మా అసోసియేషన్ ఎలక్షన్ తర్వాత అధ్యక్షుడిగా ప్రమాణం స్వీకారం చేసిన విష్ణు, తాజాగా లక్ష్మి మంచు మోహన్ బాబు మరియు తన ప్యానెల్లో కొంతమంది సభ్యులతో కలిసి తిరుపతి బాలాజీ టెంపుల్ ని సందర్శించుకున్నారు. ఆ తర్వాత శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలో విష్ణు మీడియా సమావేశం నిర్వహించగా మా అసోసియేషన్ లో మార్చాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలను తెలియజేశాడు.
మీడియాతో మాట్లాడుతూ అసోసియేషన్ మెంబర్షిప్ అంటే చులకన కాదు ఎవడు పడితే వాడు మెంబర్ అవ్వటానికి వీలు లేదు అన్నారు. అలాగే కొన్ని బైలస్ కచ్చితంగా మార్చాలి అయితే వాటిని మార్చాలంటే సులభం కాదని ఇది ఎంతో మంది సినీ ప్రముఖులతో చర్చించి తీసుకోవాల్సిన నిర్ణయం అని తెలియజేశాడు.
అలాగే ఎలక్షన్ విషయంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని ప్రకాష్ రాజ్ సమక్షంలోనే బ్యాలెట్ ఓపెన్ చేసి ఓట్లు కౌంటింగ్ మొదలు పెట్టారని.అయితే ఆ రోజు రాత్రి ఆలస్యం కావడం మూలంగా మరుసటి రోజున కౌంటింగ్ కొనసాగించమని వీటిలో మూడవ వ్యక్తి ప్రవేశం అసలు లేదని .ఆయనకు వచ్చిన అనుమానం ప్రకారము సి సి ఫుటేజ్ లు చెక్ చేసే అధికారం మా సభ్యుడిగా ఆయనకు ఉందని తెలియజేశారు.
మరియు ప్రకాష్ రాజ్ నాగబాబు ల రాజీనామాను మా అసోసియేషన్ అధ్యక్షుడిగా నేను అంగీకరించడం లేదని సభ్యులు ఎవరు దానికి ఆమోదం తెలుప లేదని తెలియజేస్తూ త్వరలోనే ఈ విషయము వారిద్దరికీ మెయిల్ ద్వారా పంపుతాం అని కూడా అన్నారు.
ఇక ప్రజలలో ప్రస్తుతం చక్కర్లు కొడుతున్న విషయం పవన్ కళ్యాణ్ గారు నన్ను అలై బలై కార్యక్రమం కి నన్ను పిలవలేదని లేదా పట్టించుకోలేదని వార్త విన్నాను. అయితే మీరు అనుకున్నట్టు మా మధ్యలో ఎలాంటి వివాదం లేదు. మెగా ఫ్యామిలీ మరియు మేము మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆ కార్యక్రమానికి వెళ్లడానికి ముందే పవన్ కళ్యాణ్ గారితో నేను చాలా సేపు మాట్లాడాను మరియు చాలా విషయాల పై చర్చించుకున్నాము.
అయితే ఆ ఈవెంట్ ప్రోటోకాల్ ప్రకారం మేము వేదికపైన మాట్లాడుకోలేదు మీడియా వారు మేము మాట్లాడుకున్న సందర్భాన్ని ఫోటోలు తీయక లేదా ఫోకస్ చేయక మేము స్టేజీపైన ఉండగా మాట్లాడుకోని విషయాన్ని హైలెట్ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం సర్ప్రైస్ గా ఉండటానికి ఆయన వీడియో ట్విటర్లో షేర్ చేశాను అన్నారు. మరియు నాన్న గారు చిరంజీవి గారి తో ఫోన్లో మాట్లాడారు ఆ విషయాలు నాన్న గారిని అడిగి తెలుసుకోండి అని విష్ణు అన్నారు.