తెలుగు సినిమా చరిత్ర లో 100 కోట్ల రూపాయ లు కలెక్ట్ చేసే సినిమా లు ఇప్పుడు చాలానే వస్తున్నాయి ,దానికి చాల కారణాలు ఉన్నాయి .తెలుగు రాష్ట్ర ల తో పాటు మిగతా బాషా ల లో సినిమా రిలీజ్ కావడం ,సినిమా బడ్జెట్ తో సంబంధం లేకుండా క్వాలిటీ తో సినిమా తీయడం ,అన్నిటికి మించి హీరో కి ఉన్న క్రేజ్ దృష్ట్యా మన తెలుగు సినిమా స్థాయి అమాంతం గ పెరిగిపోయింది.మన ఇండియా లో తెలుగు సినిమా కి ఉన్న క్రేజ్ ఒక ఎత్తు అయితే అమెరికా లో కూడా అదే స్థాయి లో ఉంటుంది,దాని కి తోడు మన ఇండియా లో కంటే ఒక రోజు ముందు అక్కడ రిలీజ్ అవుతుంది.ప్రీమియర్స్ ల లో మన తెలుగు సినిమాలకి మంచి వసూళ్లు వస్తున్నాయి ఈ మధ్య కాలం లో..అయితే కొన్ని సినిమా లు హిట్ టాక్ తో సంబంధం లేకుండా కూడా అక్కడ 1 మిలియన్ మార్క్ ని సాధించాయి,అందువలన మనం ఇప్పుడు తమ కెరీర్ లో 2 మిలియన్ డాలర్ లు సాధించిన హీరో లు ,వాళ్ళ సినిమా లు ఏంటో చూద్దాం.
1 .ప్రభాస్:
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ తో ఒక్క సారిగా పాన్ ఇండియా హీరో అయిపోయారు,బాహుబలి ది బిగినింగ్ నుంచి తన మార్కెట్ ఒక్క సరిగా ఆకాశం అంత ఎత్తుకు ఎదిగింది.2015 లో రిలీజ్ అయినా బాహుబలి ది బిగినింగ్ రికార్డు స్థాయి లో ‘6 .82 ‘ , మిలియన్ డాలర్ లు వసూళ్లు సాధించింది, తర్వాత 2017 రిలీజ్ అయినా బాహుబలి 2 కళ్ళు చెదిరే రికార్డ్స్ తో ’20 .79 ‘ మిలియన్ డాలర్ లు సాధించింది.ఆ తరువాత ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయినా సాహో 3 .324 మిలియన్ డాలర్ లు , రాధే శ్యామ్ ‘2 .06 ‘ మిలియన్ డాలర్ ల మార్క్ ని అందుకున్నాయి.మొత్తానికి ప్రభాస్ కెరీర్ లో 4 సినిమా లు 2 మిలియన్ డాలర్ లు అందుకున్న జాబితా లో ఉన్నాయి.
2.మహేష్ బాబు:
సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ లు కలిగి ఉన్నపటికీ కొరటాల శివ గారి తో తీసిన శ్రీమంతుడు ,భరత్ అనే నేను సినిమా లు మహేష్ బాబు కెరీర్ లో మర్చిపోలేని సినిమా లు గా నిలిచిపోతాయి. 2015 లో రిలీజ్ అయినా శ్రీమంతుడు ‘2 .88 ‘ మిలియన్ డాలర్ లు కలెక్ట్ చేసింది ,2018 లో రిలీజ్ అయినా భరత్ అనే నేను ‘3 .41 ‘ , మిలియన్ డాలర్ లు సాధించింది, ఇక ఆ తర్వాత రిలీజ్ అయినా సరిలేరు నీకుఎవ్వరు ‘2 .28 ‘ మిలియన్ డాలర్ లు ,2022 లో రిలీజ్ అయినా ‘సర్కారు వారి పాట ‘ 2 .34 మిలియన్ డాలర్ లు సాధించింది.మహేష్ బాబు గారి కెరీర్ లో కూడా 4 సినిమా లు 2 మిలియన్ డాలర్ ల మార్క్ ని అందుకున్నాయి.
3 .జూనియర్ ఎన్టీఆర్:
జూనియర్ ఎన్టీఆర్ గారికి తెలుగు రాష్ట్రాల లో ఉన్న క్రేజ్ కొత్తగా చెప్పాల్సిన పని లేదు ,కానీ USA లో తన సినిమా లు మిలియన్ మార్క్ ని సాధించలేకపోవడం ఫాన్స్ ని ఒక విధంగా ఆశ్చర్యానికి గురిచేసేవి,కానీ 2016 లో రిలీజ్ అయినా నాన్నకు ప్రేమతో సినిమా తో 2 .02 మిలియన్ డాలర్ లు సాధించారు, ఆ తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన అరవింద సమేత తో ‘2 .18 ‘ మిలియన్ డాలర్ లు సాధించారు,ఇక ఆస్కార్ భరి లో ఉన్న RRR తో ’14 .5 ‘ మిలియన్ డాలర్ లు సాధించి ,బాహుబలి 2 తర్వాత స్థానం లో నిలిచింది.జూనియర్ ఎన్టీఆర్ గారి కెరీర్ లో 3 సినిమా లు 2 మిలియన్ మార్క్ ని అందుకున్నాయి.
4 .చిరంజీవి:
మెగాస్టార్ చిరంజీవి గారు చూడని కలెక్షన్స్ ,రికార్డ్స్ అంటూ ఏమి ఉండవు.తన 40 సంవత్సరాల కెరీర్ లో చాలానే చూసారు,తన రీ ఎంట్రీ తర్వాత ఇప్పటి తరం హీరో ల కి పోటీగా ,సీనియర్ హీరో ల కి సాధ్యం కానీ 2 మిలియన్ డాలర్ లు సాధించారు2017 లో రిలీజ్ అయినా ఖైదీ నెంబర్ 150 సినిమా కి ‘2 .44 ‘ మిలియన్ డాలర్ లు కలెక్ట్ చేసింది. ఆ తర్వాత రిలీజ్ అయినా పాన్ ఇండియా సినిమా సైరా ‘2 .62 ‘ మిలియన్ డాలర్ లు , 2023 లో రిలీజ్ అయినా బ్లాక్ బస్టర్ ‘వాల్తేర్ వీరయ్య ‘ కి ‘2 .344 ‘ మిలియన్ డాలర్ లు సాధించింది.చిరంజీవి గారి కెరీర్ లో 3 సినిమా లు 2 మిలియన్ డాలర్ లు సాధించాయి.
5 .రామ్ చరణ్:
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ‘రంగస్థలం ‘ సినిమా తో ‘3 .63 ‘ మిలియన్ డాలర్ లు సాధించి రామ్ చరణ్ గారి కెరీర్ లో మొదటి 2 మిలియన్ అందుకున్న సినిమా కి నిలిచింది,ఇక RRR తో గ్లోబల్ స్థాయి లో గుర్తింపు వచ్చింది.RRR సినిమా 14 .58 మిలియన్ డాలర్ లు సాధించింది.రామ్ చరణ్ గారి కెరీర్ లో 2 సినిమా లు 2 మిలియన్ డాలర్ లు సాధించాయి.
6 .అల్లు అర్జున్:
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు అలా వైకుంఠ పురం సినిమా తో తన మొదటి 2 మిలియన్ డాలర్ లు సాధించారు. అలా వైకుంఠ పురం సినిమా ‘3 .63 ‘ మిలియన్ డాలర్ లు కలెక్ట్ చేసింది. ఇక పాన్ ఇండియా సినిమా ‘పుష్ప పార్ట్ 1 ‘ తో ఇండియా స్థాయి లో గుర్తింపు తో పాటు USA లో ‘2 .48 ‘ మిలియన్ డాలర్ లు కలెక్ట్ చేసింది.అల్లు అర్జున్ గారి కెరీర్ లో 2 సినిమా లు 2 మిలియన్ డాలర్ ల మార్క్ ని అందుకున్నాయి.
7 .పవన్ కళ్యాణ్ :
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తన మొదటి 2 మిలియన్ డాలర్ ల మార్క్ ని ‘అగ్న్యాతవాసి’ సినిమా తో అందుకున్నారు.
తన కెరీర్ లో అతి పెద్ద ప్లాప్ గా నిలిచినా ఈ సినిమా ‘2 .066 ‘ మిలియన్ డాలర్ ల ని అందుకుంది. ఇక భీమ్లా నాయక్ సినిమా తో ‘2 .43 ‘ మిలియన్ డాలర్ లు కలెక్ట్ చేసారు.పవన్ కళ్యాణ్ గారు తన కెరీర్ లో 2 సినిమా లు 2 మిలియన్ డాలర్ లు కలిగి ఉన్నాయి.
ఇక యువ హీరో లు అయినా మెగా ప్రిన్స్ ‘వరుణ్ తేజ ‘ గారు ఫిదా సినిమా తో ‘2 .07 ‘ మిలియన్ డాలర్ లు అందుకున్నారు, వెంకటేష్ గారి తో కలిసి నటించిన F2 తో ‘2 .13 ‘ మిలియన్ డాలర్ లు సాధించారు.విజయ్ దేవరకొండ గారి ‘గీత గోవిందం ‘ 2 .46 మిలియన్ డాలర్ లు సాధించింది.తాను సపోర్టివ్ రోల్ చేసిన ‘కీర్తి సురేష్ ‘ గారి మహానటి సినిమా ‘2 .59 ‘ మిలియన్ డాలర్ లు కలెక్ట్ చేసింది.ఇక ఫైనల్ గా యంగ్ హీరో నితిన్ నటించిన ‘అ ఆ ‘ 2 .44 మిలియన్ డాలర్ లు సాధించింది.