Naga chaitanya reaction on samantha Item Song

ఐటమ్ సాంగ్ చేసిన తర్వాత ఇండైరెక్ట్ గా సమంతా గురించి మాట్లాడిన నాగ చైతన్య

Movie News

సమంత తో విడాకులు తీసుకున్న తర్వాత మొదటి సారి నాగచైతన్య తన కుటుంబం గురించి మాట్లాడాడు.ఆయన చెప్పిన కొన్ని ఆసక్తి కలిగించే మాటలు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతూ ఉన్నాయి.
విడాకులు జరిగిన తర్వాత సమంత నాగ చైతన్య ల పై వచ్చిన రూమర్స్ కు ఎన్నోసార్లు సమంత స్పందించినప్పటికీ నాగచైతన్య ఒక్కసారి కూడా రూమర్స్ వైపు తిరిగి చూడలేదు. సమంత పై ఎన్నో అవాస్తవాలు పుట్టించిన నాగచైతన్య సమంత క్యారెక్టర్ నాకు తెలుసు ఆమె అలాంటిది కాదు అని ఎన్నడూ కూడా సమంత గురించి మాట్లాడలేదు. సమంత మాత్రం విడాకుల తర్వాత చనిపోవలనిపించిందని ఆ ఆలోచన నుండి డైవర్ట్ అవ్వటానికి రక రకాల సినిమాలు ఒప్పుకోవాలి వచ్చిందని ఒక ఇంగ్లీష్ మేగజైన్ కు ఇంటర్వ్యూ ఇస్తూ తెలియ జేసింది.

అయితే తాజాగా నాగచైతన్య మాట్లాడిన ఒక వీడియో సారాంశం సమంత క్యారెక్టర్ గతంలో సరిగలేదు అన్నటుగా ఉండటం వల్ల ఇప్పుడు ఆ వీడియో ఇంటర్నెట్ అంతటా చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళితే తాజాగా నాగచైతన్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మీరు ఎలాంటి పాత్రను చేయడానికి ఇష్టపడరు అని యాంకర్ ప్రశ్నించగా నాగచైతన్య ఇచ్చిన సమాధానం తో కూడిన ఒక వీడియో బిట్ ఇంటర్ నెట్ లో వైరల్ అయింది. ఆ వీడియోలో నాగచైతన్య ఆ ప్రశ్నకు సమాధానమిస్తూ నేను ఏ పాత్రైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అయితే నన్ను గానీ నా కుటుంబాన్ని కానీ కించపరిచినట్టు గాని పరువు తీసినట్టు గాని ఉన్నట్టయితే ఆ పాత్ర నేను ఖచ్చితంగా చేయను అని ఆయన తేల్చి చెప్పారు.

Naga chaitanya reaction on samantha Item Song
Naga chaitanya reaction on samantha Item Song

అయితే నాగచైతన్య అలా సమాధానమిచ్చిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయి చక్కర్లు కొడుతూ ఉండగా సమంత ప్రవర్తన తన కుటుంబానికి అవమాన కరంగా ఉందని నాగచైతన్య విడాకులు తీసుకున్నాడు అనే వార్త ఇంటర్నెట్ లో వేగంగా వ్యాపిస్తుంది.

ప్రజల అనుమానానికి తగినట్టుగానే సమంత విడాకులు తీస్కొని విడిపోయిన తర్వాత తాను చేసిన ఫ్యామిలీ మన్ 2 మరియు హాలీవుడ్ సినిమాలోని పాత్రలు ఇప్పుడు ఉ అంటావా మవ ఉఊ అంటావా ఐటెం సాంగ్ అక్కినేని కుటుంబానికి తగినట్టుగా లేవనీ ఒకప్పటి గొప్పో ఇంటి కోడలు ఈ రకమైన నటనలు చేయ కూడదని కెరియర్ కోసం ఏలాంటి పాత్ర పడితే ఆలాంటి పాత్ర చేస్తోందని సమంత వరుసగా కాంట్రవర్సి అవుతూ వచ్చింది.

సమంత పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ వీడియో రిలీజ్ అయిన తర్వాత నాగచైతన్య ఈ రీతిగా మాట్లాడిన వీడియో ఇంటర్నెట్లో విడుదలవ్వగా ప్రజలందరూ సమంతాను ఉద్దేశించే నాగచైతన్య అన్నాడని నమ్ముతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *