Naga babu

పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే దమ్ము ఉందా రా – Naga Babu

News

నాగ బాబు స్పీచ్ తర్వాత మా అసోసియేషన్ ఎలక్షన్ సీన్ అంత రివర్స్ అయింది.

నాగబాబు స్పీచ్ హైలైట్స్

ఎన్నో రోజులుగా ఉత్కంఠ లేపుతున్న మా అసోసియేషన్ ఎలెక్షన్స్ లో తాజాగా నాగబాబు గారి సపోర్ట్ ప్రకాష్ రాజు ప్యానల్కు ఉండటంతో సీన్ మొత్తం రివర్స్ అయినట్టు కనిపిస్తోంది.
మోహన్ బాబు గారి మాటలు తర్వాత వారు మొత్తం వన్ సైడ్ అయినట్టుగా అనిపించింది కానీ అది మోహన్ బాబు ఉ ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒకవేళ మెగా కుటుంబం ఎవరైనా పోటీలు ఉన్నట్టయితే విష్ణువుని వద్దని చెప్పే వాడిని అని వ్యాఖ్యానించారు ఆమాటలు కొంతకాలానికి మెగా ఫ్యామిలీ మెంబర్ అయిన నాగబాబు ప్రకాష్ రాజు గారికి ఇచ్చేసరికి అంచనాలు అన్నీ తార్ మార్ అయిపోయాయి

నరేష్ వల్లే అన్ని విషయాలు బైట పడుతూ ఉంటాయి…

ముఖ్యంగా గా ప్రకాష్ రాజు ప్యానెల్ వారు నిర్వహించిన మీటింగ్ లో ఆయన ప్రసంగించిన ప్రతి మాట ఓటర్లను ప్రకాష్ రాజు కే సపోర్ట్ రీతిగా సంచలనం సృష్టించింది .
మా అసోసియేషన్ అంటే చాలా పాపులర్ కానీ చాలా చిన్న అసోసియేషన్ అంటూ ప్రారంభించారు. మనలో ఉన్న ఒకే ఒక్క వ్యక్తి వల్ల మా అసోసియేషన్ లో అంతర్గతం గా వచ్చిన సమస్యలకు మా అసోసియేషన్ వారిని కలిసి పరిష్కరించు కోకుండా ప్రతి విషయాన్ని ప్రెస్ మీట్ పెట్టి న్యూస్ ఛానల్ ద్వారా సమస్యలన్నీ బయట పడేస్తూ ఉన్నాడని నరేష్ గురించి ప్రస్తావించాడు.

ప్రకాష్ కు నాకు అభి ప్రాయ భేదాలు ఉన్నాయి

ప్రకాష్ రాజ్ గురించి ప్రస్తావిస్తూ మేమిద్దరమూ సామాజికంగా వేర్వేరు పార్టీలకు చెందిన వారు నేను బిజెపి వాడిని అయితే ప్రకాష్ రాజు కమ్యూనిస్టు ఆలోచనలు కలిగినటువంటి వాడు ప్రకాష్ రాజు నాకు మిత్రుడు కానేకాదని ప్రకాష్ రాజ్ మా అన్నయ్యకు మంచి స్నేహితుడు అని.
ప్రకాష్ రాజ్ కు నాకు చాలా సార్లు అభిప్రాయ భేదాలు కలిగాయి
అయిన ప్రకాష్ రాజు మా అన్నయ్యకు స్నేహితుడు కాబట్టి ఆటోమేటిక్గా మాకు కూడా మంచి స్నేహితుడే అని ప్రకాష్ రాజు గారి గురించి చెప్తూ.

Naga babu
Naga babu

అందుకే ప్రకాష్ రాజ్ కి సపోర్ట్ చేస్తున్నాను..

మా ఎలక్షన్స్ ప్రారంభంలో నరేష్ ప్యానెల్ కి సపోర్ట్ చేద్దాం అనుకున్న , నేను మా అన్నయ్యను కలిసి ఇదే విషయం మాట్లాడినప్పుడు చిరంజీవి గారు ప్రకాష్ రాజు గారు మంచి తెలివి పరుడని తిలివిగా ఆలోచిస్తాడు అని చెప్పినప్పుడు ప్రకాష్ రాజు గారికి సపోర్ట్ చేయడానికి నేను ముందుకు వచ్చాను అన్నాడు.

ప్రకాష్ రాజ్ తెలివైన వాడు..

ఆ తర్వాత ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడుతూ ప్రకాష్ రాజ్ చూడ్డానికి సైలెంట్ గా ఉంటాడు కానీ మాట్లాడే ప్రతి పాయింట్ ఆలోచించి మాట్లాడతాడని అవతల వ్యక్తిని మాట్లాడకుండా చేసే అనేకమైన లాజికల్ పాయింట్స్ మాట్లాడగల సామర్ధ్యత ప్రకాష్ రాజ్ కి ఉంది. గతంలో ప్రకాష్ రాజ్ గారు ఇండియా టుడే ఛానల్ లో చేసిన డిబేట్ గురించి ప్రస్తావించాడు , అవతల సీనియర్ బెస్ట్ లాయర్ బిజెపి యాక్టివ్ మెంబర్ అయిన సుబ్రమణ్యం గారితో డిబేట్ చేసినప్పుడు సుబ్రమణ్యం గారిని ప్రకాష్ రాజ్ డామినేట్ చేసినట్టు అనిపించింది అని చెప్పారు. సుబ్రమణ్యం లాంటి తెలివైన వ్యక్తి తో డిబేట్ చేసిన వ్యక్తి ప్రకాష్ రాజ్ అంతటి సామర్ధ్యత మాకు ఎవరికీ లేదని నాగబాబు అన్నారు.

ప్రకాష్ రాజు లో ఉన్నది ఏంటి మాలో లేనిది ఏంటి…

మా ఇద్దరి మధ్యలో కొన్ని విభేదాలున్నా ప్రకాష్ రాజ్ లాంటివాడు అందరివాడు అంటూ. మన భారత దేశం లో ప్రతి సినిమా పరిశ్రమలో చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ప్రకాష్ రాజు ఉండాలి అని కోరుకుంటారని, ప్రకాష్ రాజ్ సినిమా పరిశ్రమలో ఉప్పు లాంటి వాడని ప్రకాష్ రాజ్ ని పొగిడారు, ఎంతో మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు మాలో ఏం తక్కువ ప్రకాష్ రాజ్ లో ఏమి ఎక్కువ కనిపిస్తుంది అని నన్ను అడిగినప్పుడు ప్రకాష్ రాజ్ భారత దేశంలో అన్ని పరిశ్రమలు నటించే ఫ్యాన్ ఇండియా స్టార్ లాంటివాడు ఆయన సాధారణ వ్యక్తి కాదు కాబట్టే భారత ప్రభుత్వం ఆయనను గుర్తించి ఐదు సార్లు జాతీయ అవార్డు ను ఆయనకు ఇచ్చింది ఆయన ఇప్పుడు మంచి రేంజ్ లో ఉన్నారు కనీసం ఏదైనా ఒప్పుకోండి అంటూ వాళ్లను సూచించాను అన్నారు.

బిజీగా ఉండే ప్రకాశ్ రాజ్ అసోసియేషన్ కోసం టైం కేటాయించ గలడా..

మొదట్లో ప్రకాష్ రాజు ఇలాంటి ఎలక్షన్స్ లో పాల్గొంటాడు అని నేను అనుకోలేదు కానీ ప్రకాష్ రాజ్ గారు ఎలక్షన్లో నిలబడ్డాడు అని తెలియగానే నేను ప్రకాష్ రాజు గారిని అడిగిన మొదటి ప్రశ్న నిజంగా నువ్వు ఎప్పుడూ బిజీగా ఉంటావు అసోసియేషన్ గురించి టైం కేటాయించ గలవా అని అడిగినప్పుడు ప్రకాష్ రాజ్ 100% ఇస్తాను వీలైతే కొన్ని సినిమాల్లో అయినా వదులుకొని అసోసియేషన్ కోసం కష్టపడతాం అని ప్రమాణం చేశాడని చెప్పారు

అలాంటి వాడిని తెలుగోడు కాదు కన్నడ వాడు అని ఎలా అంటారు భారతదేశంలో ఉన్న సుమారు అన్ని భాషల్లో సినిమాలో నటించి దేశాన్ని రిప్రజెంట్ చేసే అతికొద్ది యాక్టర్ ల లో ప్రకాష్ రాజు ఒకరు.

మోడీ అమిత్ షా లను ఒప్పించే ధైర్యం మీకుందా. బిజెపి ప్రభుత్వం అంటే విరుద్ధం ఉన్నప్పటికీ మా అసోసియేషన్ తరపున మోడీ గారిని అమిత్షా గారిని తన ఐడియాలజీ తో అసోసియేషన్ కి మంచి చేయగలరని చెప్పు ఇతర ప్యానెల్ వారిని మీరు చేయగలరా అని ప్రశ్నించాడు.

మనలో చాలామంది ప్రకాష్ రాజు ప్రేమతో పలకరించినా కూడా ఆయన గురించి వ్యతిరేకత కను పరిచారని, ప్రకాష్ రాజు ఎవడు ? ఆయన తెలుగోడా ? అంటూ ఆయనను విమర్శిస్తున్నారు, మరి ఆయన తెలుగోడు కానప్పుడు ఆయన తెలుగు సినిమాల్లో ఎందుకు చేయాలి అని విమర్శించిన వారి పేర్లు ఎత్తుతూ ప్రశ్నించాడు.

ప్రెసిడెంట్ అంటే తలకు ముళ్ళ కిరీటం చుట్టుకున్నట్టు.

మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అనేది తల పైన ముళ్ళ కిరీటం పెట్టుకున్నట్టుగా ఉంటుందని నాకు ఎన్నో సార్లు అవకాశాలు వచ్చినా నేను దానికి ఉన్నాను అని చెప్పారు ఇంత ధైర్యం చేసి ముందుకు వచ్చిన ప్రకాష్ రాజు గారిని సపోర్ట్ చేయకపోవడం ఏంటి అని మాట్లాడుతూ. కొంతమంది ఆలోచనలో ప్రెసిడెంట్ పదవి అంటే ఎంజాయ్ చేయడం అని, రాజరికం అనుకుంటున్నారని కానీ అది ఖచ్చితంగా కాదు అని చెప్తూ.

ప్రకాష్ రాజు ని బట్టి పవన్ కళ్యాణ్ ని విమర్శించడం ఏంటి. తాజాగా ప్రకాష్ రాజు గారి ఇంటర్వ్యూ ను చూశానని ఆ ఇంటర్వ్యూ లో ప్రకాష్ రాజ్ గారు మాట్లాడిన మాటల లో విష్ణు తన గురించి ఎత్తిన ఎలివేషన్స్ ఉన్నాయని గమనించండి అన్నాడు . మంచు విష్ణు ప్రకాష్ రాజ్ నువ్వు పవన్ కళ్యాణ్ వైపు ఉంటావా ఇండస్ట్రీ వైపు ఉంటావా అని చాలెంజ్ చేసినట్టు చూశానని. తెలుగోడు అయ్యుండి ఒక తెలుగు యాక్టర్ గురించి ఇలా మాట్లాడడానికి కారణం ఏంటి ఇలా మాట్లాడటం వల్ల విష్ణువర్ధన్ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నాడు నాకు అర్థం కాలేదని నాగబాల ఉన్నారు.

మా అసోసియేషన్ కొరకు కొన్న భూమి ఏమైంది.

నేను ప్రకాష్ రాజు గారికి సపోర్ట్ చేస్తున్నందుకు గతంలో జరిగిన మా అసోసియేషన్ బిల్డింగ్ మరొకసారి ఎత్తడం ప్రస్తావించి గతంలో ఆర్టిస్టుల కోసం ఒక అసోసియేషన్ బిల్డింగ్ ఉండాలని దాని కోసం గతంలో స్థలం కొన్నామని ఆ స్థలం ఇండిపెండెంట్గా మిగతా అసోసియేషన్ బిల్డింగ్ లకు దగ్గరగా ఉంటుందని అన్నారు సుమారు 90 లక్షలతో 170 గజాల భూమిని కొన్నం అన్నారు. అయితే మా లోపట ఉన్న కొంతమంది సభ్యులు నేనేదో భూమిని కొందామని చెప్పి డబ్బు వేస్ట్ చేశాను అని ఉద్దేశంతో మా లో ఉన్న వాళ్ళు కొంతమంది డబ్బిచ్చి ఆ స్థలాన్ని తీసుకున్నారని అని అన్నారు ఆ స్థలం ఈరోజు మన వద్ద ఉంటే సుమారు కోటిన్నర పలికే దని అన్నారు.

డబ్బు ఆశ చూపించి ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు…

మరియు ఆర్టిస్టులకు డబ్బు ఆశ చూపి ఓట్లను కొంటున్నారని విన్నాను అంటూ, కొంతమందికి పదివేలు ఇచ్చారని మరి కొంత సొమ్ము ఇవ్వబోతున్నారు అన్నట్టు విన్నానని అన్నారు , అయితే నేను గతంలో మా అసోసియేషన్ మసకబారింది అంటూ చేసిన మాటలు ఇప్పుడు నిజం అవుతున్నాయి అన్నారు . ఎవరో ప్రలోభ పెడితే ఓట్లు వేయొద్దని వాటివల్ల మీకే నష్టం జరుగుతుందని .

ప్రకాష్ రాజు గారిని వల్ల మీకు మంచి జీవితం ఉంటుందని ప్రకాష్ రాజ్ కు సపోర్ట్ ఇవ్వండి అంటూ, ప్రకాష్ రాజు ఇప్పుడే కాదు వచ్చే మూడు సార్లు కూడా ఆయనే గెలిపించి నట్లయితే మా అసోసియేషన్ టాప్ కి వెళ్తుందని చెప్పారు.

*ప్రకాష్ రాజు డెవలప్మెంట్ ఏంటో మేము ముందే చూసేశాం.. *

ప్రకాష్ రాజ్ డెవలప్మెంట్ అనేది కేవలం మాటల్లోనే కాదని తాను చేయబోతున్న మార్పులు మాకు ఒక పిపిటి ద్వార మా అసోసియేషన్ కి చేయబోయే మంచిని చూపెట్టాడు అని ఆయనకు సపోర్ట్ చేస్తున్నామని అన్నారు.

మంచివాన్ని ఎన్నుకుంటే ప్రజలు గెలిచినట్టు .. చెడ్డవాన్ని ఎన్నుకుంటే ప్రజలు నష్టపోతారు..

పరిశ్రమలు ఉన్నవారందరూ మెచ్యూర్ అవ్వాలని రాబోయే తరాలలో మన పిల్లలు భారతదేశంలో ప్రతి భాషలో నటించాలని కోరుకోవాలని కేవలం ఒకే పరిశ్రమకు పరిమితం కావాలనే ఆలోచన మానుకోవాలని, ఇలా మన పరిశ్రమలో మనమే చేయాలని ఆలోచన ఉన్నట్టయితే ఇతర పరిశ్రమలు కూడా మన లాగానే తయారవుతాయని అది మనకు శ్రేయస్కరం కాదని సూచిస్తూ ,

ప్రకాష్ రాజు గారి భవిష్యత్ కార్యాచరణ పైన భారీ నీ అంచనాలు వేస్తూ కచ్చితంగా నెరవేరుస్తాడని నమ్ముతూ ప్రకాష్ రాజ్ కు సపోర్ట్ ఇస్తానని మీరు కూడా ఇవ్వాలని ప్రజలను కోరారు , అలాగే ప్రకాష్ రాజ్ గారు మీరు మరొక రెండు సార్లు మా కోసం మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గా పోటీ చేయాలని కోరుకుంటూ ముగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *