ఎన్టీఆర్ తో గ్యాప్ ఎందుకు వచ్చింది అని ప్రశ్నించగానే.. రాజీవ్ కనకాల ఎందుకు అంత ఎమోషనల్ అయ్యారు.?!

News

సీనియర్ ఎన్టీఆర్ తన స్నేహితులతో ఎంత చక్కటి అనుబంధాన్ని కలిగి ఉండేవారో ఆనాటి నటులు ఇప్పటికి కూడా ఎన్నోసార్లు వారు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో చెప్పారు. అయితే తాత సుగుణాన్ని అందిపుచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ కూడా తన స్నేహితుల కోసం ప్రాణం పెట్టడానికైనా వెనుకాడరు, అంతలా తన ఫ్రెండ్స్ ని ప్రేమిస్తారు అని తెలుగు ఇండస్ట్రీలో చెప్తుంటారు. రాజీవ్ కనకాలతో పాటుగా సమీర్ ,శ్రీనివాస్ రెడ్డి, రాఘవ మరియు రఘు వంటి ప్రముఖులు జూనియర్ ఎన్టీఆర్ యొక్క బెస్ట్ ఫ్రెండ్స్ లిస్టులో ఉంటారు.

 

వీరందరిలో ప్రముఖ్యంగా యాంకర్ సుమ భర్త అయిన రాజీవ్ కనకాల మరియు జూనియర్ ఎన్టీఆర్ లు క్లోజ్ ఫ్రెండ్స్ అనే టాక్ తెలుగు చిత్ర పరిశ్రమలో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. అప్పట్లో ఎన్టీఆర్ గారితో ఆయన నటించే ప్రతి మూవీలో ముఖ్య పాత్రలు చేసిన రాజీవ్ కనకాల ఈ మధ్య ఎన్టీఆర్ నటించే ఏ సినిమాల్లో కనిపించటం లేదు,జూనియర్ ఎన్టీఆర్ కి మరియు రాజీవ్ కనకాలకు మధ్య ఏదో గొడవ జరిగింది అని, అందుకే ఎన్టీఆర్ సినిమాల్లో రాజీవ్ కనకాల కనిపించట్లేదు అని చాలా పుకార్లు సోషల్ మీడియాలో వచ్చాయి. అయితే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో రాజీవ్ కనకాల ఈ సందేహాలన్ని అన్ని క్లియర్ చేసాడు.జూనియర్ ఎన్టీఆర్ తో తనకున్న రిలేషన్షిప్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు రాజీవ్.

ఫ్రెండ్ షిప్ అంటే ఎన్టీఆర్ ప్రాణమిస్తాడని, అయితే అలాంటి ఫ్రెండ్స్ ఎన్టీఆర్ జీవితంలో 12మందికి పైగానే ఉన్నారని, అయితే నాకు కలిగిన అదృష్టం ఏంటంటే అందులో నేను ఒకడిగా ఉండటం అని రాజీవ్ కనకాల చెప్పాడు. ఎన్టీఆర్ చాలా సరదాగా ఉండే వ్యక్తి.మేము ఎప్పుడైనా కలిస్తే చాలు నైట్ అంత మాట్లాడుకుంటూనే ఉంటాం.

అయితే పెళ్లి అయిన తరువాత కూడా నేను 24గంటలు కలుస్తూనే ఉంటే ఏం బాగోదు కదా.? అందుకోసమే మా ఇద్దరి మధ్య కాస్త గ్యాప్ వచ్చింది అని చెప్పారు రాజీవ్ కనకాల . ఆయన ఈ విషయాలు మాట్లాడుతూనే ఒకింత భావోద్వేగానికి గురి అయ్యాడు.

అయినా కూడా మేము రోజు ఫోన్ లో మాట్లాడుకుంటు ఉన్నాం. మాకు టైం దొరికినప్పుడల్లా కలుస్తూ ఉంటాం కూడా అని రాజీవ్ చెప్పారు. అయితే మరీ జూనియర్ ఎన్టీఆర్ నటించే చిత్రాల్లో మీరు ఎందుకు కనిపించడం లేదనే ప్రశ్నకి జవాబిస్తూ ‘ ఎన్టీఆర్ చేసే ప్రతి మూవీకి నన్ను రికమండ్ చేస్తుంటాడు.

కానీ అప్పుడు నేనే డైరెక్టర్స్ ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని వద్దు అంటుంటాను. అయిన కూడా నేను ఆ పాత్రకి సరిగ్గా సెట్ అవుతేనే పెట్టుకోమంటాను. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘స్టూడెంట్ నెం.1’ , ‘ఆది’ , ‘నాగ’, ‘అశోక్’, ‘యమదొంగ’, ‘బాద్ షా’, ‘నాన్నకు ప్రేమతో’ వంటి సినిమాల్లో యాక్ట్ చేసాను.అయినకూడా ఎన్టీఆర్ లాంటి యాక్టర్ తో అన్ని సినిమాలు చేయటమే గొప్ప కదా.?’ అంటూ రాజీవ్ కనకాల అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *