నీ విపరీత బుద్దే నిన్ను నాశనం చేస్తుంది అంటు ప్రకాష్ రాజ్ పై సంచలన వ్యాక్యాలు చేసిన మొహన్ బాబు

News

మా అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవి కొరకు జరుగుతున్న ఎలక్షన్స్ లో ఒకవైపు ప్రకాష్ రాజ్ గారు మరోవైపు మంచు మనోజ్ గారు నిలబడిన సంగతి మనందరికీ తెలిసిందే. ఎలక్షన్ డేట్ దగ్గరికి వస్తున్న కొద్ది వీరిద్దరి మధ్య మాటల యుద్ధం నెలకొంది , అలాగే ప్రకాష్ రాజు ప్యానల్ లోని వారు మంచు విష్ణు ప్యానెల్ ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండు కొంటున్నారని మా ఎలక్షన్ కమిటీ కి ఆరోపించారు.

తాజాగా ఒక న్యూస్ ఛానల్ లో ఇంటర్వ్యూ కు అటెండ్ అయిన ప్రకాష్ రాజు గారు మోహన్ బాబు గారి గురించి తన అభిప్రాయాన్ని ఈ రకంగా బయటపెట్టారు. మోహన్ బాబు గారు అన్న తన కుటుంబం అయినా నాకు అత్యంత గౌరవం ఉందని అలాగే వారి ఇంటి వారికి నాకు మంచి సాన్నిహిత్యం ఉందని నేను భోజనం అడిగితే నా కోసం నా భోజనం పంపే అంత చనువు మా మధ్యలో ఉంది అని అన్నారు. అయితే ఇది ఎలక్షన్ కావడం మూలంగా అలాంటి వ్యక్తికి నేను ప్రత్యర్థిగా నిలబడ వలసి వచ్చిందని అన్నారు. అయితే ఒక కోణంలో ఆయనను గురించి ఆలోచించాల్సిన విషయం లో నేను సరిగా ఆలోచించలేదని అంటూ మోహన్ బాబు గారు ఒక సీనియర్ యాక్టర్ ఆయనకు పరిశ్రమలో గొప్ప మర్యాద ఉంది అలాగే తన మాటకు తిరుగు లేదు అనే ఆలోచన కూడా ఉంది ఇంతటి పవర్ఫుల్ వ్యక్తి తన కుమారుని మా అసోసియేషన్ ఎలక్షన్ ప్రెసిడెంట్ గా నామినేట్ చేసినప్పుడు తనకు తన అనుభవానికి విలువనిచ్చి ఎవరు కూడా తన కుమారునికి పోటీగా ఉండరని మోహన్ బాబు గారు భావించి ఉంటారు కానీ నేను వోట్లలో సిన్ అంతా మారిపోయింది ముఖ్యంగా నాకు ఆయనను అర్థం చేసుకునే మెచ్యూరిటీ లేదు అనే ప్రచారం ఒకటి బయటకు వచ్చిందని అన్నారు.

ఆ తర్వాత ప్రకాష్ రాజ్ ప్యానల్ ప్రెస్ మీట్ పెట్టి కొన్ని ఆధారాలతో మా ఎలక్షన్ లో జరుగుతున్న అక్రమాలను రుజువు చేసే ప్రయత్నం చేశారు. అలాగే ఓట్లను పక్కదారి పట్టిస్తున్నారు అంటూ ఎలక్షన్ కమిటీ నియమించిన నియమాలు పాటించకుండా తమ ఇష్టారాజ్యంగా ప్రజల వద్దకు వెళ్లి ప్రజలు ఓట్లు వేసే రీతిలో మోసపూరితమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారని ,బయటి వ్యక్తుల ప్రమేయం కూడా ఈ ఎలక్షన్లలో ఉందని ఆరోపించారు ప్రకాష్ రాజు. ఆ తర్వాత జీవిత మాట్లాడుతూ ప్రజలు ఆలోచించాలి ఎవరో ఫోన్ చేశారని అని వాళ్లకు లొంగిపోయి ఓట్లు వేయడం కాదు మీకు ఎవరు మంచి చేస్తారో వారికే ఓటు వేయండి అంటూ మాట్లాడారు. ఆ తర్వాత ప్రకాష్ రాజు గారు మాట్లాడుతూ ఎలక్షన్ కమిటీ నియమించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విష్ణు ప్యానల్ పట్టించుకోలేదని వాటిని మిస్ యూస్ చేస్తుందని అదే రీతిగా ప్రజలు తనకే ఓటు వేసే లాగా కొన్ని ఇల్లీగల్ పనులు చేస్తున్నారని ఆరోపించారు. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ శ్రీకాంత్ ను మాట్లాడండి అన్నప్పుడు ఇలా ఓట్లు నిర్వహించే పనైతే మనం నిలబడాల్సిన అవసరం లేదు అంటూ ఏమి మాట్లాడకుండా మౌనం గానే ఉన్నారు.

ఆ తర్వాత మంచు విష్ణు కూడా స్పందిస్తూ కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు. ముఖ్యంగా తన ఫ్యామిలీ జోలికి రావద్దని అలాగే మాకు ఓట్లు వేయొద్దు అని మీరు చెప్పడానికి ఎవరని అలాగా చెప్పినట్టు అయితే లీగల్గా మీపైన యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు
శ్రీకాంత్ గారిని ప్రస్తావిస్తూ మీరంటే నాకు చాలా అభిమానం ఉందని కానీ మీరు తప్పు మార్గంలో ఉన్నారని అని అన్నాడు చివరగా జీవితాన్ని ప్రస్తావిస్తూ రాజశేఖర్ గారు మా ఇంటికి ఎందుకు వచ్చాడు రాజశేఖర్ గాని అడిగి తెలుసుకోండి అంటూ ఆవేశ పడాడు విష్ణు.

ఇంకా ఈ ప్రెస్ మీట్ అయ్యాక మోహన్ బాబు గారు స్పందిస్తూ రామాయణ మహాభారతంలోని కథల ఆధారంగా కొన్ని హెచ్చరిక పూర్వకమైన వ్యాఖ్యలు చేశాడు.

పెద్దల మాటలను గౌరవించకపోతే ఎలాంటి నష్టం జరుగుతుందో మీ అందరికీ తెలిసే ఉంటుంది అని ప్రారంభించి. రామాయణంలో వాలి సుగ్రీవుడు అన్నదమ్ములు వాళ్ళిద్దరూ గొడవ పడ్డారు సుగ్రీవుడు ఓడిపోయాడు వెంటనే సుగ్రీవుడు వాలిని యుద్ధానికి పిలిచాడు. అప్పుడు వాలి భార్య ఏవండీ ఇప్పుడే యుద్ధం ముగిసింది ఇంకా రక్తం ఆరలేదు అప్పుడే సుగ్రీవుడు మళ్ళీ మిమ్మల్ని యుద్ధానికి పిలుస్తున్నాడు అంటే ఏదో మర్మం దాగి ఉంది వెళ్ళకండి అంటూ వాలిని బతిమాలింది కానీ వాలి తన భార్య మాట వినకుండా వెళ్ళిపోయాడు వెళ్లి యుద్ధం లో చనిపోయాడు , అలాగే సీతాదేవిని గుర్తుచేసుకున్నాడు సీతాదేవి కూడా దాటొద్దు అని చెప్పిన గీతను దాటి సమస్యలు కొని తెచ్చుకుని అని చెప్తూ ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించకుండ పెద్దల మాటలను గౌరవించండి అంటూ వీడియో ఒక విడుదల చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *