యంగ్ హీరో శ్రీవిష్ణు ప్రధాన పాత్ర తెరక్కేక్కిన “మెంటల్ మదిలో” తో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది అందాల భామ నివేతపేతురాజ్. ఆ సినిమా తర్వాత “చిత్రలహరి”, “బ్రోచేవారెవరురా” వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చాల దగ్గరైంది. ఆ తర్వాత మాటలా మాంత్రికుడు ,దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన “అల వైకుంఠపురం” చిత్రంతో కెరీర్లోనే పెద్ద హిట్ అందుకుంది నివేత.తాజాగా ఈమె ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన “రెడ్” సినిమాలో ఒక అతి కీలక పాత్రలో నటించింది నివేతా.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రానా, సాయి పల్లవి జంటగా తెరకెక్కబోతున్న “విరాట పర్వం” చిత్రంలో మరోసారి ఒక కీలక పాత్రలో కనిపంచనున్నారు. అంతేకాకుండా మరికొన్ని మూవీస్లో నటిస్తూ బిజాగా ఉంది హీరోయిన్. అయితే తాజాగా వాస్తున్నా నివేదికల ప్రకారం ఈ ముద్దుగుమ్మ పెద్దగా ప్రయత్నించాలనుకుంటున్నారట.
ఆమెకు ఎప్పడినుండో డైరెక్షన్ చేయాలన్న ఉందని అన్నారు నివేత పేతురాజ్.అయితే ఒక పెద్ద స్టార్ హీరోయిన్‍గా గుర్తింపు సంపాదించాకా, ఆ తర్వాత తన కల అయిన డైరెక్షన్ వైపు అడుగులు వేయాలని అనుకుంటున్నారట నివేతా.అయితే కొంతకాలం వరకు సినిమాలలో హీరోయిన్ గా చేసి ఆ తర్వాత ఒక మంచి కథను సిద్ధం చేసుకుని దర్శకత్వం చేయాలని భావిస్తున్నట్లుగా తన అత్యంత సన్నిహితులతో ఎక్కువగా చెబుతోందట.తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా కెరీర్ ను ఆరంభించి భవిష్యత్తులో మెగాఫోన్ పట్టి విజయం సాధించినవారు చాలా మందే ఉన్నారు.
మరి నివేతా పేతురాజ్ ఆ లిస్టులో చేరుతుందా ? లేదా ? అనేది వేచి చూడాలి. ప్రస్తుతం నివేత తెలుగులో మాత్రమే కాకుండా తమిళ చిత్ర పరిశ్రమలోనూ వరుసగా మంచి అవకాశాలను అందుకుంటుంది. వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న ఒక తమిళ మల్టీస్టారర్ చిత్రం “పార్టీ” లోనూ మరియు ఎ, ఎల్.విజయ్ యొక్క ఫిమేల్ సెంట్రిక్ సినిమా “అక్టోబర్ 31 లేడీస్ నైట్” లోనూ నివేదా పేతురాజ్ అతి కీలక పాత్రలు పోషిస్తోంది.ఇదిలా ఉంటె తెలుగులో విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం పాగల్ లోను నివేతా నటిస్తోంది.