ntr-rajamouli-koratala-siva

NTR: నేనె బాస్ మీరు నా మాటే వినాలి అంటూ జూనియర్ ఎన్టీఆర్ రాజ్యమౌళి, కొరటాల శివ దర్శకులకు షాక్ ఇచ్చాడు

Trending

మన జూనియర్ ఎన్టీఆర్.. నందమూరి వారసుడిగా సినిమా ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చి తన సొంత టాలెంట్‌తో ఎదిగి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే వెండితెరపై ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడంలో కింగ్ అనిపించుకున్న ఆయన, బుల్లితెరపై కూడా అదే సీన్ అదే క్రజ్ రిపీట్ చేస్తున్నారు.

బుల్లితెర హోస్ట్‌గా కూడా సత్తా చాటుతూ ప్రతి ఇంట సందడి చేస్తున్నారు మన నందమూరి తారక రామ రావు. ఆ మధ్య బిగ్ బాస్ షోకు హోస్ట్‌గా చేసి బుల్లితెర ఆడియన్స్‌కి చాలా దగ్గరైన ఈ యంగ్ టైగర్.

ఇప్పుడు ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే షోని ఒంటిచేత్తో నడిపిస్తున్నారు. తనదైన స్టైల్ లో హాట్ సీన్‌లో కూర్చున్న వారిపై ప్రశ్నల వర్షం కురిపించటం తో పాటు చూస్తున్న జనాన్ని కూడా నవ్విస్తూ ఆకట్టుకుంటున్నాడు.

మొదట్లో ఈ షో, జెమినీ టీవీ టీఆర్ఫీ పరంగా కాస్త నిరాశ పర్చిన ఈ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే షో వారం వారం పుంజుకుంటుంది, ఆకరణం గా టీఆర్ఫీ రేటింగ్ పెంచుకుంటోంది. ఇక ఈ షోపై మరింత క్రేజ్ పెంచేలా స్పెషల్ గెస్టులను కూడా పిలిచి హాట్ సీట్‌లో కూర్చోబెడుతున్నారు ఈ షో నిర్వాహకులు.

ntr-rajamouli-koratala-siva
ntr rajamouli koratala siva

ఈ సెప్టెంబర్ 20 సోమవారం రోజున ప్రసారం కాబోతున్న షో కోసం ఏకంగా దర్శక ధీరుడు జెక్కన్న గా పిలువబడే రాజమౌళి గారిని, అలాగే కొరటాల శివ గారిని, వీరిద్దరిని ఒక్కసారే రంగంలోకి దించారు. తాజాగా ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోను యూట్యూబ్ మరియు టీవీ లో వదలడంతో ఈ వీడియో ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే ఎంతో మంది ఈ ప్రోమో వీడియోను చేసేసారు.

ఈ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో ద్వారా ప్రశ్నలతో పోటీదారులను ఉత్తేజ పరుస్తూన్నారు, అలాగే నిజ జీవితనికి ఉపయోగపడే ఎన్నో మంచి విషయాలను జనాలకు చెబుతూ మొటివేట్ చేస్తున్నారు మన ఎన్టీఆర్. అయితే ఈ షో లో హాట్ సీట్ కొచ్చాక ఎవ్వరైనా సరే తన నియమాలను పాటించాలసిందే అంటూ సెలబ్రిటీలను కూడా వదలకుండా సరదాగా ఆట పట్టిస్తున్నారు తారక్.

తన మొదటి సినిమా తో కలిపి మూడు సినిమాలు హిట్ ఇచ్చిన రాజ్యమౌళి గారిని అలాగే తనకు జనతా గ్యారేజ్ సినిమా ద్వారా ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన కొరటాల శివ గార్లను ఈ షో కి పిలవటం అభిమానులలో ఆసక్తిని రేపుతోంది. ఇదిలా ఉండగా, తన డైరెక్టర్లు రాజమౌళి, కొరటాల శివ ఇద్దరు కూడా షో కి వచ్చినప్పటి నుండి ఎన్టీఆర్ ను పట్టించుకోకుండా వారిద్దరూ వారితో వారే మాట్లాడుకోవడం తో, ఎన్టీఆర్ వారి విషయంలో కూడా అస్సలు వెనక్కి తగ్గని ఎన్టీఆర్.. ”నేనే బాస్ ఇక్కడ” అనేశారు. ‘ఈ లొకేషన్ నాది ఇక్కడ డైరెక్షన్ నాది’ అంటూ వాళ్లకు షాకిచ్చారు. తాజాగా విడుదలైన ప్రోమోలో ఈ సీన్ హైలైట్ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *