Pooja Hegde: షర్ట్ విప్పేస్తూ దిగిన ఫోటో వైరల్.

Trending

ప్రస్తుత కాలంలో టాప్ హీరోయిన్ గా ఎదుగుతున్న పూజా హెగ్దే , పెద్ద పెద్ద హీరోల సరసన నటిస్తూ వరస విజయాలు ను తన ఖాతాలో వేసుకుంటుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న రాధేశ్యాం సినిమాలో ప్రభాస్ సరసన కథానాయకిగా పూజ నటిస్తున్నారు ఈ సినిమా ప్యాన్ ఇండియా సినిమా కాగా పూజా హెగ్దే రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక 2022 ఫిబ్రవరి 4న రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమా రిలీజ్ కానుండగా ఆ సినిమాలో కూడా పూజా హెగ్దే హీరోయిన్ గా కనిపించనున్నారు.
ఇలా సక్సెస్ తో దూసుకెళ్తున్న ఈమె తాజాగా తన పుట్టిన రోజు జరుపుకుంటున్న ఫోటోలు ఇంటర్నెట్ లో షేర్ చేయగా అవి ప్రస్తుతం విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి.

అక్టోబర్ 13 1990 లో ముంబై లో జన్మించిన పూజా హెగ్దే స్వస్థలం కర్ణాటకలోని మంగళూరు , ఆమె తల్లిదండ్రులు మంజునాథ్ హెగ్దే, లత హేగ్దే. వీరు బొంబాయిలో స్థిర పడ్డ కుటుంబం కానుండటంతో పూజా హెగ్దే బాల్యము మరియు విద్య ముంబైలోనే సాగింది, ఆమె విద్యతో పాటు భరతనాట్యం వంటి కళలను నేర్చుకున్నది, ఆమె ఇంటర్మీడియట్లో ఉండగా డాన్స్ షో మరియు ఫ్యాషన్ షో లా వంటివాటిలో పాల్గొనేది.

కాలేజీ విద్య పూర్తయిన తర్వాత పూజా హెగ్దే మోడలింగ్ పరిశ్రమలో అడుగుపెట్టింది, బిర్యానీలు పిజ్జా లు ఇష్టంగా తినే పూజ కనీసం రెండు గంటల పాటు యోగా మరియు ఇతర వర్కౌట్లు చేస్తూ తన బరువును కంట్రోల్ గా ఉంచుకుంటుంది. యాభై మూడు కేజీల బరువు 5.9 అంగుళాల పొడవు ఉన్న ఈమె 2009 లో జరిగిన మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నగా మొదటి రౌండ్ లోనే రిజెక్ట్ కాగా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించి 2010లో మిస్ యూనివర్స్ పోటీ కొరకు భారతదేశం నుండి ఎంపికైన మహిళలో పూజా రెండవ స్థానంలో నిలిచింది.

పూజాది స్వతహాగా కన్నడ కుటుంబం అయినప్పటికీ బొంబాయిలో పెరిగినందున మరాఠీ హిందీ ఇంగ్లీష్ వంటి భాషలో మాట్లాడా గలదు. వాస్తవానికి పూజ కుటుంబం కర్ణాటకలో తులు మాట్లాడే వారు అందువల్ల ఆమెకు తులు భాష అనర్గళంగా వచ్చు. ఇక తన వృత్తి పరంగా వివిధ ప్రాంతాలకు వెళ్లిన ఆమె ఆమె దక్షిణ భారతంలోని తమిళ్ మరియు కన్నడ భాషలు నేర్చుకుంది.

pooja-hegde-viral-photos

పూజా నాన్నగారు ఒక వ్యాపార వేత్త మరియు ఆమె తల్లి క్యు నెట్వర్క్ బిజినెస్లో నిపుణురాలు దాంతో పూజకు కూడా నెట్వర్కింగ్ పట్లా ఖచ్చితమైన అవగాహన ఉండేది, మరియు తన డబ్బు తానే సంపాదించుకుని ఖర్చు చేసేది, అయితే పూజ కు షాపింగ్ విషయంలో ఉన్న బలహీనత వల్ల తాను సంపాదించిందంతా అవసరానికి మించి షాపింగ్ లో ఖర్చు చేసేది.

తర్వాత చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఆమె తమిళంలో విడుదలైన మూగ ముడి సినిమాలో జీవ సరసన హీరోయిన్ గా నటించింది ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా యావరేజ్ టాక్ అందుకుంది . తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమకు నాగ చైతన్య హీరోగా నటించిన ఒక లైలా కోసం సినిమా లో హీరోయిన్ గా తెలుగు సినీ ప్రేక్షక ప్రపంచానికి పరిచయమైంది అయితే వరుణ్ తేజ్ హీరోగా నటించిన ముకుంద సినిమా లో హీరోయిన్ గా చేసిన పూజ గోపికమ్మ పాట ద్వారా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత ఆమెకు బాలీవుడ్ నుండి అవకాశాలు రాగా హృతిక్ రోషన్ సరసన కథానాయకిగా మొహంజోదారో సినిమాలో నటించింది.

పూజ ఇప్పటి వరకు తెలుగులో కేవలం ఎనిమిది సినిమాలు మాత్రమే నటించినప్పటికీ ఆమె తెలుగులో గొప్ప గొప్ప స్టార్ కి బెస్ట్ ఆప్షన్ గా పోటీపడి నటిస్తుంది. రంగస్థలంలో జిగేల్ రాణి గా మెరిసిన ఈమె అరవింద సమేత మహర్షి అలా వైకుంఠపురం వంటి సినిమాలతో హ్యాట్రిక్ కొట్టి పెద్ద పెద్ద హీరోలకు బెస్ట్ ఆప్షన్ గా పరిశ్రమలో రాణిస్తోంది. ఇక తాజాగా అఖిల్ హీరోగా తెరకెక్కిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలు నటించింది. ప్రస్తుతం ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబడుతోంది.

ఇంత సక్సెస్ సాధించిన ఈమెకు వ్యక్తిగత జీవితంలో కొన్ని బాధ కలిగించే విషయాలు కూడా ఉన్నాయని చెప్పింది. అలా ఆమెకు బాధ కలిగినప్పుడు పదిహేను నిమిషాలపాటు గట్టిగా ఏడ్చేస్తాను అని అలా ఏడిస్తే మనసు కుదుట పడుతుంది అని ఓప్రా విన్ ఫ్రే వద్ద నుండి ఈ ట్రిక్ ను నేర్చుకున్నాను అని చెబుతుంది.
ఇక పూజ తాజాగా ఒక ఫోటో షూట్ లో షర్ట్ విప్పేస్తూ దిగిన ఒక ఫోటోకు ఇక్కడ కాస్త వేడిగా ఉందంటు రెండు లైన్లు జోడించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతూ వైరల్ గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *