మా ఎలక్షన్ తర్వాత పరిస్థితులన్నీ సద్దుమనుగుతయి అని అనుకుంటే. ఎలక్షన్ తర్వాత మరింత దుమారం రేగుతోంది.
మా అధ్యక్ష పదవికి ప్రమాణ స్వీకారం చేసిన విష్ణు, తాజాగా ఒక ప్రెస్ మీట్ పెట్టి . అసోసియేషన్లో మార్చాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఎవడు పడితే వాడు సభ్యుడు అయిపోయి నిర్ణయాలు తీసుకోవడం కాదు దీనికి సుదీర్ఘంగా ఆలోచించాలి అని చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి, ఆ వ్యాఖ్యలను మర్చిపోకముందే మోహన్ బాబు గారు కూడా తనదైన శైలిలో ఒక సందర్భంలో సంచలన వ్యాఖ్యలు చేసి మరొక చర్చకు దారితీశాడు.
మోహన్ బాబు మరియు విష్ణు ల ప్రవర్తన మీడియా వారి చేతిలో ఆటబొమ్మలం కావద్దు అని చిరంజీవిగారు అన్న మాటకు వ్యతిరేకంగా ఉన్నట్టు కనిపిస్తుంది.
తాజాగా కొంతమంది సినీ ప్రముఖులు మరియు విష్ణు ప్యానల్ లోని కొంతమంది సభ్యులు ఒక వేడుకకు హాజరు కాగా మోహన్ బాబు గారు ప్రసంగిస్తూ ఇండస్ట్రీ లో జరుగుతున్న కొన్ని పరిస్థితులను గురించి కోప్పడ్డారు. ఆ పరిస్థితులను సరిచేయడానికి తన కుమారుడైన విష్ణుకు అన్ని విషయాల్లో సహాయపడతానని అన్నారు.
ఫిలింనగర్లోని కల్చరల్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నా జీవితం ఒక పుస్తకం లాంటిది. ఆ పుస్తకంలో విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ మరియు హీరోగా చేయాలని ఉంది కాబట్టే చేశాను. మనలో టాలెంట్ ఉంటే కచ్చితంగా ఇండస్ట్రీలో ఎదుగుతాం కని రాజకీయాలు చేస్తే కాదు అని గుర్తుపెట్టుకోండి.
మనమంతా ఒక తల్లి బిడ్డలం ఇక్కడ రాజకీయాలాంటివి జరగకూడదు, గత ఎలక్షన్లో లో జరిగిన పరిణామాలను బట్టి నేను ఆశ్చర్యపోయాను అని ఆయన అన్నారు. మోహన్ బాబు గారు మాట్లాడుతుండగా వెనకాల నుండి మధుమిత గుసగుసలడినట్టు శబ్దం ఆయనకు వినిపించగా వెంటనే స్పీచ్ ఆపేసి ఆ అమ్మాయి వైపు తిరిగి సీరియస్ గా ఏ అమ్మాయి అని సీరియస్ గా ఆమె పై అరిచ్చాడు నా పెదవులు మాట్లాడుతున్నప్పుడు మౌనం గా ఉండాలి అంటూ, ప్రవర్తన సరి చేసుకో ఇలాంటివి నాకు నచ్చావ్ అని ఆమెతో అన్నాడు ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది.