న్యాచురల్ స్టార్ నాని సినిమా థియేటర్ల పై షాకింగ్ కామన్స్ చేశారు. తిమ్మరుసు అనే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిధిగా హాజరైన నాని సినిమా థియేటర్ల రీఓపెనింగ్ పై చేసిన కామెంట్లు సోషల్ మీడియా లో తీవ్ర దుమారాన్ని రేకెత్తిస్తున్నాయి .అసలు సినిమా అనేది మన సంస్కృతి సినిమాలు చూడడం అనేది మన బ్లడ్ లోనే ఉంటుంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే వాటిగురించి ఎవరు మాట్లాడారు కానీ సినిమా థియేటర్ల పై మాత్రం ఎన్నో ఆంక్షలు విధిస్తారు.
సినిమాలు అన్నా యాక్టర్స్ అన్నా చాల చిన్న చూపు చూస్తున్నారు అంటూ కామెంట్స్ చేసాడు నాని. రెస్టారెంట్లు, పబ్స్ వంటి వాటికన్నా థియేటర్లు చాల సేఫ్ కానీ ఎందుకు వాటినే ఎందుకో చివర్లో తెరుస్తారు. నేను ఒక సినిమా లవర్ గా చెప్తున్నాను , మనం మన ఎక్కువగా ఇంట్లో గడుపుతాం తర్వాత ఎక్కువ సేపు థియేటర్లోనే ఎక్కువ సమయాన్ని గడుపుతాం. అయితే మన దేశంలో సినిమాలను మించిన వినోదం అందించే వ్యవస్థ ఇంకోటి లేదు అన్నారు నాని.
అంతే కాదు ఈ థియేటర్ వ్యవస్థ పై ఆధారపడి ఎన్నో లక్షల మంది బతుకుతున్నారు , ఈ లక్డౌన్ కారణంగా వారు తీవ్ర ఇబ్భయంది పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే వారిని దృష్టిలో ఉంచుకొని ఏదో ఒక పరిష్కార మార్గాన్ని ఆలోచించాలి అని కోరాడు.అంతేకాకుండా ఈ ఇష్యూ పై పోరాడాలని కూడా సినీ పరిశ్రమను కూడా కోరాడు. ఈ కామెంట్లకు చాలామంది అనుకూలంగాను మరి కొందరు ప్రతికూలంగాను స్పందిస్తున్నారు.

అయితే మోస్ట్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ హీరోగా డైరెక్టర్ శరణ్ కొపిశెట్టి తెరకెక్కిస్తున్నసినిమా తిమ్మరుసు. క్రైమ్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక జవాల్కర్ అనే అమ్మాయి హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని మహేశ్ కోనేరు, సృజన్ ఎరబోలు కలిసి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా ఏ నెల 30న థియేటర్లలో విడుదల కానుంది.అయితే ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను నిన్న (జూలై 26న) యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్కు చీఫ్ గెస్ట్ గా న్యాచురల్ స్టార్ నాని హాజరు అయ్యారు.
ఫహిమా డైలాగ్ డెలివరీకి నోరెళ్ళబెట్టిన గెటప్ శ్రీను..