగా ఉంటా విష్ణు నాకు బిడ్డ లాంటి వాడే వచ్చి ఆశీర్వదిస్తా,నువ్వు నాకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు నేను ఖచ్చితంగా విష్ణు కి ఓటు వేస్తాను,అని అన్నారు. ఈ మాటలు బాలయ్య గారు అన్న తర్వాత నాకు ఆశ్చర్యం కలిగింది గతంలో జరిగిన ఏవి కూడా మనసులో పెట్టుకోకుండా మంచి మనసుతో వచ్చి నా బిడ్డను ఆశీర్వదిస్తానన్నారు. అందుకే బాలయ్య సంస్కారానికి చేతులెత్తి నమస్కరించాలి అనిపించింది. నాకైతే ఎన్టీ రామారావు అన్నయ్య గారు అరేయ్ వెళ్లి నా తమ్ముడి వద్దకు పోరా అని చెప్పి పంపించినట్టు అనిపించింది. అని మోహన్ బాబు గారు అన్నారు.
గతంలో కూడా నేను ఎలక్షన్ క్యాంపెయిన్ చేసిన పార్టీ గెలిచిన తర్వాత బాలయ్య బాబు కి ఫోన్ చేశాను అయితే ఆయన పది నిమిషాల తర్వాత చేయమన్నాడు కానీ ఆ లోపే తాను తిరిగి నాకు ఫోన్ చేసి . ఏంటి అని అడిగారు అందుకు నేను బాలయ్యను సరదాగా కలుద్దాం అని అన్నాను అందుకు సరే మీరు ఎప్పుడు కలుద్దాం అన్నా నేను సిద్ధంగా ఉంటాను అన్నారు. ఈ రెండు విషయాలలో బాలయ్య గారి మనసు ఎంత గొప్పదో నేను అర్థం చేసుకున్నాను నేను ఇప్పుడు ఆయనను కలవడానికి కారణం కూడా ఆయన సంస్కారాన్ని మరొకసారి అభినందించి మీకు తెలియజేయడానికి కలిశాను అని ఆయన అన్నారు
ఇక ప్రమాణ స్వీకారానికి గురించి విష్ణు మాట్లాడుతూ భారీ ఎత్తున నిర్వహించారు అనుకున్నాం అయితే కోవేట్ నిబంధనలు పాటించవలసి ఉండగా నాకు పర్మిషన్ లభించలేదు.అందుకే ప్రముఖుల ఆశీర్వాదంతో అక్టోబర్ 16 వ తారీఖున ఉదయం 11:50 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను ఈ ప్రమాణ స్వీకారానికి సినీప్రముఖుల అందరి ఆశీస్సులను తీసుకోవడానికి ప్రతి ఒక్కరిని కలుస్తాను అదే రీతిగా ప్రకాష్ రాజు గారిని కూడా కలిసి ఆహ్వానిస్తామని ఆయన అన్నారు.