Narayana bigg boss

సిపిఎం నారాయణకు బిగ్ బాస్ అంటే అంత ద్వేషం ఎందుకో తెలుసా.

News

సినీ నటుడు బిగ్ బాస్ హోస్ట్ అయినట్వంటి నాగార్జున పైన ఫైర్ అయ్యారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. బిగ్ బాస్ షో ప్రారంబం అయిన ప్రతి సారి సిపియం నారాయణ బిగ్ బాస్ కి సంబంధించి ఏదోక్క అంశం పైన కాంట్రవర్సీ చేస్తూ ఉంటారు.

బిగ్ బాస్ అనేది నైతిక దిగజారుడు ప్రవర్తన. ఇలాంటి అవకాశాల వల్ల కళాకారులు దెబ్బ తింటారు. ఈ బిగ్ బాస్ ప్రోగ్రాం వల్ల ఎవరికైనా ఉపయోగం ఉంటుందా సమాజానికి ఉపయోగం ఉంటుందా ఏ సంస్కృతిని ఇది ప్రతిబింబిస్తుంది ఇలాంటి బిగ్ బాస్ ఎందుకు అని ప్రస్తావించారు. కిందటి సారి బిగ్ బాస్ షోలో మహిళలు అవమానించేలా వ్యవహరించారని ఆరోపించారు స్రిలకు కనీసం గౌరవం ఇవ్వకుండా ఒక ప్రోగ్రాం లో వారిని అవమానించేలా మాట్లాడారన్నారు.

బిగ్ బాస్ షో విషయం లో హైకోర్టుకు వెళ్తామని అన్నారు నారాయణ. నాకు అక్కినేని నాగార్జున అంటే అభిమానం ఉందని చాలా సినిమాలు చూస్తాను కానీ ఇంత ఘోరమైన పని అక్కినేని నాగార్జున చేస్తున్నారు అని అన్నారు. బిగ్ బాస్ షో లో మూడు ఫోటోలు అమ్మాయిలవి పెట్టీ ఒక హీరోని పిలిచి ఏ అమ్మాయి తో డేటింగ్ చేస్తావ్, ఏ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటావు, ఏ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు అని అడిగితే ఈ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటా, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా, ఈ అమ్మాయి తో డేటింగ్ చేస్తా అని అంటాడు ఓపెన్ గ.

Narayana bigg boss

అంటే అక్కడ ముగ్గురు అమ్మాయిల ఫోటోలు అక్కడ పెట్టి ఎంత అవమానంగా మహిళా లోకానికి చూపిస్తూ స్టీలంటే కనీసం మరియాదగ చూపించకుండ అన్యాయం చేస్తున్నారు నాగార్జున దీంట్లో సినిమా యాక్టర్ల ఫోటోలు పెట్టొచ్చు కదా ఎందుకు అమాయకుల ఫోటోలు పెట్టారు అన్నారు . ఈ విషయమై పోలీసులకు , హై కోర్లో కేసు వేసారు కానీ ఎవరు పట్టించుకోలేదు బిగ్ బాస్ విషయం లో న్యాయం మాయం అయిందని గతం లో పెరుకొన్నారు.

తాజాగా నారాయణ మరొక్కసారి బిగ్ బాస్ విషయం లో మరొక అంశం తెరపైకి లేవనెత్తారు ఇదేమి షో అంటూ బిగ్ బాస్ పైన భగ్గుమన్నారు . ఈ షో వల్ల సంస్కృతిక దోపిడీ జరుగుతుంది అని అన్నారు. ఇలాంటి షో ని వెంటనే ఆపి వెయలనీ రాష్ట్ర , కేంద్ర ప్రబుత్వాల పైన కామెంట్స్ చేస్తూ షో ని నిలిపి వేయాలంటూ ఆగ్రహం వ్యక్త పరిచారు.

సిపియం నారాయణ ప్రతి సారి కంటే ఈ సారి మరి ఎక్కువుగా విర్చుకు పడ్డారు ఈ షో అనైతికమని బూతుల ప్రపంచమని విర్చుకు పడుతూ ఈ షో వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా, ఇది ఏ సంస్కృతిని ప్రతిబంబిస్తుంది, ప్రతి రోజు కీచులాట , పోట్లాటలు అనైతికమని ఈ షో ద్వార బూతులు ప్రపంచాన్ని వృద్ది చేయడానికి వందల కోట్ల రూపాయలు కర్చు చేస్తున్నరని మండి పడ్డారు.

గతం లో ఏ విధంగ అయితే మండి పడ్డారో అదే రీతిగా మండి పడుతూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ షో ని వెంటనే రద్దు చేయాలనీ ఇలాంటి షో లకు అనుమతి ఇవ్వకూడదని , ఇలాంటి ప్రోగ్రామ్స్ ను అరికట్టాలని ఇలాంటి షోలను వ్యతిరేకించాలని డిమాండ్ చేస్తున్నాటు నారాయణ అన్నారు.

గతం లో పోటిదరులను ఈ రకంగా గా 100 రోజుల పాటు బహ్యప్రపంచానికి దూరం చేయడం దారుణం అన్నారు. అలా చేయడం ద్వారా విలాసవంతంగా అనైతిక చర్యలకు పాల్పడతారు ఇందుకొరకు బిగ్ బాస్ సహాయం చేస్తున్నారని అన్నారు. ఈ రకమైన చర్య అసలు ఏ రీతిగా కూడా కళ గ పరిగణించ బడదని ఇది కళమ్మ తల్లికి ద్రోహం చేసినట్టు అని అన్నారు. ఈ విధమైన కామెంట్స్ ద్వార కొంత మంది ప్రజలు నారాయణ గారికి సపోర్ట్ చేస్తూ ఈ అంశాన్ని హాట్ టాపిక్ గా మార్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *