padma-shri-awards

Padma Awards: పద్మశ్రీ అవార్డు విలువలేకుండా చేశారని మండిపడుతున్న భారత ప్రజానీకం.

Trending

తాజాగా జరిగిన పద్మశ్రీ అవార్డుల బహుకరణ లో రకరకాల పదవులు మరియు రకరకాల పనులు చేసిన ఎంతోమందిని గుర్తించి అవార్డులు బహుకరించారు. ఇదే అవార్డు లిస్టులో కంగనా రనౌత్ కూడా ఉండటం చర్చనీయాంశంగా మారింది , కరోనా మహమ్మారి కాలములో , సుశాంత్ రాజ్ పుత్ మరణంతో ఒక్కసారిగా బయటికి వచ్చి బాలీవుడ్ లోని ప్రముఖులను, బాలీవుడ్ పద్ధతులను విమర్శిస్తూ బాలీవుడ్ను పాకిస్తాన్తో పోల్చింది, ఆ తర్వాత ముంబై ప్రభుత్వం బొంబాయిలో తన ఆఫీస్ అక్రమ కట్టడం అంటూ కూల్చేసింది దీంతో కేంద్రం స్పందించి ఆమెకు భద్రత కల్పించే చర్యగా ఇంతవరకు ఏ నటుడుకు లేని జడ్ ప్లస్ సెక్యూరిటీని ఆమెకు కేటాయించింది, ఇక ప్రభుత్వ అండ ఉందని భావించుకొని ఏ చిన్న అంశమైన ప్రభుత్వానికి అనుకూలంగా మలిచి మాట్లాడుతూ ప్రభుత్వ వ్యక్తిగా మారింది.

ఇక తాజాగా జరిగిన పద్మశ్రీ అవార్డుల పురస్కారణలో కంగనా రనౌత్ పేరు ఉండడం వివాదాస్పదమైంది , ఆమెకు పద్మశ్రీ అవార్డును ఎందుకు ఇచ్చారు? ప్రభుత్వం తో సన్నిహితంగా ఉందన్న లేదా ఆమె చేసిన పనుల వలన ఇచ్చారా ? అని కాంగ్రెస్ మరియు కొంత మంది సినీ ప్రముఖులు తప్పుబడుతున్నారు.

padma-shri-awards
తమకు నచ్చిన వారికి అవార్డులు ఇచ్చుకుంటున్నారని, పద్మశ్రీ అవార్డుకు విలువ లేకుండా చేస్తున్నారని మండిపడుతున్నారు.

నిజంగా వ్యక్తిని గుర్తించి అవార్డు ఇయ్యాలి అనుకుంటే కరోనా కష్టకాలంలో ఎంతో మంది ప్రజలకు తన సొంత డబ్బుతో సహాయపడిన సోను సూద్ కి ఇవ్వాలి కానీ అదే కరోణ కష్టకాలంలో ప్రజల మనసులతో చెలగాటమాడుతున్న బాలీవుడ్ను పి ఓ కే తో పోల్చి తన సొంత లాభం చూసుకున్న కంగనా రనౌత్ ఇచ్చారని నిందిస్తూ, పలువురు రాజకీయ మరియు సినీ ప్రముఖులు మాట్లాడారు, ఇక ఇదే అంశం ఫేస్బుక్ మరియు ఇతర సోషల్ మీడియాలో ప్రజల పక్షం గా ఉండి న్యాయం చేసిన వ్యక్తి పైన ఐటి దాడులు చేసి అవమానించి విద్వేషాలు రెచ్చగొట్టి న కంగనా ను గౌరవించాలనే ప్రయత్నం చేస్తున్నారని ట్రోల్ చేస్తున్నారు.

ఇదే విషయంపై సీఎం కేసీఆర్ కూడా స్పందిస్తూ కేంద్రం తనకు నచ్చిన వారికి అవార్డులు ఇస్తుందని . తెలంగాణలో వారి ప్రభుత్వం లేనందున తెలంగాణ కళాకారులను గుర్తించలేదని అందుకే తెలంగాణ కళాకారులకు అవార్డులు రావడం లేదని మండిపడ్డారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *