పవన్ కళ్యాణ్ ని కలిసినా మంచు మనోజ్, కొత్త రాజకీయమా లేక రాజీ ప్రయత్నమా

News

గత కొంత కాలంగా హాట్ టాపిక్ గా ఉన్న మా ఎలక్షన్స్ ముగిసాయి. ఎలక్షన్ తదనంతరము సినీ పరిశ్రమలో వాతావరణం చల్లబడి నట్టుగా ప్రజలు భావిస్తున్నారు. కానీ అస్సలు దుమారం ఇప్పుడే ప్రారంభమైంది అని చెప్పుకోవాలి.

మా ఎలక్షన్ లో జరిగిన సంగతులను పరిశీలిస్తే ఎన్నో అవకతవకలు బయటపడతాయి, ముఖ్యంగా ఎలక్షన్ లో విష్ణు గెలిచిన తర్వాత మోహన్ బాబు గారు తన తనయుడికి సపోర్ట్ గా నిలిచిన ప్రతి ప్రముఖ సినీ యాక్టర్ ని కలిసి కృతజ్ఞతలు తెలియజేస్తూ వస్తున్నాడు.

అయితే జరిగిన ఎలక్షన్లలో ప్రకాష్ రాజ్ ప్యానెల్ విష్ణు ప్యానల్ ఉండగా వాటికి సపోర్ట్ చేసిన వ్యక్తులే ముఖ్యంగా కనిపించారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ను చిరంజీవి ఫ్యామిలీ నడిపిస్తున్న నట్టుగా అనిపించింది అలాగే మరో వైపు ఉన్న విష్ణు ప్యానెల్ను మోహన్ బాబు గారు నడిపించారు. ఇక్కడ ఓటింగ్ అనేది సదరు ప్యానల్ ను సపోర్ట్ చేస్తున్న వ్యక్తులను బట్టి పడినట్టు ప్రేక్షకులు భావిస్తున్నారు.

మా ఎలక్షన్ సమయంలో మెగా ఫ్యామిలీ నుండి పబ్లిక్ గా మాట్లాడిన వ్యక్తి నాగబాబు గారు ఒక్కరే ఆయన తన సపోర్టును ప్రకాష్ రాజు గారికి అందించారు .అయితే ప్రకాష్ రాజు గారు ఓడిపోయే సరికి నాగబాబుగారు మా సభ్యత్వం నుంచి రాజీనామా చేశారు. ఇది మెగా ఫ్యామిలీ లో వారికి జరిగిన చిన్నపాటి అవమానంగా ప్రేక్షకులు పరిగణిస్తున్నారు.

ఇక ప్రస్తుతము మెగా ఫ్యామిలీ లో పరిస్థితులు చిన్న పటి తుఫాను వచ్చినట్టు ఉంది .,, ముఖ్యంగా సినీ ప్రముఖులు గా పరిగణించబడే మెగా ఫ్యామిలీ వారే మా అసోసియేషన్ పట్ల ఆ భద్రత అపనమ్మకం గా ఉన్నట్టు ఫీల్ అవ్వడం వల్ల చిన్న పార్టీ ప్రకంపన మా అసోసియేషన్ లో చోటుచేసుకుంది. ఈ పరిస్థితుల వల్ల మెగా ఫ్యామిలీ రానున్న రోజుల్లో పూర్తిగా మా అసోసియేషన్ కు సంబంధించిన కార్యకలాపాలకు దూరంగా ఉంటుందేమో అని అనిపిస్తోంది.

ఇదే గాక ఎలక్షన్ ప్రారంభానికి ముందు జరిగిన రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ గారు మోహన్ బాబును గురించి సెటైర్లు వేస్తూ మాట్లాడిన విషయం వల్ల విష్ణు నియంతృత్వంలో ఉన్న మా అసోసియేషన్ కి మెగా ఫ్యామిలీ కి కచ్చితంగా ఎడబాటు ఉంటుందేమో అని ప్రముఖుల అంచనా.

ఇక ఎలక్షన్లో గెలిచాక మంచు విష్ణు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు నన్ను ఎలక్షన్ నుండి తప్పుకో మన్నారు అంటూ సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఆ తర్వాత మోహన్ బాబు గారు కూడా చిరంజీవి గారిని పరోక్షంగా విమర్శించినటు కూడా వార్తలు వస్తున్నాయి దీంతో మా అసోసియేషన్ లో ముఖ్యమైనటువంటి నెంబర్స్ మధ్యలోనే విమర్శలు వెల్లువెత్తాయి.

అయితే ఈ పరిణామాల మధ్యలో మంచు మనోజ్ పవన్ కళ్యాణ్ ల బెటి హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు భిమ్ల నాయక్ సినిమా షూటింగ్లో ఉండగా మనోజ్ షూటింగ్ స్పాట్ కి వచ్చి పవన్ కళ్యాణ్ గారి తో సుమారు ఒక గంట పాటు చర్చించారు. అయితే ఈ చర్చ లో ఎలాంటి విషయాలు మాట్లాడుకున్నారో బయటికి తెలియనప్పటికీ ప్రస్తుతం జరిగిన పరిస్థితులను చక్కబెట్టాలని ప్రయత్నిస్తున్నారు మనోజ్ చేస్తున్నాడని మాత్రము అర్థమవుతుంది . అయితే ఇది ఒకవైపు వాదన మాత్రమే.

మరొక వాదన ప్రకారం ఈ పరిస్థితులను చక్కగా మార్చే ప్రయత్నం స్వయానా మోహన్ బాబు గారు తీసుకున్న నిర్ణయమే మని మనోజ్ ను రాయబారిగా పంపించి తమ మనసులోని మాట తెలియజేశారు అనే వాదన కూడా ఒకటి వినిపిస్తోంది. అయితే ఇవన్నీ కూడా ఊహించినవే కానీ వారు వాస్తవానికి ఏం మాట్లాడుతున్నారో తెలియాల్సి ఉంది. ఇక వీరి ఈ భేటీ ఆటు పొలిటికల్ గా ఇటు మా అసోసియేషన్ పరంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అయితే అభిమానులు వీరిద్దరి బేటి వల్ల కొత్త పరిణామాలు చిత్ర పరిశ్రమలో రాకూడదని కోరుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *