ఎన్. త్రివిక్రమ రావు భారతీయ చిత్ర నిర్మాత, దర్శకుడు మరియు స్క్రీన్ రైటర్. అతను ఎన్.టి.రామారావు గారి తమ్ముడు, మరియు అతని కుమారుడు నందమూరి కళ్యాణ్ చక్రవర్తి, 1980 లలో సినీ నటుడి గా మరియు మద్రాసులోని నేషనల్ ఆర్ట్ థియేటర్ కు సహ యజమాని గా పని చేసాడు. అతను ఎన్‌టి రామారావుతో కలిసి 40 చలన చిత్రాలను నిర్మించాడు. అతను నాలుగు జాతీయ చలనచిత్ర పురస్కారాలు, మూడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నంది అవార్డులు మరియు రెండు సౌత్ ఫిలింఫేర్ అవార్డులు పొందాడు.
కొంత మంది నటులు ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేని కుటుంబాల నుండి వస్తుంటారు, ఇంకొంత మంది తమ కుటుంబం ద్వారా సినిమా ఇండస్ట్రీలో కి అడుగు పెట్టిన వారు కూడా మన టాలీవుడ్ లో చాలా మంది కనిపిస్తుంటారు. సినిమా ఇండస్ట్రీలో కి ఎలా వచ్చిన కూడా టాలెంట్ మరియు హార్డ్ వర్క్ లేకపోతే ప్రజలు ఎవరిని ఆదరించరు. అలా తన కష్టాన్ని నమ్ముకొని వచ్చిన నటులల్లో నందమూరి కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఒక్కరు. NTR గారి తమ్ముడి కొడుకు ఈ కళ్యాణ్ చక్రవర్తి.
కల్యాణ్ చక్రవర్తికి తన చిన్ననాటి నుండే హీరో అవ్వాలని ఉండేదట.అతను 1986 లో విడుదలైన అత్తగారు స్వాగతం అనే చిత్రం తో తెలుగు చిత్ర పరిశ్రమలో కి అడుగుపెట్టారు. ఈ చిత్రం కు కోడి రామకృష్ణ గారు దర్శకత్వం వహించారు.
ఆ తర్వాత కళ్యాణ్ చక్రవర్తి ఎన్నో తెలుగు సినిమా లల్లో నటించి తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అతను చిరంజీవి యొక్క లంకేశ్వరుడు సినిమా లో ఒక ప్రధానమైన పాత్రను కూడా పోషించాడు. కళ్యాణ్ చక్రవర్తి చివరిసారిగా 2003 లో విడుదలైన కబీర్ దాస్ చిత్రం లో నటించాడు. ఇక తర్వాత నుండి అతను చిత్ర పరిశ్రమలో కనిపించలేదు.
దీనికి బలమైన కారణం ఎవరికి తెలీదు కానీ కొంతమంది అతని కొడుకు పృథ్వీ రోడ్డు ఆక్సిడెంట్ లో చనిపోవడం. తర్వాత కళ్యాణ్ తమ్ముడు హరీన్ చక్రవర్తి కూడా ప్రాణాలు కోల్పోవడం , అతని తండ్రి త్రివిక్రమ్ రావు గారికి గాయాలు అవ్వడం కళ్యాణ్ చక్రవర్తి ని తీవ్రంగా మానసికంగా కృంగదీసింది అంటుంటారు.చిత్రం పరిశ్రమ హైదరాబాద్ కు మకాం మార్చిన కూడా కళ్యాణ్ చక్రవర్తి చెన్నై లొనే అతని తండ్రి ని చూసుకుంటూ అక్కడే ఉండిపోయాడు. అతని తండ్రి మరణం తర్వాత కూడా అతను హైదరాబాద్ కు రాకుండా అక్కడే ఉంటూ తన వ్యాపారాలను చూసుకుంటున్నాడు.