mohan-babu-family

మోహన్ బాబు కమ్మ వాడై వుండి కులాంతర వివాహాలకు ఎలా ఒప్పుకున్నాడో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది.

News

తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీ ఏది తలపెట్టిన కాస్తోకూస్తో వైరల్ అవుతుంది ఉంటుంది . అయితే ప్రస్తుతం మా అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవికి కొరకు జరుగుతున్న ఎలక్షన్ సందర్భంగా ప్రత్యర్థులు ఇద్దరు అటు విష్ణు ఇటు ప్రకాష్ రాజ్ ఇద్దరు ఒకరిపైన ఒకరు విమర్శించుకొన్నే రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. ఇదే సందర్భంలో సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో లాగా కులాల ప్రసక్తి వచ్చినట్టు ఇక్కడ కూడా కులాల ప్రసక్తి ఒకటి వచ్చింది.

ముఖ్యంగా విష్ణువర్ధన్ ఒక కులానికి సంబంధించిన వారికే సపోర్ట్ గా ఉంటున్నాడని అదే రీతిగా ప్రకాష్ రాజ్ కూడా ఫలానా కులానికి సపోర్ట్ గా ఉంటున్నాడని చర్చలు సాగుతున్నాయి. మా ఎలక్షన్స్ వల్ల మంచు కుటుంబం యొక్క ఇంట్లో ఉంటున్న రకరకాల కులాల వారి గురించిన విషయాలు వైరల్ అవుతున్నాయి.

mohan-babu-family

అయితే ప్రతి సాధారణ ప్రేక్షకుడు మంచు కుటుంబాన్ని పరిశీలించినట్లయితే వారి కుటుంబంలో ఒకటి కంటే ఎక్కువ కులాల వాళ్ళు కలిసి ఉంటున్న సంగతి తెలుస్తుంది. మోహన్ బాబు విషయానికి వస్తే తన మరదలిని వివాహం చేసుకున్నారు కనుక వారిద్దరూ ఒకే వర్గానికి చెందిన వారు అంటే కమ్మ వారు అని అర్థమవుతుంది. అయితే మోహన్ బాబు గారి వారసులు లక్ష్మి , విష్ణు , మనోజ్ లు అందరూ కులాంతర వివాహాలు చేసుకున్నారు.

.కుమార్తె లక్ష్మీ మంచు బ్రాహ్మణ వర్గానికి చెందిన వ్యక్తిని కులాంతర వివాహము చేసుకుంటే, విష్ణు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న కుమార్తె అయిన వెరోనికాను వివాహం చేసుకున్నాడు సహజంగా వీరు రెడ్డి వర్గానికి చెందిన వారు.

చివరకు మనోజ్ భార్య ప్రణతి కూడా రెడ్డి వర్గానికి చెందిన అమ్మాయే అయితే ప్రణతి గత ఏడాదే మనోజ్ నుండి విడిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇలా రకరకాల వర్గాలవారు మోహన్ బాబు గారి కుటుంబం లో ఉంటున్నారు. వారందరూ వ్యత్యాసం లేకుండా సంతోషంగా జీవనం సాగిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *