Pawan Kalyan Rajamouli Film : రాజమౌళి గారు అంటే ఎంటో ఆయన క్యాలిబర్ ఏంటో మనందరికీ తెలుసు, మన తెలుగోడి క్యతిని ప్రపంచ దేశాల ముందుకు తీసుకెళ్లిన దర్శక ధీరుడు , ఆయన నిర్మించిన సినిమాల్లో ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా దేశమంతటా పేరు సంపాదించుకున్నాడు.
ఇక ఈయన నిర్మించే సినిమాలో హీరోగా చేశారంటే ఆ వ్యక్తి పంట పండినట్టే, భారీ బడ్జెట్ భారీ గ్రాఫిక్స్ భారీ కథతో లేట్ అయినా సూపర్ సినిమాలను నిర్మించే ఆయన ఎంతో మంది హీరోలకు క్విక్ స్టార్ట్ గా ఉన్నారు. ప్రభాస్ ఎన్టీఆర్ వంటి వారు రాజమౌళి ద్వారా చెక్కబడిన శిల్పాలు అని చెప్పవచ్చు.
Pawan Kalyan Rajamouli Film
ఇక ఇంత గొప్ప సక్సెస్ సాధించిన డైరెక్టర్ రాజమౌళి టాలీవుడ్ లో కెల్లా గొప్ప పేరు ఉన్న మెగా బ్రదర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో సినిమాలు లేక పోవడం ప్రజలలో ఒక అసంతృప్తి గా ఉంది. గతంలో మెగా వారసుడు రామ్ చరణ్ తో తీసిన మగధీర తప్ప ఇతర మెగా ఫ్యామిలీ మెంబర్స్ తో రాజమౌళి గారు సినిమా తీయలేదు.
తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్దలు గా ఉన్నా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా చూడాలని ప్రేక్షకులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ విషయంపై రాజమౌళి గారు స్పందించారు, ఒక కాలేజీ ఫంక్షన్ కు హాజరైన పవన్ కళ్యాణ్ కు ఆయన చేయబోయే సినిమా కథ చెప్పాలని ప్రయత్నం చేశాడట. అయితే ఏవో కారణాల వల్ల ఆయనకు కథ చెప్పడము వీలుపడలేదు అట.
అలా రాజమౌళి గారు సుమారు ఒక సంవత్సరం పాటు ఆయనకు కథ చెప్పి ఆయనను ఒప్పించాలని ప్రయత్నం చేశారట కానీ పవన్ కళ్యాణ్ గారు ఉండే బిజీ వల్ల ఆయన ను కలవడం వీలు పడలేదని మరియు ఆయనకు కథ విని అంత సమయం కూడా లేదని అందువల్ల నేను అనుకున్న ప్రాజెక్టు మధ్యంతరంగా ఆగిపోయింది అన్నారు. ఇక ఆ సినిమా ఆపేసి మిగతా కథల పై దృష్టి సారించి సినిమాలు కొనసాగించానని తెలియజేశారు రాజమౌళి గారు. రాజమౌళి గారు ఈ విధంగా మాట్లాడిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.
అయితే పవన్ కళ్యాణ్ గారు రాజమౌళి కథ వినక పోవడానికి మరో కారణం రాజమౌళి ఏ సినిమా అయినా చాలా వ్యవధి తీసుకుని చేస్తాడని పవన్ కళ్యాణ్ ఏమో రాజకీయాల్లో బిజీగా ఉన్నాడని ఇక వీరిద్దరి వ్యక్తిగత విషయాలో ఎవరికి వారు బిజీగా ఉండే వారు గనుక చిత్రం తీయడం వల్ల పవన్ కళ్యాణ్ గారి ఎంతో సమయం వృధా అవుతుందని అందుకే రాజమౌళి గారికి ఆయన స్పందించలేదు అనే వాదన కూడా వినిపిస్తోంది.
Also read
బాహుబలి సినిమా పన్ను ఎగవేసిన రాజమౌళి అండ్ టీం
రాజమౌళి తర్వాత సినిమా మహేష్ బాబు తోనే
ఒకప్పుడు RGV హీరో.. ఇప్పుడు పెద్ద జీరో
దర్శకుడు రాజమౌళి ని ‘బోడి నా కొడుకు’ అంటూ వర్మ షాకింగ్ కామెంట్స్