ఈటీవీ తెలుగులో విజయవంతంగా ప్రసారమవుతున్న షోలలో ఆలీతో సరదాగా షో ఒకటి. ఈ షో ప్రస్తుతం అయిదు సంవత్సరాల నుండి విరామం లేకుండా కొనసాగుతూ 250 వ ఎపిసోడ్ కు చేరుకుంది . అయితే ఈ ఎపిసోడును ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని భావించిన నిర్మాతలు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారిని ఆహ్వానించారు.. ఎపిసోడ్ నెంబర్ 249 మరియు 250 కలెక్షన్ కి మోహన్ బాబు గారిని ఆహ్వానించి ఎన్నో విషయాలను తన ద్వారా చెప్పించారు. తాను పంచుకున్న మాటలకు ఆరోజు ఎపిసోడ్ నిజంగానే స్పెషల్ అనిపించింది. అలిగారు కూడా తామిద్దరూ కలిసి నటించిన సమయాన్ని గోల్డెన్ డేస్ గా అభివర్ణించడంతో ప్రేక్షకులలో షో చూడాలనే ఆసక్తి అమాంతం పెంచేసింది.
అయితే ఈ షోలో మోహన్ బాబు గారిని ప్రస్తుతం జరుగుతున్న మా ఎలక్షన్ గురించి ఎన్నో ప్రశ్నలు అడిగి అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. ప్రేక్షకులు కూడా ఇది ప్రస్తుతం సినీ పరిశ్రమలో జరుగుతున్న సందర్భమే గనుక మరీ ఆసక్తితో చూశారు.
అదే విధంగా తన గత జీవితంలో తాను సాధించిన సక్సెస్ ల గురించి మరియు తాను సీనియర్ ఎన్టీఆర్ హయాంలో టడిపి తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన విషయాన్ని గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు పంచుకున్నాడు.
ఆ ఆరోజు షో లో ఆలీ గారు మోహన్ బాబును అడిగిన ప్రతి ప్రశ్న ఎంతో ఆసక్తికరంగా అనిపించాయి. వాటిలో ఎన్టీఆర్ గారిని మీరు నిర్మించిన మేజర్ చంద్రకాంత్ సినిమా లో నటించడానికి ఎలా ఒప్పించారని, రజినీకాంత్ అప్పటికే టాప్ స్టార్ అయ్యుండి మీ పెదరాయుడు సినిమా లో మీ తండ్రిగా అతి చిన్న పాత్రలు పోషించడానికి ఎలా ఒప్పుకున్నారని,పరిటాల రవి మీకు సంబంధం ఎంటి, మీరు నిర్మించే సినిమాల్లో చిత్ర బృందం పేకాట అడటం మీరు చూసి వారిని ఎం చేశారు, అద్దె కట్టలేని పరిస్థితుల్లో స్కూల్ ఎలా పెట్టారు. అని సంచల్నాత్మక ప్రశ్నలను ఆలి గారు అడిగారు. వాటన్నిటికీ మోహన్ బాబు జంకకుండ ముక్కూ సూటిగా సమాధానం చెప్పుతూ వచ్చాడు.
ఇదే సమయంలో తను నిర్వహిస్తున్న విద్యనికేతన్ గురించి సంతోష పడుతూ తనకు ఆనందం కలిగించిన కొన్ని సందర్భాలను జ్ఞాపకం చేసుకున్నారు.
ప్రారంభంలో చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యాక ఏది ముట్టిన బంగారం అయిపోతుంది .అనే భావన ఉండేదని అయితే వయసు అయిపోయిన తర్వాత ఇలా ఊహించుకోలేము అని ఆలోపు ఏదైనా చేసి మంచి స్థాయిలో ఉండాలని అనుకుంటున్నానని అని అందుకొరకు ఫై స్టార్ హోటల్ పెట్టాలని ఆశ ఉండేదని అయితే ఆ ప్రయత్నంలో తనకు పరిచయమైన వ్యక్తులు తనను మోసం చేయడం వల్ల చాలా మట్టుకు డబ్బులు పోగొట్టుకున్న అని తెలియజేశారు. ఆ కాలంలో తన ఆప్తుడు మరియు శ్రేయోభిలాషి అయిన రజినీకాంత్ గారి మాట విన్న మోహన్ బాబు ఒక పాఠశాల పెట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలియజేశారు.
ప్రజలు కష్టాలు వచ్చినప్పుడు ఒక తీరుగా సుఖాలు వచ్చినప్పుడు ఒక తీరుగా ఉంటారు. అలాంటి అనుభవం ఏ రకంగా ఉంటుందో అద్దె కట్టలేని తిండి దొరకని పరిస్థితుల్లో నాతో కలిసి పని చేసిన వారిని నావల్ల అనుకున్నాను, గానీ వారు ఎవరు కూడా నాకు సహాయపడలేదు. ఆ రీతిగా కష్టాలు అనుభవించిన నేను ఈరోజు కుల, మతాలకు అతీతంగా పేదవారైనా అనేకమందికి ఉచితంగా విద్యను అందించే గొప్ప భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. ఆ రకంగా తన విద్యాసంస్థల్లో చదువుకున్న అనేకమంది విద్యార్థులు ఈరోజు ఒక ఐఏఎస్ గా ఒక ఐపీఎస్ గా మంచి మంచి స్థానాల్లో ఉన్నారు .
అవి నాకు నిజంగా గర్వకారణమని మోహన్ బాబు గారు అన్నారు. అదే సమయంలో సినీ పరిశ్రమలోని ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూతురు తండ్రిని పోగొట్టుకొని తన జీవితం పట్ల ఏ భవిష్యత్తును కూడా తను ఆలోచించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మా స్కూల్లో చదివించాను. ఆమె ప్రస్తుతం సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా చలామణి అవుతున్నారు అని తెలియజేశారు, ఇవన్నీ నీటిని గురించి ఆలోచిస్తున్నప్పుడు తనకు చాలా సంతోషం అనిపిస్తుంది ,అని అయితే ఈ గొప్పతనమంతా కాదని ఇదంతా కూడా భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదం అని ఆయన అన్నారు.
ఇక మోహన్ బాబు గారు ప్రస్తావించిన టాప్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ అని చాలామందికి తెలుసు . తాను ఇప్పుడు తమిళ చిత్ర పరిశ్రమలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న టాప్ హీరోయిన్.