తెలుగు బుల్లితెరపై ఆలరించే యాంకర్లలో విష్ణుప్రియ ఒకరు, ఆమె టాప్ యాంకర్లతో పరిగణించబడనప్పటికి తన స్టైల్లో తాను పబ్లిసిటీ సంపాదించుకున్నారు, ముఖ్యంగా షార్ట్ ఫిలింలు వెబ్ సిరీస్ తో మరియు ఇతర కార్యక్రమాల ద్వారా సోషల్ మీడియాలో గొప్ప ఫాలోయింగ్ సంపాదించుకున్న వ్యక్తి విష్ణు ప్రియ. ఇవేగాక హీరోయిన్లతో తానేమీ తక్కువ కాదని తన అందాలను చూపిస్తూ అప్పుడప్పుడూ నిర్వహించే ఫోటోషూట్ ల ఫోటోలు పెద్దగానే వైరల్ అవుతూ ప్రజల్లో మదిలో మెదిలే యాంకర్ గా నిలిచింది.
అయితే ఈ భామ తాజాగా ముక్కు అవినాష్ పెళ్లి వేడుకకు హాజరై సూపర్ గా ఎంజాయ్ చేసింది, ఇక అవినాష్ పెళ్లయిన కొంతకాలానికి ఆ పెళ్లి ని ఉద్దేశిస్తూ ఒక పోస్ట్ పెట్టింది.
ఈ సంవత్సరంలో మనతో ఎప్పటికీ ఉండాలని కోరుకునే వ్యక్తుల్ని కోల్పోవాల్సి వచ్చింది అని ఒక మేమ్ పేజ్ చేసిన పోస్ట్ లు షేర్ చేసి అవును నిజమే అంటూ రెండు లైన్లు దానికి జోడించి పోస్ట్ లు షేర్ చేసింది. ఇక నేటి జనులు విష్ణుప్రియ గురించి ఆరా తీస్తూ ఈమె ఎవరిని కోల్పోయింది? ఎప్పుడు కోల్పోయింది? అని తెలుసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
కొంతమంది ఇదంతా అవినాష్ గురించే అని అనుమాన పడుతున్నారు, ఎందుకంటే గతంలో చాలాసార్లు విష్ణు ప్రియ మరియు అవినాష్ ల కాంబినేషన్ బాగుంటదని వారి ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా పండుతుందని చాలా సార్లు కామెంట్ చేశారు, సాధారణంగా సెట్లపైన అవినాష్ విష్ణుప్రియ శ్రీముఖి మంచి స్నేహితులుగా కనిపిస్తారు కానీ అవినాష్ విష్ణు ప్రియ ల మధ్యలో స్నేహానికి మించి ఏదో ఉంది అనే రీతిగా కొన్ని పుకార్లు కూడా పుట్టుకొచ్చాయి,
ఇక అవినాష్ అనుమానాలకు తావు ఇయ్యక తన చిన్ననాటి స్నేహితురాలు అనూషను వివాహము చేసుకొన్నాడు.
అయితే ఈ వివాహం అనంతరం కొంత కాలము గ్యాప్ తీసుకుని విష్ణు ప్రియ చేసిన పోస్ట్ అవినాష్ ను ఉద్దేశించిందే నని , ఒకవేళ అవినాష్ ను ఉద్దేశించింది కానట్లయితే పెళ్లిరోజు లేదా పెళ్లి మరుసటిరోజే ఈ రకమైన పోస్ట్ పెట్టేదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఈ పోస్టు ఎప్పటిలాగే వైరల్ గా మారింది.
ఇక విష్ణు ప్రియ కొన్ని వెబ్ సిరీస్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు వాటిలో ఎన్నో వెబ్ సిరీస్ లకు ఒప్పుకొని ప్రేక్షకులకు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు, ఇక విష్ణు ప్రియ ది బ్యూటీ అండ్ బేకర్స్ అనే వెబ్ సిరీస్ లో సంతోష్ శోభన్ ప్రేయసిగా నటిస్తున్న విషయం తెలిసిందే.