మాయాజాలం సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన పూనం కౌర్ తెలుగుతోపాటు తమిళ చిత్రాలలో కూడా నటించింది, అయితే తాను సినిమాల్లో కంటే కూడా ఎక్కువగా వివాదాల వల్లే ఫేమస్ అయింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే పూనం కౌర్ ఈ మధ్యలో మాటిమాటికి చర్చలోకి వస్తున్నారు.
ఏపటికప్పుడు పూనం కౌర్ ఏదోక వివాదం తో సంచలనం సృష్టిస్తూ వార్తల్లో కెక్కుతరు. తాజాగా పోసాని గారు పూనం పైన చేసిన వ్యాఖ్యల తరవాత ఆమెను సోషల్ మీడియాలో అభిమానులు మరియు మీడియా వారు చాలా మంది గమనిస్తు వచ్చారు.
ఈ తరుణంలో కొద్ది రోజుల క్రితం, పూనమ్ కౌర్ ట్విట్టర్లో ప్రకాష్ రాజ్‌తో కలిసి దిగిన ఒక పిక్‌ను షేర్ చేశారు ఆ పిక్ నేటింట్లో వైరల్ గా నిలిచింది .మరియు మా అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవి కోసం పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్ గారికే తన మద్దతు ఇస్తానని అనేసరికి ఈ వార్త ఇంక వైరల్ అయింది.
అయితే తాజాగా పూనమ్ కౌర్ #pklove అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఆమె కొన్ని ఫోటోలను పంచుకోవడం కూడా అభిమానులు గమనించారు. అయితే .షాట్ ఫామ్ లో పూనం రాసిన Pk ఎవరు పూనమ్ కౌరా లేదా పవన్ కళ్యానా అని ఆమె అభిమానులు అర్థం చేసుకోలేకపోతున్నారు.
నెటిజనులు #PKLOVE ను డీకోడ్ చేసే పనిలో పడ్డారు : Pk love అంటే పవన్ కళ్యాణ్ లవ్ కదు రా బాబు పూనమ్ కౌర్ లవ్ అని అర్ధం అని , మరొకరు మీరు మాకు ఏదైనా చెప్పాలనుకుంటే, దయచేసి నేరుగా ముందుకు వచ్చి చేప్పంది కానీ సాగదీసి మమల్ని పిచ్చోలను చేయొద్దు దయ చేసి షార్ట్ కట్ మెసేజులు పెట్ట కండి అని , మరొక్కరైతే PKLOVE పవన్ కళ్యాణ్ ప్రేమ అనే కదా వదిన అనేసాడు, మరొకరు ఈమెకు మన పవన్ కళ్యాణ్ పడిపోయాడు అంటే నేను నమ్మనని , రక రకాల కామెంట్లు ఆ పోస్ట్ కింద పెడుతూ ఉన్నారు అభిమనులు.
#pklove pic.twitter.com/SsnBORfjLW
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) October 7, 2021
కొంతమందైతే PK అంటే పవన్ కళ్యాణ్ లేదా పూనమ్ కౌర్ ఎందుకు అనుకోవాలి పీకే అంటే పోసాని కృష్ణ మురళి కూడా అయి ఉండొచ్చని వ్యంగ్యంగా కామెంట్ చేస్తున్నారు.