రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిదిగా హాజరైన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పై ఒక రేంజ్ లో విరుచుకుపడ్డాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినీ పరిశ్రమను చిత్రవత చేస్తుంది అంటూ కామెంట్ చేశారు. సినీ పరిశ్రమలో జరగుతున్న అవకతవకలు అలాగే ప్రభుత్వం సినీ పరిశ్రమకు చేస్తున్న మోసాన్ని రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా ఎండగట్టడు పవన్ కళ్యాణ్.
ఇది రిపబ్లిక్ అఫ్ వైసిపీ కాదు రిపబ్లిక్ అఫ్ ఇండియా అంటూ పబ్లిక్ కి వ్యతిరేకంగా ఎవడు కూడా బాగు పడలేదు పైగా వ్యతిరేకంగా ఉన్నవాడిని జనం బైటికి లాకొచ్చి కొడతారు అంటూ హెచ్చారించారు .
ఒక సినిమా నటుడు ఆక్సిడెంట్ అయి పడితే రకరకాల న్యూస్ రాసిన సోషల్ మీడియా మరియు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఫోకస్ చేయాల్సింది. ఇలాంటి విషయలపైన కాదు రాజకీయ నాయకుల రాచకార్యాలపైన అంటూ సూచించారు .
తేజ గురించి ఎన్నో కధనాలు రాసారు కానీ రాయవల్సినవి వైఎస్ వివేకానంద ఎందుకు చంపబడాడు అని , కోడి కత్తితో ఒక నాయకుడిని పోడిచినప్పుడు దాని వెనక కథ ఏంటి ఏంటి , గిరిజనుల భూముల సమస్య పైన ఫోకస్ చేయండి , ఇంకా స్పైసీ కథనాలు కావాలంటే వైసిపీ సానుభూతిపరులు వ్యబిచారాన్ని లీగల్ చేయమన్న వారిపైన కధనాలు రాయండి.
టిడిపీ హయంలో ఉన్నప్పుడు కాపు రిజర్వేషన్ పైన మాట్లాడి తాము అధికారంలోకి వచ్చాక ఎందుకు మౌనంగా ఉన్నారో అడగండి, బోయ వారికీ రాజకీయాల్లో ప్రతినిధ్యం ఎందుకు ఇవట్లేదు అడగండి , ఆడపిల్ల బైటికి వెళ్తే క్షేమంగా ఎలా రావాలో కథనాలు రాయండి అంటూ సూచించారు. హాస్పిటల్ లో కళ్ళు తెరవకుండ కోమాలో ఉన్న తేజ గురించి కాదు రాయటం పొలిటికల్ క్రైమ్ గురించి రాయండి అంటూ తెలంగాణాలో ధియేటర్లు ఉన్నాయి.
ఆంధ్ర ప్రదేశ్ లో ఎందుకు లేవు.. ఇలా నా సినిమాలు గాని మిగిత హీరోల సినిమాలు గాని ఆపేస్తే మీ వద్దకు వస్తాము అనుకోవోద్దు. అరేయ్ సన్నాసుల్లారా… దద్దమ్మల్లారా.. ఒక హీరో రూ. 10 లక్షలు సంపాదిస్తే దాంట్లో సుమారు 45 శాతం ప్రభుత్వానికి టాక్స్ కడుతూ ఉన్నాడు. మేము అడ్డగోలుగా వేల కోట్లు సంపాదించలేదు కష్టపడి ప్రజలను ఎంటర్టైన్ చేస్తూ సంపాదిస్తున్నాం, మీకు నాతోనే సమస్య అయితే నా సినిమాలు ఆపేసి నా వాళ్ళ సినిమాలు ఆడనివ్వండి .
ప్రతి యాక్టర్ తమ ఒళ్ళు హూనం చేస్తూనే డబ్బులు వస్తాయని ప్రభాస్, రాణా బాహుబలి కొరకు కండలు పెంచడానికి ఒళ్ళు హూనం చేస్కున్నాడు .. జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ డ్యాన్సులు వేసి ఎంటైర్ చేస్తారని.. మేమంతా ఒళ్ళు హూనం చేస్కుంటునే మాకు డబ్బులు వస్తాయి మమల్ని ఇలా బ్రతకనివ్వండి అంటూ బావోద్వేగానికి లోనయ్యాడు.
సినిమా వాళ్ళు అంటే మీ లాగా రాజ్యాంగం పైన గౌరవం లేక రాజ్యాంగాన్ని వాడుకుంటూ లక్షలు సంపాదించారు. రాజ్యాంగాన్ని గుండెల్లో నింపుకొని కుల, మత బేదాలు చూపించకుండా అసలైన రిపబ్లిక్ అఫ్ ఇండియా అంటే ఏంటో చూపిస్తునాము.
మరియు నిర్మాతలను సిని పెద్దలను రిక్వెస్ట్ చేస్తు సినీ పరిశ్రమకు ఆయువు అయిన ధియేటర్ లను చేతిలో పెట్టుకోవల్లన్నాడు మనం జాగ్రత్త పడకపొతే డబ్బులు రావన్నాడు. ఒక ప్రైవేటు వ్యక్తి తన కష్టంతో సినిమా తీసినప్పుడు ప్రభుత్వం నియంత్రించడం ఏంటి. రేపొద్దున్న మోహన్ బాబు గారి కాలేజీ సీట్ లు కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది ఫీజులు ఆన్ లైన్ లోనే చెల్లించాలి. అంటే ఒప్పుకుంటారా. మోహన్ బాబు గారి లాంటి వాళ్ళు ముందుకు రావాలి ప్రశ్నించాలి అన్నారు.
అలాగే తన పైన తను విమర్శించుకున్నాడు పవర్ లో లేనోడిని ప్రజలేందుకు పవర్ స్టార్ అంటున్నారు ప్రజలు అర్ధం చేసుకొని తీసేయండి ఆ పేరు అన్నారు . ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్లు అమ్మడానికి ముందుకు రావటానికి కారణం తమ వద్ద డబ్బులు లేక ఇపుడు టికెట్లు అమ్మి వాటి ద్వార వచ్చిన డబ్బును ప్రభుత్వ ఎకౌంటులో చూపిస్తూ బ్యాంకుల వద్ద అప్పులు తీసుకోవాలనే దూరుద్దేశంతో ఉన్నారని దేన్నీ సినిమా పెద్దలు సమర్దించకుండా ప్రశ్నించండి అన్నారు. ధియేటర్ ల కొరకు ప్రశ్నించిన నానిని చాలామంది విమర్శించారు మీకు దైర్యం ఉంటే మీ పొట్ట కూటి కొరకు ప్రభుత్వంతో పోరాడండి అన్నారు.
చివరిగా పవన్ కళ్యాణ్ గారు తన అన్న చిరంజీవి గారిని గుర్తు చేస్తూ మనం ఏ తప్పు చేయన్నప్పుడు మనం ఎందుకు చేతులు కట్టుకొని ప్రభుత్వాన్ని బ్రతిమాలాలి. అంటూ గట్టిగ నిలదీస్తూ అన్నయకు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్.