ఈ మధ్యకాలంలో హీరోయిన్లని ట్రోల్ చేయడం విపరీతంగా పెరిగిపోయింది ఎంతలా అంటే డైరెక్ట్ గా హీరోయిన్లని ట్యాగ్ చేస్తూ ట్రోల్ చేస్తూ ఉన్నారు. సాధారణంగా ప్రతి హీరోయిన్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటు తమకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ ఉంటారు.
కొన్ని సందర్భాల్లో లైవ్ కూడా కండక్ట్ చేసి ప్రజల ప్రశ్నలకు సమాధానం కూడా ఇస్తూ ఉంటారు. అయితే లైవ్ చేస్తుండగా హీరోయిన్లను రకరకాల ప్రశ్నలు అడుగుతూ వేధిస్తుంటారు ఇవే కాక హీరోయిన్లకు సంబంధం లేని వాటిని కూడా అడుగుతూ ఉంటారు. మరికొంతమంది అయితే చిరాకు కలిగించే కామెంట్స్ వారిపైన చేస్తారు. అయితే విమర్శించడం సాధారణమే అనుకొని హీరోయిన్లు కూడా వాటిని పట్టించుకోరు. అయితే ఎప్పుడైనా వైరల్ అవుతుంటే మాత్రం కచ్చితంగా స్పందిస్తూ ఉంటారు.

తాజాగా ఇదే విపరీతమైన కామెంట్లను రాష్మీక మందాన రుచి చూశారు. నేషనల్ క్రష్ గా ఉన్న తనను ఒక నేటిజనుడు రాష్మిక పరువు తీసేలా కామెంట్ చేశాడు. ఆ కామెంట్ ను చూసి వదిలేయకుండా తన దైన శైలిలో స్పందించారు రష్మీక మందాన. దీంతో మందాన చేసిన ట్వీట్ చర్చనీయాంశం గా మారింది.
తాజాగా శర్వానంద్ సరసన హీరోయిన్ గా రష్మిక మందన నటిస్తున్న ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను దసరా పండుగ రోజున విడుదల చేసింది , ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ లో రష్మిక నవ్వుతూ ఉంటే శర్వానంద్ సిగ్గుపడుతూ కనిపిస్తాడు, ఇక ఇదే పోస్టర్ను ఒక నేటి జనుడు షేర్ చేస్తూ దీన్ని సినిమాల్లోకి ఎలా తీసుకున్నారు అని రాసి ట్వీట్ చేశాడు.
దీనికి రష్మిక మందన వెంటనే స్పందించి నా నటన కోసం అంటూ రాసి తన పై కామెంట్ చేసిన వ్యక్తిని మరియు సినిమా నిర్మాణ సంస్థ ని ట్యాగ్ చేసి పోస్ట్ పెట్టింది. ఈ ట్వీట్ ఆ సదరు నెటిజనులు కి స్ట్రాంగ్ కౌంటర్ అయింది. ఈ రీతిగా రష్మిక చేసిన కౌంటర్ ను ఎంతో మంది అభినందించారు, ఇక ప్రస్తుతము రష్మిక మందన త్వరలో భారతదేశం అంతా కూడా రిలీజ్ కానున్న పుష్ప సినిమాలో గ్రామీణ యువతి శ్రీవల్లిగా నటించబోతున్నారు. మరియు శర్వానంద్ హీరో గా నటిస్తున్న ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమాలో కూడా కనిపించబోతున్నారు.