సమంత నాగచైతన్య విడిపోయారు ఇదే ఫైనల్ న్యూస్

News

గత కొంతకాలంగ ఉత్కంట రేపుతున్న నాగ చైతన్య సమంతల విడాకుల విషయం కొలికి వచ్చేయనుంది. ఇందుకు వారిద్దరి ప్రవర్తన గుర్తించదగ్గ మార్పులు రావటమే అంటున్న తెలుగు ప్రేక్షకులు. ఇదే మ్యాటర్ ని ఇప్పుడు పూర్తి వార్త దేశం అంత కూడా మాట్లాడుకుంటుంది. ఇంత అందమైన జోడి విడిపోవడానికి కారణాలు ఇప్పటివరకు కూడా తెలియక ప్రేక్షక ప్రపంచం అతలాకుతలమవుతోంది.

సమంత నాగచైతన్య విడిపోతున్న విషయము ప్రజలు నమ్మే రీతిగా రోజురోజుకీ ఒక్కొక్కటిగా సమంత నాగచైతన్య లో మార్పులు బయటపడుతూ ఉన్నాయి మొదటగా సమంత తన ట్విట్టర్ ఐడి నుండి అక్కినేని అనే ఇంటిపేరు తీసేయడం ఆ తర్వాత తన పూర్తి పేరు తీసేసి కేవలం ఎస్ అనే అక్షరం పెట్టుకోవడం తాజాగా గుళ్లకు సమంత ఒంటరిగా వెళ్లి దర్శించుకోవడం దినదినము ప్రేక్షకులను కాన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నాయి. అదే రీతిగా ఈ అంశం పైన వాళ్ళు ఏ రోజు కూడా పబ్లిక్ కి తెలిసే రీతిగా క్లారిటీ ఇవ్వలేదు.

Naga Chaitany Samantha
Naga Chaitany Samantha

అక్కినేని కుటుంబం గానీ సమంత గానీ ఈ విషయం పైన మౌనంగా ఉండటం బట్టి ప్రేక్షకులు వీరు విడిపోతున్నారు అన్న విషయం బలంగా నమ్మేస్తున్నారు.అలాగే ఇంతకాలము సమంతాలో కనబడిన మార్పు తాజాగా నాగ చైతన్య లో కూడా కనిపిస్తుంది .ముఖ్యంగా నాగచైతన్య ప్రస్తుతం చేస్తున్న లవ్ స్టోరీ అనే సినిమా విషయంలో కనబడ్డాయి.
ఈ సినిమా విషయమై ప్రమోషన్ ఈవెంట్ లో సమంతా లేకపోవడం సమంత ఎక్కడికైనా వెళ్తే ఆమెతో నాగచైతన్య కనబడకపోవడం నాగచైతన్య సమంత కలిసి అన్ని విషయాలో కనిపించకపోవడం తెరపైకి వచ్చాయి.

అయితే తాజాగా జరిగిన మరొక ఇన్సిడెంట్లో ఈ అనుమానాలకు త్వరలో తెరపడబోతుంది అన్నట్టుగా కనిపించాయి. ఈ మధ్యకాలంలో నాగార్జున పుట్టినరోజు పార్టీకి సమంత హాజరుకాకపోవడం అలాగే నాగచైతన్య సాయి పల్లవి నటించిన లవ్ స్టోరీ సినిమా హిట్ అవడంతో అక్కినేని నాగార్జున గారి ఇంట్లో డిన్నర్ పార్టీ జరిగింది.అయితే సమంతా ఆ డిన్నర్ పార్టీకి హాజరు కాకపోవడంతో నాగచైతన్య సమంత మధ్యలో ఏదో మనసుపర్దలు ఉన్నాయని ఆ మనస్పర్థల వల్ల వీళ్లు విడిపోబడుపోతున్నారని ప్రజలకు ఒక క్లారిటీ వచ్చింది ఇదే అంశం పైన సోషల్ మీడియాలో ఎన్నో వైరల్ పోస్టులు ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి.

అయితే సమంత ఈ విషయం పైన ఇన్నాళ్లకు స్పందిస్తూ సోషల్ మీడియాలో వస్తున్న పుకార్ర్ల వల్ల తన భర్త పరువు నష్టం జరుగుతుందని ఈ వార్తలకు అడ్డుకట్ట వేయాలని వేయకపోతే రాసే వాళ్ళు ఇంకా నీచంగా రాస్తారని కోర్టును ఆశ్రయించారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కాలమే సమాధానం చెప్పాలి.

నాగ చైతన్య తన సొంత ఇన్స్టాగ్రామ్ లో డివోర్స్ గురుంచి పోస్ట్ చేసాడు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *