neeraj-chopra

ప్రపంచాన్ని గెల్చి తన తల్లిదండ్రులు ఉహించని బహుమానం ఇచ్చి తన కల నెరవేర్చుకున్న నిరజ్ చోప్రా

News

పిలల్లు పుట్టినప్పటి కంటే వాళ్ళు ప్రయోజకులు అయినప్పుడు తల్లితండ్రులకు నిజమైన సంతోషం కలుగుతుంది. ఈ కథనంలో తల్లిదండ్రులనే కాక పూర్తి దేశాన్ని గర్వపడేలా చేసిన వ్యక్తి నీరజ్ చోప్రా .
నీరజ్ చోప్రా అనే పేరు ఒక సంవత్సరం క్రితం అసలు ఎవరు కూడా తెలియదు కానీ ఇప్పుడు దేశంలో ప్రధాన మంత్రి మొదలుకొని స్కూల్ కి వెళ్తున్న చిన్న బాలుని అడిగినా దేశ గౌరవాన్ని సాధించిన నీరజ్ చోప్రా విజయ గాదను చెప్తారు.

ఇటీవల జరిగిన టోక్యో ఒలంపిక్స్ లో మన భారతదేశ అథ్లెట్లు సాదించిన ఏకైక బంగారు పతకం నీరజ్ తన ప్రతిభతో సాదించిందే ఈ మహా అపురూప గట్టం పూర్తి దేశాన్ని గర్వ కారణం అదే రీతిగా నీరజ్ కన్న తలిదండ్రులకు కూడా తమ కొడుకు సంపాదించినా ఘనత వల్ల తమ సంతోషానికి ఆకాశమే హద్దు అయింది.

కానీ తల్లిదండ్రులకు పిల్లలు ఎంత ఎత్తుకు ఎదిగిన తమకి తమ గరాల పట్టిగానే కనిపిస్తాడు. అతి చిన్న వయసులోనే దేశం గర్వించదగ్గ బంగారు పథకాన్ని సంపాదించి అటు దేశానికి కన్న తలిదండ్రులకు గర్వ కారణమైన మన నీరజ్ చోప్రా తను తన బాజ్యతలు నిర్వర్తించడం లో జాప్యం చేసేవాడు కాదు అని తను ఈ మధ్య చేసిన విషయం వల్ల తెలుస్తుంది.

neeraj-chopra
neeraj chopra

నీరజ్ చోప్రా తన చిన్నప్పటి నుండి తన తలిదండ్రుల సంతోష పర్చాలని ఎంతో ఆశ కలిగి ఉండేవాడు అది తల్లిదంరుల విషయమైతే మరీ ముందుంటాడని తను తాజాగా చేసిన పనే రుజువు చేస్తుంది. తన తలిదండ్రులను సంతోష పరిస్తే ఆ అనుభవం తన జీవితాంతం గుర్తుండి పోతుందని బలంగా నమ్మేవాడు.

ఇందు కొరకు తన తల్లి దండ్రులు తమ జీవితం లో చేయలేము అనుకున్నది నీరజ్ తన తల్లి దండ్రులకు కానుకగా ఇచ్చాడు . తన తల్లిదండ్రులు సరోజ్ దేవి సతీశ్ కుమార్ ను తొలిసారిగా విమానం ఎక్కించి వారి సంతోషాన్ని రెట్టింపు చేసాడు.

తను చేసిన ఈ గొప్ప విషయాన్నీ సోషల్ మీడియాలో నా కల నెరవేరింది అని షేర్ చేస్తు మీ అందరి ఆశిర్వాదాల వల్లే నా అమ్మానాన్న విమానం లో ప్రయాణిస్తున్నారు అని సంతోషం వ్యక్తం చేస్తూ పోస్ట్ పెట్టారు. ఇక అయన పెట్టిన పోస్ట్ చుసిన నెటిజనులు ఈ ఫోటోను సేవ్ చేస్కొని మేము ఒత్తిడికి గురైనప్పుడు ఈ ఫోటో చూస్తాము చిటికెలో మా ఒత్తిడి మాయమైపోతుంది ప్రపంచంలోని సంతోషమంత మీ అమ్మానాన్నల కలల్లో కనిపిస్తుంది అంటూ ప్రసంశించారు .

ఈ సంతోషం మరియు అబిమానం తనకెంతో స్పూర్తినిస్తుంది అంటూ న దేశ రుణం మరోక్కసారి తీర్చుకోడానికి రాబోయే ఒలింపిక్స్ లో అడతానని అబిమనులకి దేశ ప్రజలకు మాట ఇచ్చారు. 2022 లో రాబోయే ఏషియన్ చంపియన్ షిప్ లో పోటిచేసేందుకు తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తునట్టు తెలియజేశాడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *