Pooja hegde

తన రిలేషన్ షిప్ ను ఎప్పుడూ బయట పెట్టబోతుందో క్లారిటీ ఇచ్చిన పూజ హెగ్దే

Trending

ప్రస్తుత కాలంలో తెలుగు హీరోయిన్ లలో ఎక్కువ అవకాశాలు కలిగి ఉన్న హీరోయిన్ పూజా హెగ్దే, ఇండస్ట్రీలో ప్రస్తుతం రిలీజ్ అవుతున్న మరియు రిలీజ్ కాబోతున్న భారీ ప్రాజెక్ట్ సినిమాలలో పూజా హెగ్డే నటించనున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్దే చేస్తున్న విషయం తెలిసిందే, అదే సమయంలో లో మెగా స్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో కూడా పూజా హెగ్దే నటిస్తున్నారు, ఇక ప్రస్తుతం రిలీజ్ అయి మంచి టాక్ అందుకుంటున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాల్లో కూడా నటించి తన నటనకు మరింత మెరుగు పెట్టారు.

ప్రస్తుత కాలంలో ఇంత భారీ సినిమాలు కలిగిన హీరోయిన్ పూజా హెగ్దే మాత్రమేనని క్లియర్ గా చెప్పవచ్చు. వరుస విజయాలతో వెళ్తున్న పూజా హెగ్డే రకరకాల మాధ్యమాల ద్వారా ప్రజల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ అలాగే ఎన్నో ఈవెంట్ ల ద్వారా ప్రజలు తన నుండి కోరుకుంటున్నా నటనను అందిస్తానని వాగ్దానం చేస్తూ వస్తున్నారు.

Pooja hegde

తాజాగా తన బిజీ షెడ్యూల్ తో దూసుకెళ్తున్న పూజా హెగ్దే ప్రజలతో ముచ్చటించడానికి సోషల్ మీడియా ను వేదికగా చేసుకుని ప్రజల రకరకాల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ వచ్చింది, ఈ క్రమంలో ఒక నెటిజనుడు పూజా హెగ్దే ను ఒక ఆశ్చర్యకరమైన ప్రశ్నను అడిగాడు, మన ఇద్దరి రిలేషన్షిప్ గురించి ఎప్పుడు బయట పెడదాం అని పూజ హెగ్డే ను నెటిజనుడు అడగగా, ఆ ప్రశ్నకు క్రేజీ గా రియాక్ట్ అయ్యి ఆ నెటిజనుడికి కి దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చింది. నెటిజనుడు మన బంధం గురించి ఎప్పుడు బయట పెడదాం అని అడిగినప్పుడు ‘ రక్షా బంధన్ ‘రోజున అంటూ కౌంటర్ ఇచ్చింది పూజా హెగ్దే. ఇక తాను ఇచ్చిన ఈ తెలివైన సమాధానము తో తన అభిమానులు ఫిదా అయిపోయారు.

ఆ తర్వాత తాను నటిస్తున్న ఆశ్చర్య సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా తన సిని కెరీర్ లోనే ప్రత్యేకమైన సినిమాగా ఉండిపోతుందని, ఈ సినిమాలో నీలాంబరి సాంగ్ ఒక కన్నుల పండుగ అని అది తనకు ఎంతో ప్రత్యేకమైందని పేర్కొన్నది.
అలాగే మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా చూసిన చిరంజీవి గారు తను అభినందిస్తూ ఒక మెసేజ్ పంపారని దాని ద్వారా మరింత కష్టపడాలని ఆసక్తి నాలో కలిగిందని ఆమె అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *