niharika-chaitanya

నాగబాబు అల్లుడి పై పోలీస్ కేసు..! అర్ధరాత్రి అప్పర్ట్మెంట్ నుండి అరుపులు.. ఏం జరిగిందంటే..

News Trending

గత ఏడాది ఆగస్ట్ నెలలో నటుడు నాగబాబు గారి కుమార్తెను చైతన్య జొన్నలగడ్డ అనే బిజినెస్ మ్యాన్ కి ఇచ్చి పెళ్లి చేసిన విషయం తెలిసిందే. ఎంతో హంగు ఆర్భాటం తో ఆ పెళ్లి ఎంతో మంది ప్రముఖుల సమక్షంలో జరిగిన విషయం కూడా తెలిసిన విషయమే. అయితే తాజాగా వస్తున్న నివేదికల ప్రకారం బంజారాహిల్స్ లో నిహారికి దంపతులు ఉంటున్న ఓ ఫ్లాట్ లో నుండి నిన్న అర్ధరాత్రి గట్టి గట్టిగా గొడవ కు సంబంధించిన అరుపులు వినిపించాయి అంటూ ఆ అపార్ట్మెంట్ లో నివసించే ఇతరులు తెలిపారు.

నిహారిక భర్త అయిన చైతన్య పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే చైతన్య కూడా తిరిగి తమ అప్పర్ట్మెంట్ వారి మీద రివర్స్  లో కంప్లైంట్ చేయడం తో ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు సోషల్ మీడియా లో ఎక్కువ మంది ఈ విషయం పైనే చర్చించుకుంటున్నారు.

కొత్తగా పెళ్లి అయ్యి దాదాపు సంవత్సరం కూడా అవ్వలేదు.అలాంటిది ఇప్పుడే వారికి అంత పెద్ద గొడవలు ఎందుకు జరుగుతున్నాయి అనే ఆలోచనలో పడ్డారు జనం.అప్పుడే వారికి గొడవ పడేంత సమస్యలు ఏం వచ్చి ఉంటాయి అని అనుకుంటున్నారు. చైతన్య ముగ్గురు మాములు కూడా తెలుగు రాష్ట్రాలలో మంచి గుర్తింపు ఉన్న వ్యక్తులు. ఎంతో పాపులర్ , ఫేమస్ కుటుంభం ఉన్న వారి ఇంట్లో ఏంటి ఇలా జరుగుతుంది అని ముక్కున వేలేసుకుంటున్నారు. అంతే కాదు రీసెంట్ గా చైతన్య మామా గారైన నాగబాబు ఏకంగా 66 లక్షలు విలువ చేసే కారును గిఫ్ట్ గా కూడా ఇచ్చిన వీడియో ఆ మధ్య బాగా వైరల్ అయ్యింది.

 

అప్పుడు చైతన్య కి మంచి కుటుంబం దొరికింది అని కామెంట్స్ పెట్టారు. కానీ ఇప్పుడు అంతటి పెరు ఉన్న మెగా ఫ్యామిలీ పోలీసు స్టేషన్ చుట్టూ తిరిగే పరిస్థితి వస్తుందని ఎవరు ఊహించి ఉండరు. అయితే ఆ గొడవకు కారణాలు ఏంటో ఇప్పటివరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ఏది ఏమైనా అంత రాత్రి సమయం లో అలా పద్ధతి లేకుండా అరవడాన్ని ప్రజలు తప్పు పడుతున్నారు.

అయితే చైతన్య వృత్తి పరంగా టెక్ మహేంద్ర లో బిజినెస్ కి సంబంధించిన జాబ్ చేస్తున్నాడు. అతని తండ్రి కూడా సీనియర్ గవర్నమెంట్  ఆఫీసర్. అతను పోలీస్ శాఖలో గౌరవప్రదమైన ఉద్యోగం చేసేవాడు. అయితే ఇలాంటి తండ్రి కి కొడుకుగా ఉంటూ ఏంటి ఈ పాడు బుద్ధి అంటున్నారు ప్రజలు. పెళ్లి కి ఎంతో మంది సినీ ప్రముఖులు మరియు రాజకీయ ప్రముఖులు వచ్చి ఈ కొత్త దంపతులను ఆశీర్వదించారు కానీ ఇలా గొడవలు పెట్టుకొని విషయం పోలీసు స్టేషన్ వరకు వెళుతుందని ఎవరు ఊహించలేదు అంటున్నారు తెలుగు రాష్ట్రాలలో ఉండే వారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *