anasuya Kota

అనసూయ కోట శ్రీనివాస్ గారిని అవమానించినందుకు, అప్పుడు ఏమి చేశావు అంటూ ట్రోలింగ్

Trending

మా ఎలక్షన్స్ తర్వాత విష్ణు ప్యానెల్ సభ్యులు వరుసగా తమ ప్రణాళికలను ప్రెస్ నీటి ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. కొన్ని సందర్భాలలో ప్రత్యర్థి ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో కొంతమంది వ్యక్తులను ప్రస్తావిస్తూ వారిని విమర్శిస్తూ సూచనలు ఇస్తున్నారు. అయితే ఇదే సందర్భంలో కోట శ్రీనివాసరావు గారు ఎలక్షన్ కి ముందు ఎలక్షన్ తర్వాత అనసూయ ప్రవర్తన మరియు తాను వేసుకునే దుస్తుల గురించి మండిపడ్డాడు.

ఆమె చక్కటి నటి ముఖంలో అన్ని హావభావాలు కలుగుతాయి మంచి డాన్సర్ కూడా కానీ ఆమె వేసుకునే డ్రెస్సులు నాకు నచ్చవు , ఆమెను నేను ఎంతగా గౌరవిస్తాను కాబట్టే బట్టలు సరిగ్గా వేసుకోమని సలహా ఇస్తున్నాను అని కోట శ్రీనివాసరావు అన్నారు,

ఇక ఆ మాటలకు స్పందిస్తూ అనసూయ కోట శ్రీనివాసరావు పైన రెచ్చిపోయి కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టారు, ముందు నాకు చెప్పే బదులు మీరు మీ ప్రవర్తన సరి చేసుకోండి అంటూ ట్విట్టర్ లో కోట శ్రీనివాస్ రావు ని ఉద్దేశించి పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అయింది.

అనసూయ తన ట్వీట్ లో కోట శ్రీనివాస రావు గారిని పరోక్షంగా ఎత్తి నీ అనుభవం లో నేర్చుకోంది ఇదేనా అంటూ కోటపై కి కౌంటర్ విసిరింది . వస్త్రధారణ అనేది వ్యక్తిగత అభిప్రాయం పైన ఆధారపడి ఉంటుంది మీరు మాకు చెప్పడానికి ముందు మిమ్మల్ని మీరు సంస్కరించు కోండి అన్నారు.

పెళ్లిళ్లు చేసుకుని ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్న హీరోలు బాడీ  కనిపించేలా షర్ట్ బటన్ విప్పేసి హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు అని మండిపడింది, ఆమె ఈ రీతిగా స్పందించిన తీరు నెట్టింట్లో వైరల్ గా మారింది.

అయితే చాలా వరకు నెటిజనులు కోట శ్రీనివాస్ గారికి మద్దతు ఇస్తూ అనసూయను హెచ్చరిస్తున్నారు, ఆయన అన్న దాంట్లో తప్పేమీ లేదు బట్టలు సరిగా వేసుకో మన్నారు అది నీకు తప్పుగా అనిపించింది దాంట్లో నువ్వు అనుకున్నంత పెద్ద బూతు లేదు అని అనసూయకు హితబోధ చేశారు నెటిజన్లు.

anasuya Kota

ఇక ఈ స్పందనకు కూడా అనసూయ ఘాటుగానే సమాధానమిచ్చింది తన ట్విట్టర్ వేదికగా వరుసగా ట్వీట్లు పెడుతూ ప్రజలను హెచ్చరించింది, పెద్దోడు చిన్నోడు ఎవడు పడితే వాడు ఏది పడితే అది నన్ను అనొచ్చు కానీ నేను ఒక జవాబు మాత్రం ఇచ్చాను, ఇండస్ట్రీలో పెద్ద అయన అయి ఉండొచ్చు కానీ ఆ పెద్ద వాడి ముందు నేను చిన్నదాన్ని అయిపోయాను అందుకే నన్ను అందరూ దూషిస్తున్నారు ఇదెక్కడి న్యాయం, నేను మీ అందరికీ చెత్తకుప్ప లాగా కనిపిస్తున్నానా అని అన్నారు.

కోట గారంటే నేను అభిమానిస్తాను కానీ ఆయన దిగజారి చేసిన పనులు కూడా ఉన్నాయి వాటిని ఆయన సంస్కరించుకోవాలి. ఆయన అనుభవంతో ఎన్నో విషయాలు నేర్చుకుని ఉంటారు ఆయన అనుభవం నుండి ఆయన చేసే పనుల వల్ల ఆయన నాకు అనుభవజ్ఞుడు కనిపించడం లేదు అని ఆమె అన్నారు.

ఇక ఎల్లప్పుడూ ఇంటర్ నెట్ లో వైరల్ గా ఉండే అనసూయ ప్రస్తుతం ఈ అంశం పైన మరోసారి వైరల్ అయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *