Samantha naga

సమంత నాగ చైతన్యల విడాకులకు కారణమైన ఆ మూడో అమ్మాయి ఎవరు, మాటిమాటికి ప్రీతం తన పోస్టులో ఆ మూడో వ్యక్తి ఎందుకు ప్రస్తావిస్తున్నారు.

Trending

నాగచైతన్య సమంతాలు విడిపోయి సుమారు నెల కావస్తున్నప్పటికీ ఏదో రీతిగా వారిపై వస్తున్న రూమర్స్ వింటూనే ఉన్నాము. నాగచైతన్య సమంతా లు విడిపోతూ మాకు కాస్త గోప్యత కావాలి మమ్మల్ని వెంటాడి మా వ్యక్తిగత జీవితాలను బజార్లో పెట్టకండి అని బతిమాలినప్పటికీ రూమర్స్ రాసేవారు రాస్తూనే ఉన్నారు. వాటి మూలంగా సమంత ఒక సందర్భంలో ఎంతో మనో వేదన చెందారు.

ఇక సమంత నాగ చైతన్యలు విడిపోయాక ఇద్దరు తమ మనసులో పైకి కనబడని బాధ కలిగి ఉన్నారు. ఆ బాధ నుండి నివృత్తి పొందడానికి నాగచైతన్య ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతూ ఒక ఖరీదైన ఫ్లాట్ కొని అక్కడే ఉంటున్నాడు. మరియు సమంత వరసగా ఆమెకు వచ్చిన ఆఫర్లను వద్దనకుండా ఒప్పేసుకుంటూ తన కెరియర్ను బిజీ గా మార్చుకొని విడాకులు అనే పీడకల నుండి బయట పడాలని ప్రయత్నం చేస్తున్నారు.

వీరిద్దరూ ఈ రకంగా తమ జీవితాల పట్ల ఆలోచన కలిగింది ఉండగా వారి పైన వస్తున్న రూమర్స్ వారిని క్రుంగదీస్తున్నాయి . మరియు తమ సన్నిహితులుగా ఉన్నటువంటి కొంతమంది సమంత నాగ చైతన్య ల గురించి చేప్పే అవాస్తవాలు ఈ సందర్భంలో వైరల్ అవుతున్న.

ఇక సమంత పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతం సమంత విడిపోయినప్పటి నుండి ఎన్నో రకాల పోస్టులు ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశాడు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో చేసిన ప్రతి పోస్ట్ సమంతకు సంబంధించి పెట్టినట్టు పోస్ట్ చేస్తున్నాడు. సమంత విడిపోయిన మొదటి రోజే ఎవరో అజ్ఞాత వ్యక్తి ని స్లాట్ అంటూ సంబోధిస్తూ చేసిన పోస్ట్ వైరల్ అయింది .

ఇక ఆ పోస్ట్ గురించి మరిచిపోకముందే సమంత బర్త్ డే రోజు ప్రీతం ఒళ్లో తల పెట్టుకొని పడుకున్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది ఇంకా ఆ పోస్ట్ పైన వచ్చిన కథనాలు భయంకరమైన దుమారం రేపాయి . సమంత మరియు ప్రీతం ఆ ఫోటోకి సంబంధించి ఎన్ని వాస్తవాలు చెప్పిన వాటిపైన రూమర్స్ రావడం మాత్రం రోజురోజుకు పెరిగి పోయాయి.

Samantha naga

ఇలా ఒక రూమర్ తర్వాత ఒకటి , ఒక రూమర్ మరవకముందే మరొక రూమర్ ప్రజలలో చక్కెరలు కొడుతూనే ఉన్నాయి . ఇక తాజాగా ప్రీతం మరొకసారి సంచలనం సృష్టించే లాగా పోస్ట్ పెట్టాడు . అబద్ధాలు మరియు రహస్యాలు మంచి బంధాన్ని నాశనం చేస్తాయి, ఎంత దాయాలని ప్రయత్నం చేసినా ఏదో ఒక రోజు బయట పడతాయి అని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టీ వెంటనే డిలీట్ చేశాడు. ఇక ఈ పోస్ట్ గురించి ఎంతో మంది స్పందిస్తూ అసలు ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి అన్నాడు అని ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు.

అలాగే ఈ విషయంపై కొంతమంది సెలబ్రిటీలు స్పందిస్తూ ఒక పోస్ట్ పెట్టాలి అనుకున్నప్పుడు కచ్చితంగా పెట్టాలి కానీ ఈ విధంగా పోస్ట్ చేసి డిలీట్ చేయడం మూలంగా ఎంతోమంది ప్రముఖుల జీవితాలు బజారున పడతాయి అని గ్రహించాలని ప్రీతం కు చురకలు పెట్టారు.

ఈ పోస్టు ఎవరిని ఉద్దేశించి పెట్టాడో? గతంలో నాగచైతన్యకు అఫైర్ ఉందంటూ సృష్టించిన కథలోని అమ్మాయి ఉద్దేశించి చేశాడా అని అనుమానాలు ఎంతోమంది లో ప్రారంభమయ్యాయి. ఇక అదే నిజమైతే సమంత నాగ చైతన్య ల ను విడగొట్టిన ఆ అమ్మాయి ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం హాట్ టాపిక్ గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *