వామ్మో!..నందమూరి తారకరత్న సృష్టించిన ఈ వరల్డ్ రికార్డు గురించి ఎప్పుడైనా విన్నారా.?

Movie News

నందమూరి ఫ్యామిలీ కి చెందిన అనేకమంది ఇప్పటికే సినిమా ఫీల్డ్ లో ఉన్నారు. అయితే వారందరిలో నందమూరి తారక రామారావు గారి పేరు నిలబెట్టింది మాత్రం నట సింహం బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ లు. అయితే ఇంకో హీరో కూడా నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చాడు. కానీ అతను హీరోగా అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయాడు. అతడే నందమూరి మోహన కృష్ణ కుమారుడు నందమూరి తారక రత్న.

అతను నటించిన ఏ సినిమా కూడా విజయం సాధించలేదు. కాబట్టి ఇక సినిమాలకు దూరంగా ఉంటున్నాడు తారక రత్న. ప్రొడ్యూసర్స్ కూడా అతన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు. ప్రేక్షకులు కూడా తారక రత్న అనే హీరోను పూర్తిగా మార్చిపోయారు. అయితే ఈ హీరో విజమే సాధించలేనప్పుడు అతను ఏకంగా వరల్డ్ రికార్డు ఎలా సాధించాడు అని ఆశ్చర్యపోతున్నారు కదా? నిజమే అతని పేరు మీద ఒక వరల్డ్ రికార్డు ఉంది. అదేంటంటే… ఒక సినిమా లేదా రెండు సినిమాలకు సైన్ చేసి చిత్ర పరిశ్రమలోకి వచ్చిన వారు ఉన్నారు. కానీ ఈ హీరో ఏకంగా ఒక్క సినిమా కూడా చేయక ముందే ఏకంగా 9 సినిమాలకు సైన్ చేసాడు.

అప్పట్లో నిజంగా ఇదో పెద్ద సంచలనం సృష్టించింది. ఏకంగా 9 సినిమాల షూటింగ్ ఒకే రోజు ప్రారంభించిన ఏకైక హీరో తారక రత్న. ఈ రికార్డు ను ఇప్పటి వరకు ఎవరు బ్రేక్ చేయలేకపోయారు. హీరో గా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టక ముందే అన్ని సినిమాలకు సైన్ చేయడం అంటే మామూలు విహాయం కాదు. 2001 లో ఒకటో నెంబర్ కుర్రాడు అనే మూవీ తో చిత్ర పరిశ్రమలోకి వచ్చిన తారక రత్న మిగతా 8 సినిమాలు కూడా అదే రోజు మొదలు పెట్టి సంచలనం సృష్టించ్చారు. రావడం రావడం తోనే తొమ్మిది సినిమాల హీరోగా పిలవబడ్డాడు.అయితే అందులో చాల వరకు విడుదల అవ్వక ముందే ఆగిపోయాయి.

ఒకటో నెంబర్ కుర్రాడు, తారక్,యువరత్న,నో, భద్రాద్రి రాముడు అనే చిత్రాలు మాత్రమే రిలీజ్ అయ్యాయి. మిగిలిన మూవీస్ అన్ని ఆగిపోయాయి.అయితే చాలా కాలం తర్వాత అమరావతి అనే సినిమాతో విలన్ అవతారం ఎత్తాడు. తర్వాత కూడా ఇంకొన్ని సినిమాల్లో విలన్ గా రాణించాడు. కానీ ఏది ఏమైనా కూడా హీరోగా గుర్తింపు సంపాదించలేకున్నా తారక రత్న 9 సినిమాల హీరో అనే రికార్డు మాత్రం అలా కొనసాగిస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *