తన కెరీర్ లో ఎన్నడూ లేనంత వేగంగా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు పవన్ కల్యాణ్. ఈ మద్య కాలములో జనరల్ ఎలక్షన్స్ కూడా లేకపోవడంతో, వీలైనన్ని ఎక్కువ సినిమాలు త్వరగా పూర్తి చేసి ఎలక్షన్స్ జరిగే సమయానికి పార్టీకి పూర్తి సమయం కేటాయించాలని ప్లాన్ చేస్తున్నారు జనసేనాని. ఇటీవలే భీమ్లానాయక్ సినిమా షూట్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది ఈ సినిమా.
అయితే క్రిష్ దర్శకత్వములో రాబోతోన్న సినిమా “హరిహర వీరమల్లు”. ఈ సినిమా కూడా పవన్ కల్యాణ్ ఇప్పటికే 50 శాతం షూట్ పూర్తి చేశారట. 16 శతాబ్దములో మొఘలుల నాటి కాలము బ్యాక్ డ్రాప్ తోఈ సినిమారూపుదిద్దుకోబోతోంది. ఈ సినిమాలో ఒక రాబిన్ హూడ్ లాంటి పాత్ర “హరిహర వీరమల్లు”. ధనవంతుల ఇంటిలోని వజ్రాలను దొంగతనం చేస్తూ, పేద ప్రజలకి పంచిపెట్టే పాత్ర ఇది. పీరియడికల్ బ్యాక్ డ్రాప్ తో వస్తోన్న ఈ సినిమాలో నిధి అగర్వాల్,జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రసిద్ద నిర్మాత ఎ ఎం రత్నం సమర్పిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏప్రిల్ 29 న రిలీజ్ కావచ్చు అని తెలుస్తోంది. పవన్ కల్యాణ్ కెరీర్ లోనే అత్యంత భారీ ఖర్చుతో తీస్తోన్న ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా రాబోతోంది.
అసలు విషయానికి వస్తే, పవన్ కల్యాణ్ కొడుకు అకీరా నందన్ ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్నాడు అని విశ్వసనీయమైన సమాచారం. డైరెక్టర్ క్రిష్ , అకీరా పాత్రను చాలా చక్కగా డిజైన్ చేశాడట. అందువల్ల పవన్ కల్యాణ్ కూడా అకీరా నందన్ ను ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కాబట్టి అకీర నందన్ ఈ సినిమాలో నటిస్తూ, తండ్రితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఈ వార్త గనుక నిజం అయితే ఇంతకంటే మంచి వార్త పవన్ అభిమానులకి మరొకటి ఉండదు.
అయితే ఇప్పటికే కొందరు పవర్ స్టార్ అభిమానులకి ఈ వార్త నిజమే అని తేలడంతో తెలుగునాట ఉన్న పవర్ స్టార్ అభిమానులు ఖుషీలో మునిగి తేలుతున్నారు. వారి ఆనందానికి హద్దే లేకుండా పోతోంది. అయితే అకీరా నందన్ ఇప్పటికే ఒక మరాటీ సినిమాలో బాల నటుడిగా నటించారు. తల్లి రేణూ దేశాయ్ ప్రొడ్యూసర్ గా తీసిన “ఇష్క్ వాలా లవ్” అనే సినిమాలో స్క్రీన్ పై మెరిశారు.